What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Sunday, 20 July 2014

కిడ్నీలో రాళ్ళు

కిడ్నీలో రాళ్ళు అనగానే ఆపరేషన్‌ ఒక్కటే మార్గం అని చాలా మంది భావిస్తుంటారు. నిజానికి ఆపరేషన్‌ చేసి రాళ్ళు తీసివేసినా మళ్లీ తయారవుతూనే ఉంటారుు. అందులో రాళ్ళు వాటంతట అవే పడిపోయేలా చేయడమే కాకుండా రాళ్ళు తయారయ్యే శరీరగుణాన్ని మార్చే హోమియో చికిత్సను ఎంచుకోవడం ఉత్తమం అంటున్నారు హోమియో వైద్యులు డాక్టర్‌ కవిత.

- మాంసహారం, పాలకూరతో నష్టం ఎక్కువ
- మంచినీరే తొలి చికిత్స
- స్ర్తీల కంటే పురుషూల్లోనే అవకాశాలు ఎక్కువ
- ఆపరేషనే పరిష్కారం కాదు
- హోమియోచికిత్సతో కిడ్నీ స్టోన్స్‌కు చెక్‌

ఎక్కువ మందిలో కనిపించే సమస్య కిడ్నీలో స్టోన్స్‌. తీసుకునే ఆహారం, శరీరతత్వం వంటివి స్టోన్స్‌ ఏర్పడటానికి కారణమ వుతున్నాయి. మూత్రపిండాల్లో రాళ్ళు గట్టిగా క్రిస్టల్‌ రూపంలో ఉంటాయి. ఇవి మూత్రపిండాల్లో గానీ, మూత్రనాళాల్లో గానీ ఏర్పడ తాయి. కిడ్నీలో రాళ్ళు ఏర్పడినట్లయితే నెఫ్రోలిథియాసిస్‌ అని, మూత్రనాళాల్లో ఉంటే యూరోలిథియాసిస్‌ అని అంటారు. కిడ్నీలో రాళ్ళు ఎవరిలోనైనా ఏర్పడవచ్చు. అయితే స్ర్తీలలో కంటే పురుషుల్లో ఎక్కువగా ఏర్పడతాయి. 20 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సున్న వారి లో ఈ సమస్య కనిపిస్తుంది. 20 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సున్నప్పుడు కిడ్నీ స్టోన్స్‌ ఏర్పడితే భవిష్యత్తులో మళ్లీ మళ్లీ రావ డానికి అవకాశాలుంటాయి. ఒకటి కంటే ఎక్కువ స్టోన్స్‌ ఏర్పడినప్పు డు కూడా సమస్య పునరావృతమయ్యే అవకాశం ఉంటుంది.
ఆహారమూ కారణమే...
మాంసాహారం, చక్కెర, ఉప్పు ఎక్కువగా తీసుకోవడం కిడ్నీ స్టోన్స్‌కు కారణమవుతాయి. విటమిన్‌ డి సప్లిమెంట్లు ఎక్కువగా తీసుకున్నా, పాలకూర ఎక్కువగా తిన్నా ఆక్సలేట్‌ స్టోన్స్‌ ఏర్పడటానికి అవకాశం ఉంటుంది.

నిర్ధారణ...
పైన చెప్పిన లక్షణాలు ఉన్నప్పుడు కిడ్నీ స్టోన్స్‌ను నిర్ధారించుకోవడానికి స్కానింగ్‌ చేయించుకోవాలి. ఈ పరీక్ష ద్వారా స్టోన్స్‌ ఉన్న ప్రదేశం, సైజు తెలుసుకోవచ్చు. కొన్ని రకాల రక్తపరీక్షలు, యూరిక్‌ ఆసిడ్‌ లెవెల్స్‌ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది.

ఆపరేషన్‌ ఒక్కటే మార్గమా?...
మూత్రపిండాల్లో రాయి మూలంగా తీవ్రమైన నొప్పి ఉంటుంది. చాలా మంది నొప్పిని భరించలేక ఆపరేషన్‌కు సిద్ధపడుతుంటారు. ఆపరేషన్‌ తప్ప వేరే మార్గం లేదని కూడా చాలా మంది భావిస్తుంటారు. కానీ ఆపరేషన్‌ చేసి రాళ్ళు తొలగించినా మళ్లీ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆహార నియమాలు పాటించని వారిలో సర్జరీ చేసి తీసివేసినా 6 నుంచి 8 నెలల్లో తిరిగి ఏర్పడటానికి ఆస్కారం ఉంది. కాబట్టి సర్జరీకి వెళ్లేముందు అన్ని విషయాలు ఆలోచించుకోవాలి.

హోమియో చికిత్స
ఆపరేషన్‌ అవసరం లేకుండా మందులతో రాళ్ళు పడిపోయేలాచేయడం హోమియో వైద్య విధానంలో శరీరంలో రాళ్ళు తయారయ్యే గుణాన్ని మార్చేలా చికిత్స అందించడం జరుగుతుంది. దీనివల్ల రాళ్ళు మళ్లీ మళ్లీ ఏర్పడటం జరగదు. శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఎటువంటి సైడ్‌ ఎఫెక్ట్‌‌స ఉండవు. హోమియో మందులు వాడుకుంటూ ఆహార నియమాలు పాటిస్తే కిడ్నీ స్టోన్స్‌ సమస్యను సులువుగా అధిగమించవచ్చనడంలో సందేహం లేదు. కిడ్నీలో స్టాన్స్‌ ఉన్నాయని తెలిసిన వెంటనే అనుభవజ్ఞులైన వైద్యుని పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటే సరిపోతుంది.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML