What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Saturday, 26 July 2014

ఇతర మతములలో నిర్గుణ స్వరూపమును మాత్రమే వివరించియున్నాు. అట్లయిన ఎవరికి మందిరము? ఎవరని ధ్యానించవలెను? ఎట్లు చేయవలెను? ఎవరికి పూజ మొదలగునవి చేయవలెను. వాటికి సమాధానముండదు

ఇతర మతములలో గ్రంధములను ఒక్కొక్క గ్రంధమును ఒక్కొక్క మహాపురుషుడే రచించెను. ఆ ధర్మ గ్రంధములలో భగవంతునియొక్క నిర్గుణ స్వరూపము చెప్పబడినది. కానీ హిందూ ధర్మ గ్రంథములు ఏ ఒక్క మహాపురుషుని రచనలు  కావు. అనాది కాలమునుండి వేద పరంపర ద్వారా వచ్చుచున్నది. ఇందులో ఏ ఒక్క వ్యక్తియొక్క బుద్ధితో పనిలేదు. కాబట్టి దీనిలో తొట్రుపాటు ఉండదు. కానీ అదే ఒక మహాపురుషుని బుద్ధిపై ఆధారపడినపుడు పొరపాటునకు అవకాశము కలదు. ఇతర మతములలో నిర్గుణ స్వరూపమును మాత్రమే వివరించియున్నాు. అట్లయిన ఎవరికి మందిరము? ఎవరని ధ్యానించవలెను? ఎట్లు చేయవలెను? ఎవరికి పూజ మొదలగునవి చేయవలెను. వాటికి సమాధానముండదు. అందుకని హిందూధర్మము సగుణ నిర్గుణ స్వరూపములు రెంటిని సాధనములుగా స్వీకరించినది. కావున ఇచ్చట లక్ష్యమైనట్టి నిర్గుణమును లక్షణమైన సగుణము తెలుపుతున్నది. మధుర పదార్ధమైన కలకండ యొక్క ఉనికి, సత్తద్వారా గ్రాహ్యము కాని దాని రుచి, ఆస్వాదము వలననే అనుభవమగును. ఈ విధముగనే సగుణ స్వరూపమును కనులతో చూచుచు ధ్యాన పూజాదికములు చేయుచు మనోమందిరమునందు విగ్రహమును ప్రతిష్ఠించుకొని నిర్గుణమైన భగవంతుని స్వరూపమును ఆనందించవలెను. మిగితా మతస్తులు దేవునియొక్క నిర్గుణ స్వరూపమును సర్వవ్యాపకముగ చెప్పుచున్నారు. కానీ భగవంతునికి నిజమైన స్థానమును తెలుపలేదు. హిందూధర్మములో సర్వవ్యాపియైన భగవంతునికి సర్వత్ర స్థానము కలదని చెప్పుదురు. ఒకే బంగారమును వివిధములైన ఆభరణములుగా మార్చవచ్చు. దాని వలన వాటి రూపములో మార్పుండును, గాని బంగారము మార్పు చెందదు. ఇదేవిధముగ నిర్గుణ స్వరూపమైన భగవంతుడు వివిధములైన సగుణాకారములను పొందును. కాని తత్త్వము మారదు.




No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML