పుణ్య నదులు
గంగ :: మంగళ తరంగ - ఇందులో స్నానం చేసేవారు సురలోక వాసులౌతారు. "గంగా జలం సాక్షాత్తు విష్ణువు" అన్నాడు శ్రీ రామకృష్ణ పరమహంస. గంగ నీరుకాదు, నిప్పు అన్నారు. మన పాపాలన్నీ కడగడానికి ఆ తల్లి ఊర్ధ్వలోక నుంచి విష్ణు పదం నుండి వచ్చింది. అలా వస్తూ వ్యోమకేశం అంటే శివుని జత జూటం నుంచి భూమిపైకి దుమికింది. "విష్ణు విగ్రహ సంభూతా ద్రవరూప సనాతనీ..." అది సాక్షాత్తు విష్ణు స్వరూపం నీటి రూపం ధరించిన విష్ణు శక్తి. గంగా జలంలో ప్రతి బిందువు గోవిందుడే. "సుఖస్పర్శా స్నానపానే విర్వాణపదదాయినీ" - గంగాజల స్నానం చేసినా, గంగాజలం పానం చేసినా నిర్వాణ పదం లభిస్తుంది. గంగాతీరంలో నారాయణుణ్ణి తలచుకొని ఆ నీటిని పానం చెస్తే సకల రోగాలన్నీ పోతాయట. అదే 'ఔషదం జహ్నవీ తోయం వైద్యో నారాయణోహరిః' అన్న మాటలోని ఆంతర్యం. అమ్మవారి ప్రధానాంశలు మొత్తం ఎనిమిది ఉన్నాయి. వాటిలో మొదటిది - "ప్రధానాంశ స్వరూపాణాం గంగా భువన పావనీం". అమ్మవారి ప్రధాన అంస స్వరూపం - గంగ. ఆ తల్లిని తలచుకుంటే ధనులవుతాం. కలియుగంలో ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అనుకునేవారికి... "కలియుగంబున నరునకు గంగ దిక్కు" అన్నారు.
గంగానది గురించి శంకర భగవత్పాదులు ...
దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువన తారిణి తరళతరంగే!
శంకరమౌళి నివాసిని విమలే మామ మతిరాస్తాం తవ పదకమలే!!
భాగీరథి సుఖదాయిని మాతస్తవ జలమహిమా నిగమే ఖ్యాతాః
నాహం జానే తవ మహిమానాం త్రాహి క్రుపామయి మామజ్ణానమ్!!
గోదావరి :: గోదావరి దివ్య నది. గోహత్య, బ్రహ్మహత్యాది పాపాలను తొలగిస్తుంది. ఈ నదికి దక్షిణ తీరాన గౌతమ మహారిశిసు ప్రతిష్ఠింపబడిన గౌతమేశ్వరాలయం ఉన్నది. (మంథవి) మాహమాసంలో నియమానుసారం స్నానాదు చేస్తే ఎదుజన్మల పాపాలు పోతాయి. కొన్ని ప్రాంతాల్లో గోదావరిని గంగ అని పిలుస్తారు.
ప్రయాగ :: ఈ ద్రివేణి సంగమం లో స్నానం చేసేవారు సర్వపాప విముక్తులై సురలోక సౌఖ్యం అనుభవిస్తారు.
నైమిశారణ్యం :: సౌనకాది మహామునులు, యజ్ఞాలు చేసిన పుణ్యభూమి.
శమంత పంచకం :: ఇహపర సుఖలిచ్సు దివ్య తీర్థం.
కురుక్షేత్రం :: శ్రీకృష్ణుడు, అర్జునునికి గీతోపదేశం చేసి, విశ్వరూప దర్శనమిచ్చాడు. భీష్ముడు తనువూ చాలించి, ముక్తి పొందాడు. ఇక్కడ త్రికోటి తీర్థాలున్నాయని వాయుదేవుడు చెప్పాడు.
అవంతీ :: ఈ నగరంలో మాఘస్నానం చేసేవారికి శివలోక ప్రాప్తి సిద్ధిస్తుంది.
అయోధ్య :: మంధాత, హరిశ్చంద్రుడు, శ్రీరాముడు మున్నగు సూర్యవంశ రాజులుదయించిన మహానగరం. ఈ పట్టణానికి ప్రక్కనే సరయూనది ప్రవహిస్తుంది. మాఘ మాసంలో అయోధ్యలో స్నానం చేస్తూ దేవతలకూ, పితృ దేవతలకు తర్పణాలిస్తె అటూ, ఇటూ 20 తరాల వారి తరిస్తారు.
మధువనం :: మాహమాసంలో ఇక్కడ స్నానం చేసినవారు విష్ణుసాయుజ్యం పొందుతారు.
యమున :: నీల తరంగమూర్తియైన యమున క్రుష్ణునికెంతో ఇష్టమైనది. దీనిలో స్నానం చేసినవారు ముక్తిని పొందుతారు.
వైకుంఠ ద్వారక :: విశ్వకర్మ నిర్మించిన ఈ పట్టణంలో ధర్మ సంస్థాపనకై అవతరించిన విష్ణువు శ్రీక్రుష్ణునిగా నివసించాడు. సూర్యుడు మకర రాశిలో ఉండగా మాఘస్నానం చేస్తే సురలోక వాసులవుతారు.
మాయావతి :: ఇక్క 'మల ప్రహారిణి' అనే నది ప్రవహింస్తుంది. ఈ నదిలో స్నానం చేసేవారి కల్మషాలను హరిస్తుంది. కనుక దీనికి 'మల ప్రహారిణి' అనే పేరు సార్థకమైంది. ఇక్కడ మాఘమాస వ్రతం చేసినవారు ఉభయలోక సఊఖ్యాలు పొందుతారు.
సరస్వతి :: ఈ నదిలో స్నాన చెస్తే సరస్వతి అనుగ్రహం కలిగి చివర బ్రహ్మ రంధ్రం ద్వారా ప్రాణాలు విడిచి, బ్రహ్మపదం పొందుతారు.
గంగా సాగర సంగమం :: గంగ సముద్రంలో కలిసేచోట మాఘ మాస స్నానం చేసి తిలలను తినిపిస్తూ, నల్లని అవును దక్షిణతో sahA దానమిస్తే స్వర్గస్థులవుతారు.
కాంచి :: దక్షిణ భారతదేశంలో పరమపావనమైన పట్టణం కంచి. మహావిష్ణువు లక్ష్మిదేవితో అవతరించిన ప్రదేశం. అక్కడ స్నానాదులు చేసినవారి పుణ్యం కోతి రెట్లు. అందుకే పుణ్యకోటి అంటారు. ఈ పట్టణానికి దక్షిణంగా వేగావతి నది ఉన్నది. ఈ నదిలో మాఘస్నానం చేసిన సర్వపాపాలు నశించి, స్వర్గసుఖాలనుభవిస్తారు.
త్రయంబకం :: త్రయంబకమనగా ముల్లోకాల్లో పేరుపొందిన పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రంలో మాఘస్నానం చేస్తే తప్పక ముక్తి లభిస్తుంది.
"కావేరి తుంగ భద్రాచ క్రుష్ణవేణీచ గఊతమీ భాగీరథీ విక్యాతాః పంచగంగా ప్రకీర్తితాః !!"
ఈ ఐదు జేవనదులను పంచగంగలంటారు.
పంప :: కాలాత్మక పట్టణానికి ఉత్తరం వైపు పంపానది ఉంది. దక్షిణ వైపు అదే పేరుతో మరొక పట్టణం ఉంది. మాఘమాసంలో ఉదయకాలంలో స్నానం చేసినవారు కైలాసవాసులవుతారు.
ప్రభాస తీర్థం :: పంపానదికి అల్లంత దూరంలో లోక సంరక్షణకై శివుడు లింగరూపంలో అవతరించాడు. ఈ తీర్థానికి ప్రభాసం అని పేరు.
ఇలా మన పుణ్య భారతదేశంలో ఎన్నో, ఇంకెన్నెన్నో!
మాసాలన్నింటిలో మాఘమాసం ఉత్తమోత్తం. 'మాఘే నమగ్నాస్సలిలే సుశీతే విధూత పాపాస్త్రి దివం ప్రయాంతి" మాఘమాసంలో చన్నీటి స్నానం చేసిన వారు పాప విముక్తులవుతారు.

No comments:
Post a Comment