What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Sunday, 20 July 2014

దిలీప మహారాజు

శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్టితాత్
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః!!
స్వధర్మ పాలన చేయు వారికి శ్రేయోలాభములు కుగునని పురాణేతిహాసములు నిరూపించుచున్నవి.

దిలీప మహారాజు తన క్షాత్ర ధర్మమును పాటించుచు ఒక గోవును రక్షించుటకై తన శరీరమునే ఒక సింహమునకు అర్పించుటకు సిద్ధపడి, తన అభీష్టమును పొందెను. శిబి చక్రవర్తి శరణాగత రక్షణకై స్వధర్మమును ఆచరిన్చుచు ఒక పావురమునకు మారుగా తన శరీరమునుండి మాంస ఖండములను కోసి ఇచ్చి మరణించుటకు సన్నద్ధుడాయెను. ఫలితముగా అభీష్టము నెరవేరెను. ప్రహ్లాదుడు భగవద్భక్తి రూపమైన స్వధర్మమును పాటించుచు పెక్కు పర్యాయములు మృత్యు ముఖమును చేరుటకు సిద్ధపడెను. ఫలితముగా అతనికి పరమ శ్రేయస్సు లభించెను. ఈ విధముగా పురాణేతి హాసములలో ఇంకనూ అనేక ఉదాహరణములు లభించును ఈ విషయమునే మహాభారతము ఇట్లు చెప్పుచున్నది.
న జాతు కామాన్న భయాన్న లోభాత్ ధర్మం త్యజేజ్జీవితస్యాపి హేతొః!
నిత్యో ధర్మః సుఖదుఃఖే త్వనిత్యే జీవో నిత్యో హేతురస్య త్వనిత్యః!! స్వర్గారోహణ పర్వం 5/63)
అనగా కోరికలను సాధించు కొనుటకు గాని, భయమునుండి బయట పడుటకు గాని, లోభాములకు లోబడిగాని, కడకు జీవితమును కాపాడుకొనుటకై గాని, మానవుడు ఎట్టి పరిస్థితులలోను ధర్మమును త్యజింపరాదు. సుఖ దుఖములు అనిత్యములు, అందువలన మరణస్థితి ఏర్పడినను మానవుడు స్వధర్మనును పరిత్యజించరాదు. ఇట్లు మసలుకొనుటయే మానవునకు అన్ని విధముల శ్రేయోదాయకము

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML