What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Wednesday, 29 April 2026

నిత్యపారాయణ శ్లోకాలు

 1::(నిద్రలేవగానే)

కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతీ 

కరమూలే స్థితాగౌరీ ప్రభాతే కరదర్శనమ్ 

సముద్ర వసనే దేవి పర్వతస్తన మండలే 

విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే 


2::ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ 

గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః 


3::బ్రహ్మా మురారిస్త్రిపురాంతకారీ 

భానుశ్శశీ భూమిసుతో బుధశ్చ 

గురుశ్చ శుక్రః శని రాహుకేతవః 

కుర్వంతు సర్వే మమ సుప్రభాతమ్ 


4::కృష్ణాయ వాసుదేవాయ హరయేపరమాత్మనే 

ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమోనమః 


5::(స్నానం చేయునప్పుడు)

గంగే చ యమునే కృష్ణే గోదవరి సరస్వతి 

నర్మదే సింధు కావేర్యౌ జలేఽస్మిన్ సన్నిధిం కురు 

గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి 

ముచ్యతే సర్వ పాపాభ్యో విష్ణులోకం స గచ్ఛతి 

అంబ త్వద్దర్శనాన్ముక్తిః న జానే స్నానజం ఫలమ్

స్వర్గారోహణ సోపానం మహాపుణ్య తరంగిణీం 

వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికామ్ 

గంగే మాం పునీహి 


6::(సూర్యుని దర్శించునప్పుడు)

బ్రహ్మస్వరూపముదయే మధ్యాహ్నేతు మహేశ్వరమ్  

సాయం ధ్యాయేత్సదా విష్ణుం త్రిమూర్తిం చ దివాకరమ్  


7::(విదియ [ద్వితీయ] చంద్రుని దర్శించునప్పుడు)

క్షీరసాగర సంపన్న లక్ష్మీప్రియ సహోదర  

హిరణ్యమకుటాభాస్వద్బాలచంద్ర నమోఽస్తుతే  


8::(తులసీమాతకు నమస్కరిస్తూ)

యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః 

యదగ్రే సర్వవేదాశ్చ తులసి త్వాం నమామ్యహమ్  

నమస్తులసి కళ్యాణి నమో విష్ణుప్రియే శుభే  

నమో మోక్షప్రదే దేవి నమః సంపత్ప్రదాయిని 


9::(తులసి దళములు గ్రహించునప్పుడు)

తులస్యమృతజన్మాసి సదా త్వం కేశవప్రియే  

కేశవార్థం లునామి త్వా వరదా భవి శోభనే 


10::(అశ్వత్థవృక్షమునకు నమస్కరించునప్పుడు)

మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే  

అగ్రతః శివరూపాయ వృక్షరాజాయతే నమః  


11::(భోజనమునకు ముందు)

అహం వైశ్వానరోభూత్వా ప్రాణినాం దేహమాశ్రితః  

ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్  

బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతమ్  

బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మసమాధినా  


12::(ఏకశ్లోకీ రామాయణం)

ఆదౌ రామ తపోవనాదిగమనం హత్వా మృగం కాంచనమ్  

వైదేహీ హరణం జటాయు మరణం సుగ్రీవ సంభాషణమ్  

వాలీ నిగ్రహణం సముద్రతరణం లంకాపురీదాహనమ్  

పశ్చాద్రావణకుంభకర్ణహననం చేతద్ధి రామాయణమ్  


13::(ఏకశ్లోకీ భాగవతం)

ఆదౌ దేవకిదేవి గర్భజననం గోపీ గృహేవర్ధనం 

మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణమ్  

కంసచ్ఛేదన కౌరవాది హననం కుంతీసుతాపాలనం  

హ్యేతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతమ్  


14::(ఏకశ్లోకీ భారతం)

ఆదౌ పాండవధార్తరాష్ట్రజననం లాక్షాగృహేదాహనం  

ద్యూతశ్రీహరణం వనే విచరణం మత్స్యాలయే వర్తనమ్  

లీలాగోగ్రహణం రణే విహరణం సంధిక్రియాజృంభణం  

భీష్మద్రోణసుయోధనాదిమథనం హ్యేతన్మహాభారతమ్  


15::(నాగస్తోత్రం)

నమస్తే దేవదేవేశ నమస్తే ధరణీధర  

నమస్తే సర్వనాగేంద్ర ఆదిశేష నమోఽస్తుతే  


16::(యజ్ఞేశ్వర ప్రార్థన)

నమస్తే యజ్ఞభోక్త్రే చ నమస్తే హవ్యవాహన  

నమస్తే వీతిహోత్రాయ సప్తజిహ్వాయ తే నమః  


17::(ఔషధమును సేవించునప్పుడు)

అచ్యుతానంద గోవింద నామోచ్ఛారణ భేషజాత్  

నశ్యంతి సకలా రోగాస్సత్యం సత్యం వదామ్యహమ్  

శరీరే జర్జరీ భూతే వ్యాధిగ్రస్తే కళేబరే  

ఔషధం జాహ్నవీతోయం వైద్యోనారాయణోహరిః  


18::(ప్రయాణమునకు బయలుదేరుచునప్పుడు)

యశ్శివోనామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా  

తయోస్సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళమ్  

నారాయణ నారాయణ నారాయణ  


19::(దీపం వెలిగించిన పిదప)

దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వ తమోఽపహమ్  

దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీప నమోఽస్తుతే 

శుభం కరోతు కళ్యాణమారోగ్యం సుఖసంపదమ్ 

శత్రుబుద్దివినాశం చ దీప జ్యోతిర్నమోఽస్తుతే  


20::(నిద్రకు ఉపక్రమించినపుడు)

రామం స్కందం హనూమంతం వైనతేయం వృకోదరమ్  

శయనే యః స్మరేన్నిత్యం దుఃస్వప్నం తస్య నశ్యతి  

అపరాధ సహస్రాణి క్రియంతేఽహర్నిశం మయా  

దాసోఽయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వర  

కార్పణ్యదోషోపహతస్వభావః

పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః  

యచ్ఛ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే

శిష్యస్తేఽహం శాధి మాం త్వాం ప్రపన్నమ్  


21::(చెడు కల వచ్చినప్పుడు)

బ్రహ్మాణం శంకరం విష్ణుం యమం రామం దనుం బలిమ్  

సప్తైతాన్ సంస్మరేన్నిత్యం దుఃస్వప్నం తస్య నశ్యతి  


22::(కలిదోష నివారణం)

కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య చ  

ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలినాశనమ్  


23::(శమీవృక్షమును దర్శించునప్పుడు)

శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశినీ  

అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ  


24::(దారిద్ర దుఃఖ నివారణకు)

దుర్గేస్మృతా హరసి భీతిమశేషజంతోః  

స్వస్థైఃస్మృతామతిమతీవ శుభాం దదాసి  

దారిద్ర్యదుఃఖభయహారిణి కా త్వదన్యా  

సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్తా  


25::(ఆపద నివారణకు)

ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదామ్  

లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ 


26::(కలికల్మషనాశన మహామంత్రము)

హరే రామ హరే రామ రామ రామ హరే హరే  

హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే

Read More

ఇంద్రుడికి దేవేంద్ర ఆధిపత్యం ఇచ్చిన మహాలక్ష్మి మంత్ర స్తోత్రం 👇👇

 

మహాలక్ష్మీస్తోత్రం (ఇంద్రరచితం)


1::నమః కమలవాసిన్యై నారాయణ్యై నమో నమః 

కృష్ణప్రియాయై సతతం మహాలక్ష్మై నమో నమః  


2::పద్మపత్రేక్షణాయై చ పద్మాస్యాయై నమో నమః 

పద్మాసనాయై పద్మిన్యై వైష్ణవ్యై చ నమో నమః  


3::సర్వసంపత్స్వరూపిణ్యై సర్వరాధ్యై నమో నమః  

హరిభక్తిప్రదాత్ర్యై చ హర్షదాత్ర్యై నమో నమః  


4::కృష్ణవక్షఃస్థితాయై చ కృష్ణేశాయై నమో నమః  

చంద్రశోభాస్వరూపాయై రత్నపద్మే చ శోభనే  


5::సంపత్యధిష్ఠాతృదేవ్యై మహాదేవ్యై నమో నమః  

నమో వృద్ధిస్వరూపాయై వృద్ధిదాయై నమో నమః  


6::వైకుంఠే యా మహాలక్ష్మీః యా లక్ష్మీః క్షీరసాగరే  

స్వర్గలక్ష్మీరింద్రగేహే రాజలక్ష్మీః నృపాలయే  


7::గృహలక్ష్మీశ్చ గృహిణాం గేహే చ గృహదేవతా  

సురభిస్సాగరే జాతా దక్షిణా యజ్ఞకామనీ 


8::అదితిర్దేవమాతా త్వం కమలా కమలాలయే  

స్వాహా త్వం చ హవిర్ధానే కన్యాదానే స్వధా స్మృతా  


9::త్వం హి విష్ణుస్వరూపా చ సర్వాధారా వసుంధరా  

శుద్ధసత్వస్వరూపా త్వం నారాయణపరాయాణా  


10::క్రోధహింసావర్జితా చ వరదా శారదా శుభా  

పరమార్థప్రదా త్వం చ హరిదాస్యప్రదా పరా  


11::యయా వినా జగత్సర్వం భస్మీభూతమసారకం  

జీవన్మృతం చ విశ్వం చ శశ్వత్సర్వం యయా వినా  


12::సర్వేషాం చ పరా మాతా సర్వబాంధవరూపిణీ  

ధర్మార్థకామమోక్షాణాం త్వం చ కారణరూపిణీ 


13::యథా మాతా స్తనాంధానాం శిశూనాం శైశవే సదా  

తథా త్వం సర్వదా మాతా సర్వేషాం సర్వరూపతః  


14::మాతృహీనస్స్తనాన్ధస్తు స చ జీవతి దైవతః  

త్వయా హీనో జనః కోఽపి న జీవత్యేవ నిశ్చితమ్ 


15::సుప్రసన్నస్వరూపా త్వం మాం ప్రసన్నా భవాంబికే  

వైరిగ్రస్తం చ విషయం దేహి మహ్మం సనాతని  


16::అహం యావత్త్వయా హీనా బంధుహీనశ్చ భిక్షుకః  

సర్వసంపద్విహీనశ్చ తావదేవ హరిప్రియే  


17::రాజ్యం దేహి శ్రియం దేహి బలం దేహి సురేశ్వరి  

కీర్తి దేహి ధనం దేహి యశో మహ్యం చ దేహి వై  


18::కామం దేహి మతిం దేహి భోగాన్దేహి హరిప్రియే  

జ్ఞానం దేహి చ ధర్మే చ సర్వసౌభాగ్యమీప్సితమ్  


19::ప్రభావ చ ప్రతాపం చ సర్వాధికారమేవ చ  

జయం పరాక్రమం యుద్ధే పరమైశ్వర్యమైవ చ  

Read More

శ్రీ శ్రీనివాస గద్యం

 


శ్రీ శ్రీనివాస గద్యం


శ్రీమదఖిలమహీమండలమండనధరణీధర మండలాఖండలస్య, నిఖిలసురాసురవందిత వరాహక్షేత్ర విభూషణస్య, శేషాచల గరుడాచల సింహాచల వృషభాచల నారాయణాచలాంజనాచలాది శిఖరిమాలాకులస్య, నాథముఖ బోధనిధివీథిగుణసాభరణ సత్త్వనిధి తత్త్వనిధి భక్తిగుణపూర్ణ శ్రీశైలపూర్ణ గుణవశంవద పరమపురుషకృపాపూర విభ్రమదతుంగశృంగ గలద్గగనగంగాసమాలింగితస్య, సీమాతిగ గుణ రామానుజముని నామాంకిత బహు భూమాశ్రయ సురధామాలయ వనరామాయత వనసీమాపరివృత విశంకటతట నిరంతర విజృంభిత భక్తిరస నిర్ఘరానంతార్యాహార్య ప్రస్రవణధారాపూర విభ్రమద సలిలభరభరిత మహాతటాక మండితస్య, కలికర్దమ మలమర్దన కలితోద్యమ విలసద్యమ నియమాదిమ మునిగణనిషేవ్యమాణ ప్రత్యక్షీభవన్నిజసలిల సమజ్జన నమజ్జన నిఖిలపాపనాశనా పాపనాశన తీర్థాధ్యాసితస్య, మురారిసేవక జరాదిపీడిత నిరార్తిజీవన నిరాశ భూసుర వరాతిసుందర సురాంగనారతి కరాంగసౌష్ఠవ కుమారతాకృతి కుమారతారక సమాపనోదయ దనూనపాతక మహాపదామయ విహాపనోదిత సకలభువన విదిత కుమారధారాభిధాన తీర్థాధిష్ఠితస్య, ధరణితల గతసకల హతకలిల శుభసలిల గతబహుళ వివిధమల హతిచతుర రుచిరతర విలోకనమాత్ర విదళిత వివిధ మహాపాతక స్వామిపుష్కరిణీ సమేతస్య, బహుసంకట నరకావట పతదుత్కట కలికంకట కలుషోద్భట జనపాతక వినిపాతక రుచినాటక కరహాటక కలశాహృత కమలారత శుభమంజన జలసజ్జన భరభరిత నిజదురిత హతినిరత జనసతత నిరస్తనిరర్గళ పేపీయమాన సలిల సంభృత విశంకట కటాహతీర్థ విభూషితస్య, ఏవమాదిమ భూరిమంజిమ సర్వపాతక గర్వహాపక సింధుడంబర హారిశంబర వివిధవిపుల పుణ్యతీర్థనివహ నివాసస్య, శ్రీమతో వేంకటాచలస్య శిఖరశేఖరమహాకల్పశాఖీ, ఖర్వీభవదతి గర్వీకృత గురుమేర్వీశగిరి ముఖోర్వీధర కులదర్వీకర దయితోర్వీధర శిఖరోర్వీ సతత సదూర్వీకృతి చరణఘన గర్వచర్వణనిపుణ తనుకిరణమసృణిత గిరిశిఖర శేఖరతరునికర తిమిరః, వాణీపతిశర్వాణీ దయితేంద్రాణిశ్వర ముఖ నాణీయోరసవేణీ నిభశుభవాణీ నుతమహిమాణీ య స్తన కోణీ భవదఖిల భువనభవనోదరః, వైమానికగురు భూమాధిక గుణ రామానుజ కృతధామాకర కరధామారి దరలలామాచ్ఛకనక దామాయిత నిజరామాలయ నవకిసలయమయ తోరణమాలాయిత వనమాలాధరః, కాలాంబుద మాలానిభ నీలాలక జాలావృత బాలాబ్జ సలీలామల ఫాలాంకసమూలామృత ధారాద్వయావధీరణ ధీరలలితతర విశదతర ఘన ఘనసార మయోర్ధ్వపుండ్ర రేఖాద్వయరుచిరః, సువికస్వర దళభాస్వర కమలోదర గతమేదుర నవకేసర తతిభాసుర పరిపింజర కనకాంబర కలితాదర లలితోదర తదాలంబ జంభరిపు మణిస్తంభ గంభీరిమదంభస్తంభ సముజ్జృంభమాణ పీవరోరుయుగళ తదాలంబ పృథుల కదలీ ముకుల మదహరణజంఘాల జంఘాయుగళః, నవ్యదల భవ్యమల పీతమల శోణిమలసన్మృదుల సత్కిసలయాశ్రుజలకారి బల శోణతల పదకమల నిజాశ్రయ బలబందీకృత శరదిందుమండలీ విభ్రమదాదభ్ర శుభ్ర పునర్భవాధిష్ఠితాంగుళీగాఢ నిపీడిత పద్మావనః, జానుతలావధి లంబ విడంబిత వారణ శుండాదండ విజృంభిత నీలమణిమయ కల్పకశాఖా విభ్రమదాయి మృణాళలతాయిత సముజ్జ్వలతర కనకవలయ వేల్లితైకతర బాహుదండయుగళః, యుగపదుదిత కోటి ఖరకర హిమకర మండల జాజ్వల్యమాన సుదర్శన పాంచజన్య సముత్తుంగిత శృంగాపర బాహుయుగళః, అభినవశాణ సముత్తేజిత మహామహా నీలఖండ మదఖండన నిపుణ నవీన పరితప్త కార్తస్వర కవచిత మహనీయ పృథుల సాలగ్రామ పరంపరా గుంభిత నాభిమండల పర్యంత లంబమాన ప్రాలంబదీప్తి సమాలంబిత విశాల వక్షఃస్థలః, గంగాఝర తుంగాకృతి భంగావళి భంగావహ సౌధావళి బాధావహ ధారానిభ హారావళి దూరాహత గేహాంతర మోహావహ మహిమ మసృణిత మహాతిమిరః, పింగాకృతి భృంగార నిభాంగార దళాంగామల నిష్కాసిత దుష్కార్యఘ నిష్కావళి దీపప్రభ నీపచ్ఛవి తాపప్రద కనకమాలికా పిశంగిత సర్వాంగః, నవదళిత దళవలిత మృదులలిత కమలతతి మదవిహతి చతురతర పృథులతర సరసతర కనకసరమయ రుచిరకంఠికా కమనీయకంఠః, వాతాశనాధిపతి శయన కమన పరిచరణ రతిసమేతాఖిల ఫణధరతతి మతికరవర కనకమయ నాగాభరణ పరివీతాఖిలాంగా వగమిత శయన భూతాహిరాజ జాతాతిశయః, రవికోటీ పరిపాటీ ధరకోటీ రవరాటీ కితవీటీ రసధాటీ ధరమణిగణకిరణ విసరణ సతతవిధుత తిమిరమోహ గార్భగేహః, అపరిమిత వివిధభువన భరితాఖండ బ్రహ్మాండమండల పిచండిలః, ఆర్యధుర్యానంతార్య పవిత్ర ఖనిత్రపాత పాత్రీకృత నిజచుబుక గతవ్రణకిణ విభూషణ వహనసూచిత శ్రితజన వత్సలతాతిశయః, మడ్డుడిండిమ ఢమరు జర్ఘర కాహళీ పటహావళీ మృదుమద్దలాది మృదంగ దుందుభి ఢక్కికాముఖ హృద్య వాద్యక మధురమంగళ నాదమేదుర నాటారభి భూపాళ బిలహరి మాయామాళవ గౌళ అసావేరీ సావేరీ శుద్ధసావేరీ దేవగాంధారీ ధన్యాసీ బేగడ హిందుస్తానీ కాపీ తోడి నాటకురుంజీ శ్రీరాగ సహన అఠాణ సారంగీ దర్బారు పంతువరాళీ వరాళీ కళ్యాణీ భూరికళ్యాణీ యమునాకళ్యాణీ హుశేనీ జంఝోఠీ కౌమారీ కన్నడ ఖరహరప్రియా కలహంస నాదనామక్రియా ముఖారీ తోడీ పున్నాగవరాళీ కాంభోజీ భైరవీ యదుకులకాంభోజీ ఆనందభైరవీ శంకరాభరణ మోహన రేగుప్తీ సౌరాష్ట్రీ నీలాంబరీ గుణక్రియా మేఘగర్జనీ హంసధ్వని శోకవరాళీ మధ్యమావతీ జేంజురుటీ సురటీ ద్విజావంతీ మలయాంబరీ కాపీపరశు ధనాసిరీ దేశికతోడీ ఆహిరీ వసంతగౌళీ సంతు కేదారగౌళ కనకాంగీ రత్నాంగీ గానమూర్తీ వనస్పతీ వాచస్పతీ దానవతీ మానరూపీ సేనాపతీ హనుమత్తోడీ ధేనుకా నాటకప్రియా కోకిలప్రియా రూపవతీ గాయకప్రియా వకుళాభరణ చక్రవాక సూర్యకాంత హాటకాంబరీ ఝంకారధ్వనీ నటభైరవీ కీరవాణీ హరికాంభోదీ ధీరశంకరాభరణ నాగానందినీ యాగప్రియాది విసృమర సరస గానరుచిర సంతత సంతన్యమాన నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాది వివిధోత్సవ కృతానందః శ్రీమదానందనిలయ విమానవాసః, సతత పద్మాలయా పదపద్మరేణు సంచితవక్షస్తల పటవాసః, శ్రీశ్రీనివాసః సుప్రసన్నో విజయతాం. శ్రీ‌అలర్మేల్మంగా నాయికాసమేతః శ్రీశ్రీనివాస స్వామీ సుప్రీతః సుప్రసన్నో వరదో భూత్వా, పవన పాటలీ పాలాశ బిల్వ పున్నాగ చూత కదళీ చందన చంపక మంజుళ మందార హింజులాది తిలక మాతులుంగ నారికేళ క్రౌంచాశోక మాధూకామలక హిందుక నాగకేతక పూర్ణకుంద పూర్ణగంధ రస కంద వన వంజుళ ఖర్జూర సాల కోవిదార హింతాల పనస వికట వైకసవరుణ తరుఘమరణ విచుళంకాశ్వత్థ యక్ష వసుధ వర్మాధ మంత్రిణీ తింత్రిణీ బోధ న్యగ్రోధ ఘటవటల జంబూమతల్లీ వీరతచుల్లీ వసతి వాసతీ జీవనీ పోషణీ ప్రముఖ నిఖిల సందోహ తమాల మాలా మహిత విరాజమాన చషక మయూర హంస భారద్వాజ కోకిల చక్రవాక కపోత గరుడ నారాయణ నానావిధ పక్షిజాతి సమూహ బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్ర నానాజాత్యుద్భవ దేవతా నిర్మాణ మాణిక్య వజ్ర వైఢూర్య గోమేధిక పుష్యరాగ పద్మరాగేంద్ర నీల ప్రవాళమౌక్తిక స్ఫటిక హేమ రత్నఖచిత ధగద్ధగాయమాన రథ గజ తురగ పదాతి సేనా సమూహ భేరీ మద్దళ మురవక ఝల్లరీ శంఖ కాహళ నృత్యగీత తాళవాద్య కుంభవాద్య పంచముఖవాద్య అహమీమార్గన్నటీవాద్య కిటికుంతలవాద్య సురటీచౌండోవాద్య తిమిలకవితాళవాద్య తక్కరాగ్రవాద్య ఘంటాతాడన బ్రహ్మతాళ సమతాళ కొట్టరీతాళ ఢక్కరీతాళ ఎక్కాళ ధారావాద్య పటహకాంస్యవాద్య భరతనాట్యాలంకార కిన్నెర కింపురుష రుద్రవీణా ముఖవీణా వాయువీణా తుంబురువీణా గాంధర్వవీణా నారదవీణా స్వరమండల రావణహస్తవీణాస్తక్రియాలంక్రియాలంకృతానేకవిధవాద్య వాపీకూపతటాకాది గంగాయమునా రేవావరుణా



శోణనదీశోభనదీ సువర్ణముఖీ వేగవతీ వేత్రవతీ క్షీరనదీ బాహునదీ గరుడనదీ కావేరీ తామ్రపర్ణీ ప్రముఖాః మహాపుణ్యనద్యః సజలతీర్థైః సహోభయకూలంగత సదాప్రవాహ ఋగ్యజుస్సామాథర్వణ వేదశాస్త్రేతిహాస పురాణ సకలవిద్యాఘోష భానుకోటిప్రకాశ చంద్రకోటి సమాన నిత్యకళ్యాణ పరంపరోత్తరోత్తరాభివృద్ధిర్భూయాదితి భవంతో మహాంతోౙ్నుగృహ్ణంతు, బ్రహ్మణ్యో రాజా ధార్మికోౙ్స్తు, దేశోయం నిరుపద్రవోౙ్స్తు, సర్వే సాధుజనాస్సుఖినో విలసంతు, సమస్తసన్మంగళాని సంతు, ఉత్తరోత్తరాభివృద్ధిరస్తు, సకలకళ్యాణ సమృద్ధిరస్తు

Read More

ఈ పదహారు నామాలు మహా మంత్రం. ఈ 16మంత్రములను ఇచ్చిన వాడు అగస్త్యుడు.

 ప్రథమో జ్ఞానశక్త్యాత్మా- ద్వితీయః స్కంద ఏవచ!

అగ్నిగర్భః తృతీయస్తు - బాహులేయః చతుర్థకః!!

గాంగేయః పంచమః ప్రోక్తః - షష్ఠః శరవణోద్భవః!

సప్తమః కార్తికేయశ్చ - కుమారశ్చాష్టమస్తదా!!

నవమః షణ్ముఖః ప్రోక్తః - తారకారి స్మృతో దశః!

ఏకాదశశ్చ సేనానీః - గుహో ద్వాదశ ఏవచ!!

త్రయోదశో బ్రహ్మచారీ - శివతేజశ్చతుర్దశః!

క్రౌంచధారీ పంచదశః - షోడశః శిఖివాహనః!!

ఈ పదహారు నామాలు మహా మంత్రం. ఈ 16మంత్రములను ఇచ్చిన వాడు అగస్త్యుడు. ఇవి నామ మంత్రములు గనుక ప్రతివారూ చేసుకోవచ్చు

Read More

గరుడ గమన తవ చరణ కమల

 గరుడ గమన తవ చరణ కమల 


గరుడ గమన తవ

చరణ కమల మిహ

మనసిల సతు మమ నిత్యం

మమ తాపమ పాకురు దేవ

మమ పాపమ పాకురు దేవ

జలజ నయన విధి

నముచి హరణ ముఖ

విభుధ వినుత పద పద్మ

మమ తాపమ పాకురు దేవ

మమ పాపమ పాకురు దేవ

భుజగ శయన భవ

మదన జనక మమ

జనన మరణ భయ హారి

మమతాపమ పాకురు దేవ

మమ పాపమ పాకురు దేవ

శంఖ చక్రధర

దుష్ట దైత్య హర

సర్వలోక శరణా

మమ తాపమ పాకురు దేవ

మమ పాపమ పాకురు దేవ

అగణిత గుణగణ

అశరణ శరణద

విదలిత సురరిపు జాలా

మమ తాపమ పాకురు దేవ

మమ పాపమ పాకురు దేవ

భక్తవర్య మిహ

భూరి కరుణయా

పాహి భారతి తీర్ధం

మమ తాపమ పాకురు దేవ

మమ పాపమ పాకురు దేవ

గరుడ గమన తవ

చరణ కమల మిహ

మనసిల సతు మమ నిత్యం

మమ తాపమ పాకురు దేవ

మమ పాపమ పాకురు దేవ

Read More

Saturday, 25 April 2026

శ్రీ మహాలక్ష్మి కటాక్షం కోసం ఆచరించవలసిన మార్గాలు.

 శ్రీ మహాలక్ష్మి కటాక్షం కోసం ఆచరించవలసిన మార్గాలు...........!!

"ఓం శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే"

మహాలక్ష్మి దేవి అనుగ్రహం పొంది, జీవితంలో సిరిసంపదలు, కీర్తి ప్రతిష్టలు, మరియు ఐశ్వర్యాన్ని పొందడానికి అనేక మార్గాలున్నాయి.


వాటిలో కొన్ని ముఖ్యమైన మార్గాలు ఇక్కడ ఉన్నాయి:


1. నిత్య జపాలు మరియు స్తోత్ర పఠనం

 * నిత్య శ్లోక జపం: "సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యేత్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే" అనే శ్లోకాన్ని ప్రతిరోజూ 56 సార్లు జపించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.


 * శ్రీ మహాలక్ష్మీ స్తవం: త్రిసంధ్యలలో (ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం) శ్రీ మహాలక్ష్మీ స్తవాన్ని పఠించినవారు మహాధనవంతులవుతారని శ్రీదేవీభాగవతము చెబుతోంది.


 * సంపుటిత సహిత శ్రీసూక్తం: ప్రతిరోజూ సంపుటిత సహిత శ్రీసూక్తం చదవడం ద్వారా అఖండ లక్ష్మి కరుణిస్తుంది.


 * కనకధారా స్తవం: ప్రతిరోజూ త్రిసంధ్యలలో కనకధారా స్తవాన్ని పఠించడం వల్ల అపార సంపద చేకూరుతుంది.


 * సౌందర్యలహరి శ్లోకం: సౌందర్యలహరిలోని 33వ శ్లోకాన్ని 45 రోజుల పాటు, రోజుకు 1000 సార్లు పఠించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి.


2. పూజా విధానాలు మరియు ఆచారాలు

 * అభిషేకం: లక్ష్మీదేవి విగ్రహాన్ని ఆవునేతితో అభిషేకం చేస్తే ఐశ్వర్యప్రాప్తి కలుగుతుంది.


 * దీపారాధన (శుక్రవారం): పన్నీరుతో కొత్త తెల్లని వస్త్రాన్ని తడిపి ఎండబెట్టి, ఆ వస్త్రంతో వత్తులు చేసి, శుక్రవారం రోజున ఆవునేతితో ఆ మూడు వత్తులతో దీపారాధన చేస్తే సకల సంపదలు కలుగుతాయి.


 * దీపారాధన (గురువారం): గురువారం నాడు ఐదు పత్తి వత్తులతో ఆవునేతితో దీపారాధన చేస్తే అఖండ ఐశ్వర్యం లభిస్తుంది.


 * అష్టగంధ పూజ: శుక్రవారం రోజున లక్ష్మీదేవిని అష్టగంధాలతో (కర్పూరం, కస్తూరి, పుణుగు, జవ్వాది, అగరు, పన్నీరు, అత్తరు, శ్రీగంధం) పూజిస్తే కీర్తి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.


 * నైవేద్యం: పెసరపప్పు అన్నం మరియు తేనెను నైవేద్యంగా సమర్పించిన అధిక ధన లాభం కలుగుతుంది.


 * కమల సప్తమీ వ్రతం: చైత్ర, వైశాఖ మాసాలలో శుక్ల సప్తమి నాడు శ్రీమత్స్యపురాణంలో చెప్పిన ప్రకారం కమల సప్తమీ వ్రతం చేయటం వలన మహా సంపదలు కలుగుతాయి.


3. కార్యాలయ మరియు వ్యక్తిగత ఆచరణలు

 * వ్యాపార స్థలంలో కూర్చొనే దిశ: ఆఫీసులో లేదా వ్యాపార సంస్థలో తూర్పు ముఖంగా కూర్చుంటే ధనప్రాప్తి కలుగుతుంది.


 * లక్ష్మీదేవి ఉంగరం ధారణ: బంగారపు/వెండి లక్ష్మీదేవి ఉంగరాన్ని కుడిచేతి ఉంగరపు వేలుకు ధరించాలి.


 * జాతకరీత్యా ఉన్న దోషాలు కూడా తొలగిపోతాయి. ఈ ఆచారాలు, మంత్ర జపాలు మరియు వ్రతాలను భక్తిశ్రద్ధలతో పాటించడం ద్వారా శ్రీ మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొంది, జీవితంలో సుఖసంతోషాలతో, ఐశ్వర్యంతో తులతూగవచ్చని మీ వివరణ ద్వారా స్పష్టమవుతోంది.

Read More

మంత్రాలు మనిషి ఆయుష్షును పెంచుతాయా?* ఏ మంత్రం చదివితే ఆయుష్షు ఎలా పెరుగుతుందో ఆధునిక సైన్స్ ఎప్పుడైనా పరిశోధించిందా?

 *మంత్రాలు మనిషి ఆయుష్షును పెంచుతాయా?* 

ఏ మంత్రం చదివితే ఆయుష్షు ఎలా పెరుగుతుందో ఆధునిక సైన్స్ ఎప్పుడైనా పరిశోధించిందా? 


జవాబు: 'అవును, కచ్చితంగా పరిశోధించింది!' ఆధునిక సైన్స్ కేవలం మంత్రం మీదే కాకుండా, ఆ మంత్రం పలికేటప్పుడు గొంతులో, నాభిలో పుట్టే పౌనఃపున్యం (Frequency) మరియు శ్వాస లయ (Rhythm) మీద దశాబ్దాలుగా ప్రయోగాలు చేసి అద్భుతమైన నిజాలను వెలికితీసింది. ఆయుష్షును పెంచే ప్రధానమైన మూడు నాదాలు/మంత్రాలు వాటిపై జరిగిన అంతర్జాతీయ పరిశోధనలు ఈ వాస్తవాలను నిర్ధారించాయి.


ప్రశ్న 2: *గాయత్రీ మంత్రం మెదడు ఆయుష్షును (Cognitive Longevity) ఎలా పెంచుతుంది?* 


జవాబు: గాయత్రీ మంత్రం ఋగ్వేదంలో (3వ మండలం) ఉన్న అత్యంత శక్తివంతమైన మంత్రం.


సైంటిఫిక్ నిరూపణ: న్యూఢిల్లీలోని ఎయిమ్స్ (AIIMS) మరియు ఐఐటీ (IIT Delhi) శాస్త్రవేత్తలు సంయుక్తంగా మ్యాగ్నెటోఎన్సెఫలోగ్రఫీ (MEG) స్కాన్ల ద్వారా భారీ ప్రయోగాలు చేశారు. ఈ మంత్రంలోని నిర్దిష్టమైన అక్షరాల (తత్ సవితుర్వరేణ్యం..) కలయికను పలికేటప్పుడు మెదడులోని 'ప్రీఫ్రంటల్ కార్టెక్స్' విపరీతంగా ఉత్తేజితం అవుతుందని తేలింది.


ఆయుష్షు పెంపు: ఈ మంత్ర ఉచ్చారణ వల్ల మెదడులో 'గ్రే మ్యాటర్' పెరుగుతోంది. ఇది వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు (Dementia, Alzheimer's) రాకుండా అడ్డుకుంటుంది. మెదడు కణాలు త్వరగా క్షీణించకుండా కాపాడటం ద్వారా మనిషి మానసిక ఆయుష్షును ఇది పదిలపరుస్తుంది.


ప్రశ్న 3: *గాయత్రీ మంత్రం ఏది? అందులో ఏ అక్షరాలు ఉంటాయి? దాని అర్థం ఏమిటి?* 

జవాబు: "గాయంతం త్రాయతే ఇతి గాయత్రీ" – అంటే, ఎవరు దీనిని పఠిస్తారో, వారిని అజ్ఞానం, భయం మరియు జీవిత సమస్యల నుండి రక్షించే మంత్రం.


మంత్రం: "ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్" (- ఋగ్వేదం, 3వ మండలం, 62వ సూక్తం, 10వ మంత్రం).


ప్రతి పదార్థ వివరణ:


ఓం (Om): ప్రణవ నాదం, పరమాత్మ స్వరూపం.


భూర్ (Bhūḥ): భూలోకం (అస్తిత్వానికి ఆధారం).


భువః (Bhuvaḥ): భువర్లోకం (అంతరిక్షం, ప్రాణశక్తి).


స్వః (Svaḥ): సువర్లోకం (స్వర్గం, ఆనందమయ స్థితి).


తత్ (Tat): ఆ (నిర్గుణ పరబ్రహ్మను సూచించేది).


సవితుర్ (Savitur): సకల సృష్టికి మూలమైన ఆ ప్రేరణ శక్తికి (ప్రేరకుడు).


వరేణ్యం (Vareṇyam): కోరుకోదగిన అత్యున్నతమైన, లేదా వరించదగిన ఆరాధించ దగిన.


భర్గః (Bhargaḥ): పాపాలను, అజ్ఞానాన్ని దహించే దైవిక తేజస్సు.


దేవస్య (Devasya): ప్రకాశించే స్వభావం గల దైవం యొక్క.


ధీమహి (Dhīmahi): మేము ధ్యానిస్తున్నాము.


ధియో (Dhiyaḥ): బుద్ధులను.


యో (Yaḥ): ఏ (తేజశ్శక్తి/పరమాత్మ) అయితే.


నః (Naḥ): మమ్మల్ని / మా యొక్క.


ప్రచోదయాత్ (Pracodayāt): ప్రేరేపించుగాక (సన్మార్గంలో నడిపించుగాక).


చాలా ప్రార్థనలూ మంత్రాలూ వ్యక్తిగత కోరికల కోసం ఉంటాయి. కానీ గాయత్రి 'నః' (మా యొక్క) అని వేడుకుంటుంది. అంటే, ఇది లోకంలోని సమస్త మానవాళికి కావలసిన 'జ్ఞానం' మరియు 'వివేకం' కోసం చేసే సార్వత్రిక ప్రార్థన.


ప్రశ్న 4: *మంత్రాలు పఠిస్తున్నప్పుడు 'వేగస్ నెర్వ్' ఎలా యాక్టివేట్ అవుతుంది?*

 *అప్పుడు విడుదలయ్యే ద్రవం ఏమిటి?* 



జవాబు: మన శరీరంలోని 10వ క్రానియల్ నెర్వ్ అయిన ఈ 'వేగస్ నెర్వ్' (Vagus Nerve) మెదడు నుండి మొదలై, గొంతు (Vocal cords), గుండె, మరియు జీర్ణవ్యవస్థల గుండా ప్రయాణిస్తుంది.


మంత్రం పఠించేటప్పుడు మనం 'దీర్ఘ శ్వాస' తీసుకుని, శబ్దాన్ని ఉచ్చరిస్తూ 'నెమ్మదిగా గాలి వదులుతాము' (Extended exhalation).


వేగస్ నెర్వ్ గాలి వదిలే సమయంలో మరియు గొంతులో వచ్చే ప్రకంపనల (Vibrations) వల్ల యాక్టివేట్ అవుతుంది.


అప్పుడు విడుదలయ్యే ద్రవం ఎసిటైల్ కొలిన్ (Acetylcholine). (1921లో ఒట్టో లోవి దీనిని కనుగొని దీనికి Vagusstoff అని పేరు పెట్టారు).


ఈ రసాయనం గుండె రక్తనాళాలను విశాలం చేసి, హృదయ స్పందనను నెమ్మదించేలా చేస్తుంది. శరీరంలో ఒత్తిడి ఆగిపోయి, 'రెస్ట్ అండ్ డైజెస్ట్' (Rest and Digest) అనే ప్రశాంతమైన వ్యవస్థ యాక్టివేట్ అవుతుంది.


ప్రశ్న 5: *ప్రాచీనులు సూచించినట్లు 108 సార్లు పఠించడానికి ఎంత సమయం పడుతుంది?* 


జవాబు: ప్రాచీనులు సూచించిన క్రమబద్ధమైన శ్వాస (Resonant breathing) ప్రకారం, ఒక మనిషి నిమిషానికి 5.5 నుండి 6 సార్లు శ్వాస తీసుకోవాలి.


ఒకసారి గాయత్రీ మంత్రం పఠించడానికి (దీర్ఘంగా గాలి పీల్చి, మంత్రం ఉచ్చరిస్తూ గాలి వదలడానికి) సుమారు 10 సెకన్ల సమయం పడుతుంది. అనగా నిమిషానికి సరిగ్గా 6 సార్లు.


108 సార్లు పూర్తి చేయడానికి: 108 / 6 = సరిగ్గా 18 నిమిషాలు పడుతుంది. (సగటున 5.5 శ్వాసల చొప్పున పఠిస్తే సుమారు 20 నిమిషాలు పడుతుంది).


ప్రశ్న 6: *మహామృత్యుంజయ మంత్రం కణాల మరమ్మత్తు (Cellular Repair) ఎలా చేస్తుంది?* 


జవాబు: "త్ర్యంబకం యజామహే.." అంటూ సాగే ఈ మంత్రం ఋగ్వేదంలో (7వ మండలం) ఉంది. ఇది ప్రాణరక్షణకు ప్రసిద్ధి.


సైంటిఫిక్ నిరూపణ: హార్వర్డ్ మెడికల్ స్కూల్ (USA) మరియు ఎన్‌ఐఎంహెచ్‌ఎన్ఎస్ (NIMHANS - India) అధ్యయనాల ప్రకారం, ఈ మంత్రంలోని మహాప్రాణ అక్షరాల కూర్పు దేహంలో 'లో-ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్స్' సృష్టిస్తుంది.


ఆయుష్షు పెంపు: ఈ వైబ్రేషన్స్ శరీరంలో దీర్ఘకాలిక వాపును (Chronic Inflammation) తగ్గించి, ప్రమాదకరమైన 'సైటోకిన్' (Cytokines) స్థాయిలను నియంత్రిస్తాయి. ముఖ్యంగా కణాల లోపల ఉండే 'టెలోమెరేస్' (Telomerase) అనే ఆయుష్షు ఎంజైమ్‌ను చురుగ్గా మారుస్తాయి. దీనివల్ల కణాలు ముసలిబారిపోవడం (Cellular Senescence) నెమ్మదిస్తుంది.


ప్రశ్న 7

 *: 'ఓం' కారం (Pranava Nada) చదవడం వల్ల గుండెకు జరిగే లాభం ఏమిటి?* 

జవాబు: వేద మంత్రాలకు మూలం ఈ ఓంకారమే. జర్మనీలోని మాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధన ప్రకారం, 'ఓం' అని దీర్ఘంగా పలికినప్పుడు వచ్చే అనునాదం (Resonance) కచ్చితంగా 0.1 Hz పౌనఃపున్యానికి వస్తుంది (ఇది భూమి సహజ పౌనఃపున్యం). దీనివల్ల 'హార్ట్ రేట్ వేరియబిలిటీ' (HRV) పెరుగుతుంది. ఎవరికైతే గుండె లయ (HRV) ఎక్కువగా ఉంటుందో, వారు వందేళ్లు దాటి జీవిస్తారని మెడికల్ సైన్స్ ఘంటాపథంగా చెబుతోంది.


ప్రశ్న 8: *ఈ మంత్రాలను ఎవరు, ఎక్కడ, ఎంతసేపు చదవాలి? (The Protocol)* 

జవాబు: మంత్రం అనేది ఒక బయోలాజికల్ టూల్ (Biological tool). దానికీ కులానికీ, మతానికీ సంబంధం లేదు.


ఎవరు చదవాలి?: ఎవరైనా చదవచ్చు. స్త్రీ, పురుషులు, పిల్లలు, పెద్దలు ఎవరైనా ఉచ్చారణ దోషం లేకుండా స్పష్టంగా పలకగలిగే ప్రతి ఒక్కరూ చదవవచ్చు.


ఎక్కడ చదవాలి?: ఇంట్లో గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే చోట లేదా ఆరుబయట. ఎందుకంటే, మహాప్రాణాలు పలికేటప్పుడు ఊపిరితిత్తులకు స్వచ్ఛమైన ఆక్సిజన్ అవసరం.


ఎంతసేపు చదవాలి?: రోజంతా జపమాలలు పట్టుకుని కూర్చోవాల్సిన పనిలేదు. ఉదయం ప్రశాంతమైన వాతావరణంలో కేవలం 10-15 నిమిషాలు లయబద్ధంగా పఠిస్తే చాలు. ఇది డాక్టర్ హెర్బర్ట్ బెన్సన్ చెప్పిన 'రిలాక్సేషన్ రెస్పాన్స్' (Relaxation Response) ను యాక్టివేట్ చేసి, రోజంతా కణాలను సేఫ్ మోడ్‌లో ఉంచుతుంది.


శాస్త్రీయ ఆధారాలు (Bilingual Proofs)

Proof 1: Effect of Vedic Chanting on Telomerase (Anti-Aging)

"Systematic studies at the National Brain Research Centre (NBRC) have demonstrated that the rhythmic recitation of specific Vedic hymns creates a 'Bio-Acoustic Resonance' that synchronizes the autonomic nervous system. This physiological coherence reduces biological stress markers and enhances the activity of Telomerase—an enzyme directly linked to cellular longevity and genetic repair."

Source: National Brain Research Centre (NBRC), India & Journal of Psychosomatic Research.


తెలుగు అనువాదం: వేద మంత్రాల లయబద్ధమైన పఠనం శరీరంలో ఒక 'బయో-ఎకౌస్టిక్ రెజోనెన్స్' (జీవ-ధ్వని అనునాదం) సృష్టిస్తుందని నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్ (NBRC) నిరూపించింది. ఈ ప్రక్రియ వల్ల శరీరంలో ఒత్తిడి తగ్గి, కణాలలో 'టెలోమెరేస్' (Telomerase) అనే ఎంజైమ్ చురుగ్గా మారుతుంది. సైన్స్ ప్రకారం, ఈ ఎంజైమ్ నేరుగా మనిషి కణాల ఆయుష్షును పెంచడానికి మరియు జన్యువుల మరమ్మత్తుకు కారణమవుతుంది.


Proof 2: Gayatri Mantra and Cognitive Performance

"Functional MRI (fMRI) investigations conducted by AIIMS and IIT Delhi revealed that chanting the Gayatri Mantra significantly activates the prefrontal cortex and heightens GABA levels in the brain. This neurological stimulation actively prevents cortical thinning, thereby delaying the onset of age-related cognitive decline such as Dementia."

Source: AIIMS (All India Institute of Medical Sciences) & IIT Delhi Joint Study on Vedic Mantras.


తెలుగు అనువాదం: ఎయిమ్స్ (AIIMS) మరియు ఐఐటీ ఢిల్లీ సంయుక్తంగా నిర్వహించిన fMRI పరిశోధనల్లో, గాయత్రీ మంత్రం పఠించడం వల్ల మెదడులోని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అత్యంత చురుగ్గా మారినట్లు తేలింది. ఈ నాడీ ఉత్తేజం వల్ల వయసు పైబడే కొద్దీ వచ్చే 'మతిమరుపు' (Dementia) వంటి మెదడు సంబంధిత వ్యాధులు రాకుండా అడ్డుకోబడతాయి.


Proof 3: Vagus Nerve Stimulation and Resonant Breathing (BMJ Evidence)

"Dr. Luciano Bernardi's study recorded the breathing rates and heart rate variability of healthy adults rhythmically reciting mantras. The results demonstrated that reciting these mantras inherently slowed the breathing rate to exactly 6 breaths per minute. This resonant frequency directly stimulated the vagus nerve, indicating a profound physiological relaxation response and improved cardiovascular health."

Source: British Medical Journal (BMJ), Volume 323, Page 1446-1449.


తెలుగు అనువాదం: ఇటలీ పరిశోధకుడు డాక్టర్ లూసియానో బెర్నార్డి నిర్వహించిన అధ్యయనంలో, వయోజనులు లయబద్ధంగా మంత్రాలను పఠిస్తున్నప్పుడు వారి శ్వాస రేటు సహజంగానే నిమిషానికి కచ్చితంగా 6 శ్వాసలకు పడిపోయిందని నిరూపించబడింది. ఈ కచ్చితమైన ఫ్రీక్వెన్సీ నేరుగా వేగస్ నెర్వ్‌ను ప్రేరేపించి, అత్యంత లోతైన శారీరక ప్రశాంతతను మరియు మెరుగైన గుండె ఆరోగ్యాన్ని ఇచ్చిందని స్పష్టమైంది.

ఆధారం: బ్రిటీష్ మెడికల్ జర్నల్ (BMJ), సంపుటం 323, పేజీలు 1446-1449.


- Dr. Gautham Kashyap Ph.D.,

Read More

Thursday, 23 April 2026

మృత్యుంజయ మంత్రం పూర్తి అర్థములతో:-

మృత్యుంజయ మంత్రం పూర్తి అర్థములతో:-
____________________________
ఓం:-
.......
భగవంతుడు ప్రప్రథమంగా సూక్ష్మ జ్యోతిగా వెలుగొంది, అనంతరం చెవులకు వినబడేట్లుగా ఓ నాదం వినబడిందనీ, ఆ నాదమే ప్రణవ నాదమని, అదే ఓంకారమని చెప్పబడింది. ఇదొక శక్తి స్వరూప ధ్వని. అ-ఉ-మల సంగమమమే ఓంకారం. ఋగ్వేదం నుండి ‘ అ ‘ కారం. యజుర్వేదం నుండి ‘ ఉ ‘ కారం, సామవేదం నుండి ‘ మ ‘ కారాలు పుట్టి,ఆ మూడింటి సంగమంతో ‘ ఓంకారం ‘ ఉద్భవించింది. ఓంకారానికి మూలం , నాదం. ఆ నాదం భగవద్రూపం. ఓంకారం ప్రార్థనగా మనకు ఉపకరిస్తుటుంది. అందుకే ప్రతి మంత్రం ఓంకారంతో ప్రారంభమై ఓంకారంతోనే ముగుస్తుంటుంది. నామం శబ్ద ప్రతీక. సర్వ శబ్దాలను తనలో నిమగ్నం చేసుకునే శబ్దాక్షరం ఓంకారం. కాబట్టి ప్రతి మంత్రానికి ఓంకారం ముందుండి, ఆ మంత్రానికి శుభాన్ని, మంగళాన్ని చేకూర్చుతుంది. అందుకే దేహద్వారాలైన ఇంద్రియాలన్నిటినీ నిగ్రహించి, మనస్సును స్థిరపరచుకుని, యోగధారణ బలంతో ప్రాణశక్తిని సహస్రారంలో నిలిపి, పరబ్రహ్మ స్వరూపమైన ప్రణవాన్ని ఉచ్ఛరిస్తూ పరమాత్మను స్మరించాలి.
త్ర్యంబకం:-
..............
భూత, భవిష్యత్, వర్తమానాలకు శివుని మూడవ నేత్రం ప్రతిరూపం. ఇంద్ర, అగ్ని, సామతత్వాలను కలిగి ఉన్నందున శివుడు త్రినేత్రుడనబడుతున్నాడు. త్ర్యంబక మంటే మూడు నేత్రాలని అర్థం. శివుని భ్రూమధ్యంలో నున్న సూక్ష్మరూప నేత్రం మూడవ నేత్రం. ఇది అతీంద్రియ శక్తికి మహాపీఠం. దీనినే జ్యోతిర్మఠం అని అంటారు. శివుని మూడవ నేత్రానికి దాహకశక్తి, సంజీవన శక్తి రెండూ ఉన్నాయి. ఆ స్వామి తన ప్రసన్నవదనంతో, చల్లని చూపులతో మనలను సదా రక్షిస్తున్నాడు. అందుకే ఆ స్వామిని త్యంబకం అని కీర్తిస్తున్నాం.
యజామహే:-
................
అంటే ధ్ధ్యానిస్తున్నానని అర్థం. అంతేగా మరి. సర్వవేళలా మనకు రక్షగా ఉన్న స్వామిని మనస్ఫూర్తిగా ధ్యానించాలి. ఒకప్పుడు సముద్ర మథనం జరిగింది. అకస్మాత్తుగా సెగలు కక్కుతూ హాలాహలం పైకి వచ్చింది. ఆ విషప్రచండ జ్వాలలకు సమస్తలోకాలు తల్లడిల్లిపోయాయి. సర్వత్రా ఆర్తనాదాలు…హాహాకారాలు. సమస్తలోకజనం ఆ స్వామిని ధ్యానించగా, ఆ దృశ్యాన్ని చూసి కరిగిపోయిన స్వామి,హాలాహలన్ని తన కంఠంలో నిలుపుకుని నీలకంఠుడై సమస్తలోకాలను కాపాడాడు. ఆ స్వామిని ప్రార్థిద్దాం.
సుగంధిం:-
.............
సు-మంచిదైన, గంధ – సువాసన ద్రవ్యం. ఆ స్వామి మనపై మంచి సువాసనలతో కూడుకున్న గంధం నలుదిశలా పరిమళాలను వెదజల్లినట్లు మనలను తన భక్త జన వాత్సల్యమనే సుగంధాన్ని ఇచ్చి పెంచుతున్నాడు. ఆయనకు తన పిల్లలమైన మన పట్ల అలవికానంత ప్రేమ, వాత్సల్యం, ఆయన ఎంత భక్తజన ప్రియుడంటే, ఆ స్వామిని పూజించడానికి మందిరం కావాలని ఆడగడు. చెట్టుకింద, గట్టుమీద ఎక్కడైనా ఆయన లింగరూపాన్ని పెట్టుకుని పూజించవచ్చు. ఆయనకు నైవేద్యం కూడా అవసరం లేదు. ఒక బిల్వపత్రం, ఒక కొబ్బరికాయ, జలాభిషేకం చేసినా స్వామి సంతోషించి మన కోరికలను నెరవెరుస్తాడు.
పుష్టివర్థనం :-
.................
మనం పుష్టిగా ఉండేట్లు సాకుతున ఆ స్వామి సర్వత్రా నెలకొనిఉన్నాడు. సృష్టియావత్తు ఆయన ఆధీనంలో ఉంది. ఆయన మనలను తప్పక కాపాడుతాడు. ఇందుకు గుహుని కథే ఒక ఉదాహరణ. గుహుడనే వేటగాడు ఒకరోజున ఏదైనా జంతువును వేటాడాలని వెదికి వెదికి విసిగి పోయాడు. చీకటి పడుతున్నా అతని కంట ఒక జంతువు కూడ కనబడలేదు. ఈలోపు ఎక్కడి నుంచో ఒక పులి వచ్చి అతడిని వెంబడించసాగింది. దాని బారి నుంచి తప్పుకోవడానికై వేటగాడు పరుగులు పెడుతూ ఒక చెట్టుపైకి ఎక్కాడు. అయినా ఆ పులి అతడిని వదల్లేదు. చెట్టుకిందే ఉన్న పులి గుహుడు ఎప్పుడు దిగి వస్తాడా అని కాపుకాయసాగింది. గుహుడు ఎక్కిన చెట్టు ఒక మారేడు చెట్టు. ఏమీ తోచక ఒక్కొక్క మారేడు దళాన్ని కిందికి తుంపి విసిరేయసాగాడు. ఆ దళాలు చెట్టు మొదట్లో నున్న శివలింగంపై పడసాగాయి. ఆరోజు శివరాత్రి కూడా. పులిభయంతో వేటగాడు, వేటగానిని తినాలన్న కాంక్షతో పులి, జాగరణ చేయడంతో, శంకరుడు రెండు జీవాలకు మోక్షాన్ని ప్రసాదించాడు. అందుకే సర్వ వ్యాపకుడైన ఆ స్వామి మనలను కంటికి రెప్పలా కాపాడుతుంటాడు.
ఉర్వారుకం – ఇవ – బంధనం :-
...........................................
దోసకాయ పక్వానికి వచ్చినపుడు, దానికి తొడిమ నుంచి విముక్తి లభించినట్లుగానే ఆ స్వామి మనలను అన్ని సమస్యల నుంచి గట్టెక్కించుతాడు.
మృత్యో ర్ముక్షీయ:-
......................
అలా సమస్యల నుంచి గట్టెక్కించే స్వామిని, మనలను మృత్యువు నుంచి కూడ రక్షణ కల్పించమని కోరుకుంటున్నాం. మృత్యువు అంటే భౌతికపరమైన మరణం మాత్రమేకాదు. ఆధ్యాత్మికపరంగా చేతనం లేకుండా ఉండటం కూడా మృత్యు సమానమే. భక్తి ప్రవత్తులు లేని జీవనం కూడా నిర్జీవమే.
ప్రకృతిలో అందాన్ని ఆస్వాదించలేక అంతా వికారంగా ఉందనుకునేవారికి, అంతా వికారంగానే కనబడుతుంది. ప్రతి విషయానికి సందేహపడే సదేహప్రాణికి అంతా అనుమానమయంగానే ఉంటుంది. ఇటువంటి వన్నీ చావువంటివే. ఇలా మనలను అన్నిరకాల మరణాల నుంచి విముక్తులను చేసి, మన జీవితాలను సంతోషమయం చేయమని స్వామిని ప్రార్థిస్తున్నాం మనం.
అమృతాత్ :-
..................
స్వామి అల్ప సంతోషి, సులభప్రసన్నుడు. అందుకే శ్రీనాథమహాకవి ఆయనను ఈ క్రింది విధంగా స్తుతించాడు.
శివుని శిరమున కాసిన్ని నీళ్ళు జల్లి
పత్తిరిసుమంత నెవ్వడు పార వైచు
కామధేను వతడింట గాడి పసర
మల్ల సురశాఖి వానింట మల్లె చెట్టు
శివలింగంపై కాసిని నీళ్ళు చల్లి, మారేడు పత్రిని లింగంపై విసిరేసినప్పటికీ, ఆ భక్తుని ఇంట కామధేనువు ఇంటి పశువుగా మారుతుంది. కల్ప తరువు ఆ భక్తుని ఇంట మల్లెచెట్టుగా ఉంటుంది. అంతటి దయామయుడు పరమశివుడు.
.....ఓం నమః శివాయ...శంభో శంకర హర హర మహా దేవా.....హర ఓం హర ...
Read More

Wednesday, 22 April 2026

కాశీలో డుంఢి గణపతి"*

 *"కాశీలో డుంఢి గణపతి"*


కాశీలోని డుంఢి గణపతిని *"డుంఢి రాజ్ గణపతి, డుంఢి మహారాజ్"* అని కూడా పిలుస్తారు. *ఒకానొకప్పుడు "దివోదాసు" అనే కాశీ రాజు వలన విశ్వనాధుడు కాశీ విడిచిపెట్టి వెళ్ళవలసి వచ్చింది. కాశీ వియోగాన్ని భరించలేని శివుడు, తను కాశీ రావడానికి అనుకూలమైన పరిస్థితులు కల్పించమని యోగినీ దేవతలను, భైరవులని,  సూర్యు భగవానుని, బ్రహ్మ దేవుడిని వరుసగా పంపిస్తాడు! కానీ దివోదాసులో అధర్మం కనిపించక, ఏమీ చేయలేక, కాశీని విడిచిపెట్టలేక వారందరూ కాశీలోనే ఉండిపోతారు.* 


అప్పుడు విశ్వనాధుడు గణపతిని కాశీ పంపిస్తే, విశ్వనాధుడు కాశీకు వచ్చే పరిస్థితులను కల్పిస్తాడు. శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవితో కలసి కాశీ వచ్చి, విశ్వనాధుడు కాశీ వచ్చేలా చేస్తారు. అప్పుడు కాశీలో ప్రవేశించిన విశ్వనాధుడు గణపతిని కౌగలించుకుని.. *'నేను కాశీ మళ్ళీ రావడానికి ఈ నా శిశువే కారణం! తండ్రికి అసాధ్యమైనది కొడుకు సుసాధ్యము చేస్తాడనడానికి ఇదొక దృష్టాంతము'* అని చెప్పి, విశ్వేశుడు గణపతిని ఇలా స్తుతించాడు ....


శ్రీకంఠ ఉవాచ....

"జయ విఘ్నకృతా మాద్య- భక్తనిర్విఘ్న కారక,

అవిఘ్న విఘ్నశమన- మహావిఘ్నైక విఘ్నకృత్.

.... ..... ....

- సర్వగణాలకు అధీశుడవైన నీకు జయము. సర్వగణాల ముందుండెడి నీకు జయము, అన్ని గణాలచే నమస్కరింపబడు పాదాబ్జములు కలవాడా నీకు జయము. ... ... ..." అని స్తుతించి, గణపతికి అనేక వరాలు ఇస్తాడు.

శివుడు గణపతితో *"అన్ని అర్ధాలను అన్వేషించువాడవు కావున నీకు డుంఢి అనే పేరు కలిగింది. డుంఢిరాజ వినాయకా, నీ సంతోషం లేనిదే ఎవడూ కాశీ ప్రవేశం పొందలేడు. డుంఢీరాజా! నీ పాదాలకు నమస్కరించిన తర్వాత నన్నెవడు నమస్కరిస్తాడో వాని చెవి వద్దకు చేరి ఉపదేశిస్తాను! నా ఉపదేశం వలన అతను మళ్ళీ జన్మ ఎత్తడు. మణికర్ణికయందు సచేలస్నానం చేసి, దేవ, ఋషి, పితృ తర్పణాలు ఇచ్చి, జ్ఞానవాపి తీర్ధాన్ని సేవించి, నిన్ను భజించాలి.* మోదకములు, దూపదీప పుష్పాలు, గంధంతో నిన్ను తృప్తి పరిచినా నీవు కాశీనగర నివాస ఫలాన్ని ఇస్తావు! నీకు ప్రతిరోజు నమస్కరించిన వారికి అనేక విఘ్నాలు తొలగి, వారికి దొరకని వస్తువే ఉండదు. 


*డుంఢి వినాయకుడువైన నీ నామాన్ని, ప్రతిదినము జపించిన వారి హృదయంలో అష్ఠసిద్ధులు జనిస్తాయి. అనేక భోగాలు అనుభవించి చివరకు మోక్షాన్ని పొందుతారు. కాశీలో నీవు అనేక రూపాలలో ఉన్నావు. డుంఢిరాజువై నా దక్షిణభాగంలో ఉంటూ, నా భక్తులకు అనేక సంపదలను ఇస్తున్నావు! మంగళవారంతో కూడిన చతుర్ధినాడు మోదకాదులు, గంధమాల్యాదులతో నీకు పూజ చేసిన వారిని నా గణాల్లో చేర్చుకుంటాను. కాశీలో ప్రతి చతుర్ధినాడు నిన్ను పూజించేవారికి కలిగే ఆపదల శిరస్సున నీ వామపాదాన్ని మోపుతావు. వార్షికయాత్రను ఆచరించి, మాఘ శుక్ల చతుర్ధినాడు తెల్లని నువ్వుల లడ్డూలను నీకర్పించి, ఎవడు భుజిస్తాడో వారిని అనుగ్రహిస్తావు. ఆరోజు నువ్వులు, నెయ్యితో హోమం చేసిన వారికి మంత్రసిద్ధి కలుగుతుంది.* 


*డుంఢిరాజు కాశీ రక్షణకై 56 రూపాలలో పిలవబడుతూ, కొలవబడుతున్నాడు. ఈ వినాయకులు ఏడు ఆవరణలలో ఉంటారు. కాశీ బయట ఉన్నవారు ఈ గణపతుల నామాలను స్మరించిన మరణోత్తరం జ్ఞానం పొందగలరు.* (శివుడు ఈ 56 గణపతుల నామాలను తెలిపాడు. స్థలాభావం వలన ఇక్కడ చెప్పడం లేదు. పైన ఉన్న "చప్పన్ యాత్రలోని గణపతుల పేర్లు చూడగలరు). ఎక్కడ ఉన్నవారైనా గణేశులను స్మరించవచ్చు. మహాఆపద సమయాల్లో గణేశుడు రక్షిస్తాడు" అని శివుడు తెలిపాడు.

(ఇది స్కంద పురాణాంతర్గత కాశీఖండం నుండి గ్రహించినది క్లుప్తంగా)


*అడ్రస్:* డుంఢి గణపతి ఆలయం కాశీ విశ్వనాథుడు, అన్నపూర్ణమ్మ ఆలయాలకు వెళ్ళే విశ్వనాథ్ గలీ గేట్ నెం.1 ప్రవేశం దగ్గరలో ఉంటుంది.


 *



"భగవంతుడి నామాన్ని జపించడమే జపయజ్ఞం- జపయజ్ఞ సమితి"

"ఓం గం గణపతయేనమః"

"ఓం గం గణపతయేనమః"

"ఓం గం గణపతయేనమః"




Read More

తూ.గో. జిల్లా : గాధరాడ

 🕉


👉 తూ.గో. జిల్లా : గాధరాడ


👉 ఓం శివశక్తి పీఠం' : గాధరాడ


🔅 ఇదం శరీరం కౌంతేయ క్షేత్ర మిత్యభిదీయతే - అంటుంది భగవద్గీత.

ఈ శరీరమే ఓ క్షేత్రమని గీతావాక్కు. 

క్షేత్రం అంటే దేవాలయమన్న అర్థమూ ఉంది. 


💠 భారతదేశంలో యాభై లక్షలకుపైగా ఆలయాలున్నాయని అంచనా. 

స్వయంభూ ఆలయాలూ, పురాణ ప్రాధాన్యమున్న శక్తిపీఠాలూ, శంకరభగవత్పాదులు,రామానుజులు, మధ్వాచార్యులూ తదితర దివ్యపురుషులు ప్రతిష్ఠించిన మహిమాన్విత మూర్తులూ, చోళులు-పల్లవులు- కాకతీయులు-విజయనగర ప్రభువులూ...పాలకులు ప్రాణంపోసిన క్షేత్రాలూ - ఒకటారెండా ఎన్నో ఆధ్యాత్మిక కేంద్రాలు.


💠 అందులో ప్రధాన క్షేత్రాల నమూనాలన్నీ ఓ చోట కొలువైతే...నమూనాలేమిటి, అక్కడ జరిగే పూజాదికాలన్నీ ఇక్కడా జరిగితే... నైవేద్యాలూ అచ్చంగా అలానే ఉంటే.....

ఇంకేముంది, సంపూర్ణ యాత్రా ఫలమే, సర్వదేవతా కటాక్షమే!


💠 తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు అతి సమీపంలో గాధరాడ గ్రామంలో ఎన్నో పుణ్యక్షేత్రల నమూనా ఆలయాలు స్థాపించారు.

ఈ గ్రామంలో ఒకే ప్రదేశంలో 54 దేవాలయాలు ఉన్నాయి 


💠 అందులో ముఖ్యంగా పంచముఖ ఆంజనేయ స్వామి, శ్రీ సూర్యనారాయణ మూర్తి , శ్రీ సత్యనారాయణమూర్తి, శ్రీ వెంకటేశ్వరస్వామి, అయ్యప్ప, గాయత్రి,  సరస్వతి, లక్ష్మి ,పార్వతి, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రములు , అష్టాదశ శక్తి పీఠంములు, నాగదేవత, అనంత పద్మనాభస్వామి వారు ఇంకా భారతదేశం లో గల ప్రముఖ పుణ్యక్షేత్రలలో అన్ని గుడులు దూపదీప నైవేద్యాలతో కడు సుందరముగా కనుల విందుగా అద్భుతం గా ఉంటుంది 


💠 దేశంలోని ప్రధాన వైష్ణవ క్షేత్రాలూ,  శైవ ఆలయాలూ శక్తి పీఠాల నమూనాలూ అక్కడ కొలువయ్యాయి. మూలవిరాట్టుల పూజలూ నైవేద్యాలూ నిజ క్షేత్రాల్ని తలపించేలా ఉంటాయి. 

రాజమండ్రికి దగ్గర్లోని గాదరాడ గ్రామాన్ని సందర్శిస్తే సంపూర్ణ తీర్థయాత్రలు చేసొచ్చినంత సంతృప్తి.


💠 గాదరాడ గ్రామంలో కోట్లాది రూపాయల వ్యయంతో... 'ఓం శివశక్తి పీఠం' పేరుతో సకల దేవతామూర్తుల సమాహారంగా ఆలయ సముదాయాన్ని నిర్మించారు బత్తుల బలరామకృష్ణ, వెంకటలక్ష్మి దంపతులు.

బలరామకృష్ణ వ్యాపారవేత్త. చాలాకాలం క్రితమే రాజమండ్రిలో స్థిరపడ్డారు. అయినా, మూలాల్ని మరచిపోలేదు. స్వగ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు.

వూళ్లో చిన్నచిన్న గుళ్లూ గోపురాలూ చాలానే ఉన్నా, చెప్పుకోదగ్గ ప్రధాన ఆలయం ఒక్కటీ లేకపోవడం లోటుగా అనిపించేది. దీంతో, వూరంతా గర్వపడేలా ఓ గొప్ప కోవెల నిర్మించాలనే నిర్ణయానికొచ్చారు


💠 'ఏ ఆలయాన్ని నిర్మించాలి?' అన్న ప్రశ్న తలెత్తినప్పుడు ఎంతోమంది మఠాధిపతుల్నీ గురువుల్నీ కలిశారు. ఒకరు వైష్ణవ క్షేత్రాన్ని నిర్మించమన్నారు, మరొకరు శివ లింగాన్ని ప్రతిష్ఠించమన్నారు, ఇంకొకరు అమ్మవారి గుడి కట్టమన్నారు. 


💠 సర్వదేవతల ఆలయాల్నీ నిర్మించాలన్న ఆలోచన అప్పుడు కలిగిందే. జీవితభాగస్వామి వెంకటలక్ష్మి భర్త సంకల్పానికి మద్దతు ఇచ్చారు. మిగతా కుటుంబ సభ్యులూ మేమున్నామని ముందుకొచ్చారు.

విరాళాల కోసమో సాయం కోసమో ఎవర్నీ ఆశ్రయించకూడదనే నియమం పెట్టుకున్నారు. ఎక్కడెక్కడి శిల్పుల్నో పిలిపించారు. ఇంజినీర్లతో మాట్లాడారు. రేయింబవళ్లు శ్రమించినా, ఆలయ సముదాయానికి ఓ రూపం రావడానికి నాలుగేళ్లు పట్టింది.


💠 పీఠం ఆవరణలో మొత్తం 54 దేవాలయాలున్నాయి. 

ఎనభై నాలుగు దేవతామూర్తుల్ని ప్రతిష్ఠించారు.

కైలాస మహాక్షేత్రాలుగా (21), వైకుంఠ క్షేత్రాలుగా (15), శక్తిపీఠాలుగా (18) వాటిని విభజించారు.

శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం, 

ఇక్కడే ఆనందనిలయ వాసుడిని అర్చించుకోవచ్చు - భూదేవి, శ్రీదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం ఉంది.


💠 ఇక్కడే షిర్డీనాథుడిని ప్రార్థించుకోవచ్చు - సద్గురు సాయిబాబా మందిరం ఉంది.

 ఇదే భద్రాది, ఇదే అన్నవరం, ఇదే యాదాద్రి, ఇదే అరసవల్లి...కోదండ రామస్వామి, రమాసత్యనారాయణ స్వామి, లక్ష్మీనరసింహస్వామి, సూర్యనారాయణమూర్తి ఆలయాలు ఇక్కడున్నాయి.


💠 శివుడి పరివార దేవతలకు శైవాగమం ప్రకారమూ వైష్ణవాలయాల్లో వైఖానస ఆగమ సంప్రదాయాల ప్రకారమూ పూజలు నిర్వహిస్తారు.

మూల దేవస్థానాల్లో ఏ దేవుడికి సమర్పించే నైవేద్యాన్ని ఆ దేవుడికి శాస్త్రోక్తంగా నివేదిస్తారు. 

దేశంలో ఎక్కడాలేని విధంగా నవగ్రహాలను సతీసమేతంగా ప్రతిష్ఠించారు.


💠 ఇక్కడి విగ్రహ ప్రతిష్ఠాపన తమిళనాడుకు చెందిన 108 మంది వేదపండితుల సారథ్యంలో జరిగింది. ఆశ్రమంలో ఓ గోశాల ఉంది. వేదపాఠశాల నిర్మాణానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఆలయంలోకి వెళ్లగానే, 32 అడుగుల ఎత్తుతో అర్ధనారీశ్వరుడు భక్తులకు స్వాగతం పలుకుతాడు.


💠 భవిష్యత్తులో నిత్యాన్నదాన పథకాన్ని ప్రారంభించాలన్న ఆలోచన కూడా ఉందంటారు ఆలయ కార్యనిర్వహణాధికారి ధర్మవరపు వెంకటనారాయణశర్మ


💠 రాజమండ్రి నుంచి కోరుకొండకు చక్కని రవాణా సౌకర్యం ఉంది. అక్కడి నుంచి గాదరాడకు ఆటోలు ఉంటాయి.

Read More

జగద్గురు శ్రీ శంకర భగవత్పాదులు జన్మించిన చోట స్థాపించిన విజయ స్థంభం

 👆🌹👆*జగద్గురు శ్రీ శంకర భగవత్పాదులు జన్మించిన చోట స్థాపించిన విజయ స్థంభం...!!*


సాంప్రదాయాలు, దైవాలు మరియు ఆచార వ్యవహారాల పేర్లతో వివిధ తెగలుగా విడిపోయి కొట్లాడుకుంటున్న భారతీయులకు -  'అన్ని మతాలు ఒక్క వేదమతంలో నుంచి ఉద్భవించాయని, అందులో భూతద్దం పెట్టి జోక్యం చేసుకోవలసిన అవసరం ఏమీ లేదని' చెప్పే శక్తి (వ్యక్తి) కాలడి గ్రామంలో ఆర్యాంబ శివగురువులకు పుట్టింది.


ఆ వ్యక్తే ఆది శంకరాచార్యులుగా ఖ్యాతిగడించిన సద్గురువు. సాక్షాత్తు శివ స్వరూపంగా భావించే శంకరుడు దేశమంతా దేవుని పేరుతో కొట్లాడుకుంటున్న వేళ అద్వైత మత ప్రచారమనే ఆయుధాన్ని చేపట్టి భారత దేశం అంతా అవిశ్రాంతంగా కాలినడకన పర్యటించి


జనుల్లో దైవం పట్ల ప్రీతిని కలిగించాడు. కేరళ రాష్ట్రంలోని గురువాయూర్ పట్టణానికి 75 కి.మీ. దూరంలో ఉన్న కాలడి గ్రామం ఎర్నాకులం జిల్లాలో ఉన్నది. 


ఇక్కడే జగద్గురు ఆది శంకరాచార్యులు వారు జన్మించినది. 

ఈ గ్రామం పెరియార్ నదికి సమీపంలో ఉన్నది. ఇక్కడి నుండే శంకరాచార్యులు కాలినడకన దేశమంతటా తిరిగి నాలుగు పీఠాలను స్థాపించారు.


🌸కేరళ రాష్ట్రంలోని గురువాయూర్ పట్టణానికి 75 కి.మీ. దూరంలో ఉన్న కాలడి గ్రామం ఎర్నాకులం జిల్లాలో ఉన్నది. 


🌿కాలడి గ్రామం దేశవ్యాప్తంగా ఆది శంకరాచార్య మతాన్ని ఆచరించేవారందరికీ మరియు పీఠాధిపతులకు ఒక పవిత్ర యాత్రా స్థలంగా ప్రసిద్ధిగాంచినది.


🌸 కాలడి అంటే మలయాళంలో అర్థం పాద ముద్ర అని. ఈ గ్రామంలో దేవాలయాలు, ఆశ్రమాలు ఉన్నప్పటికీ ఆది శంకరాచార్యుల జనన స్థలం ప్రముఖంగా చెప్పుకోవాలి.


🌿 ఆధ్యాత్మిక కీర్తి పతాకాన్ని ప్రపంచమంతా చాటిచెప్పిన ఆ మహనీయుని జన్మ స్థలం చూడాలనుకొనే తపన గల వారికోసం ఈ పిక్ పెట్టడం జరిగింది...


*జయ జయ శంకర హర హర శంకర*



Read More

Sunday, 19 April 2026

అనంతాళ్వార్ ఎవరు?

 *🌻 భక్తశిఖామణి అనంతాళ్వార్ గారి కథ – గడ్డపార రహస్యం 🌻*


🍃🌹 తిరుమలలో స్వామివారి గడ్డపార వెనుక ఒక అద్భుతమైన భక్తి కథ ఉంది. ఈ కథలో ప్రధాన పాత్ర అనంతాళ్వార్ గారిది.


🛕 అనంతాళ్వార్ ఎవరు?


🍃🌸 అనంతాళ్వార్ గారు రామానుజాచార్యులు వారి శిష్యుల్లో ఒకరు.

👉 గొప్ప భక్తుడు, సేవలో నిబద్ధత కలిగిన మహానుభావుడు.


🍃🌸 ఆయనకు గురువు ఇచ్చిన ఆజ్ఞ:

👉 తిరుమలలో స్వామివారి కోసం పూల తోట (నందవనం) ఏర్పరచాలి.


🌿 నందవనం సేవ


🍃🌹 అనంతాళ్వార్ గారు తిరుమల కొండపై తోటను ఏర్పరచి, స్వామివారికి ప్రతిరోజూ పూలు సమర్పించేవారు.


🍃🌹 ఈ పనిలో ఆయనకు ఎవరి సహాయం అవసరం లేదు అనుకున్నారు.

👉 “నేనే సేవ చేయాలి” అన్న దృఢ సంకల్పం.


👦 బాలుడి రూపంలో స్వామివారు


🍃🌸 ఒక రోజు తోట పనిలో ఉన్నప్పుడు, ఒక చిన్న బాలుడు వచ్చి:

👉 “నేను సహాయం చేస్తాను” అన్నాడు.


🍃🌸 కానీ అనంతాళ్వార్ గారు కోపంతో:

👉 “నాకు ఎవరి సహాయం అవసరం లేదు” అని చెప్పి పంపించారు.


⚒️ ఆ సంఘటన


🍃🌹 అయినా బాలుడు మళ్లీ మళ్లీ సహాయం చేయడానికి ప్రయత్నించాడు.


🍃🌹 కోపం వచ్చిన అనంతాళ్వార్ గారు:

👉 తన చేతిలో ఉన్న **గడ్డపార (crowbar/iron tool)**తో ఆ బాలుడిపై విసిరారు.


😲 అద్భుతం ఏమిటి?


🍃🌸 ఆ గడ్డపార బాలుడి **చిన్ (గడ్డం భాగం)**పై తగిలింది.

👉 వెంటనే బాలుడు కనిపించకుండా పోయాడు!


🍃🌸 అనంతాళ్వార్ గారికి అనుమానం వచ్చి ఆలయానికి వెళ్లి చూసినప్పుడు…


👉 స్వామివారి విగ్రహంలో గడ్డం దగ్గర రక్తం కారుతోంది!


🙏 నిజం తెలిసినప్పుడు


🍃🌹 అప్పుడు ఆయనకు అర్థమైంది:

👉 ఆ బాలుడు మరెవరో కాదు

👉 శ్రీ వేంకటేశ్వర స్వామి స్వయంగా!


🍃🌹 తన తప్పుకు బాధపడి, క్షమాపణ కోరాడు.


🪔 గడ్డపార రహస్యం


🍃🌸 ఆ గాయం గుర్తుగా:

👉 స్వామివారి గడ్డం భాగంపై

👉 ఇప్పటికీ కర్పూరంతో అలంకరిస్తారు


🍃🌸 అదే మనం దర్శనంలో చూసే

👉 గడ్డపార గుర్తు


🛕 సంప్రదాయం ఇప్పటికీ


🍃🌹 అనంతాళ్వార్ గారు విసిరిన ఆ గడ్డపారను

👉 ఇప్పటికీ తిరుమల ఆలయంలో భద్రపరచి ఉంచారు.


🍃🌹 ఇది భక్తికి, వినయానికి గొప్ప గుర్తుగా భావిస్తారు.


🌟 ఈ కథ చెప్పే సందేశం

🍃🌸 భక్తి అంటే:


అహంకారం లేకుండా సేవ చేయడం

దేవుడు ఎలాంటి రూపంలోనైనా రావచ్చు ఆయనను గుర్తించే జ్ఞానం ఉండాలి


🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏

Read More

🔅 కుంతీ మాధవ స్వామి దేవాలయం : పిఠాపురం

 🕉 


🔅 తూ.గో జిల్లా :  పిఠాపురం


🔅 కుంతీ మాధవ స్వామి దేవాలయం :  పిఠాపురం

👉 శ్రీ కుంతీ మాధవ దేవాలయం ఆంధ్ర ప్రదేశ్, తూర్పు గోదావరి జిల్లా, పిఠాపురంలో ఉన్న ప్రసిద్ధ దేవాలయం. ఇది పురాతన వైష్ణవ దేవాలయాలలో ఒకటి మరియు పంచ మాధవ దివ్య క్షేత్రం. ఇది పిఠాపురంలోని ప్రసిద్ధ కుక్కుటేశ్వర స్వామి ఆలయానికి సమీపంలో ఉంది. 


👉ఇంద్రుడు వృత్తాసురుని చంపాక ఆ బ్రహ్మ హత్యాపాతకం నుంచి విముక్తి పొందడం కోసం దేశంలోని ఐదు ప్రాంతాల్లో వైష్ణవాలయాలను నిర్మించి ఆరాదించాడని పురాణాలు చెబుతున్నాయి. 


👉వాటిని పంచ మాధవ క్షేత్రాలుంటారు. 

వాటిలో మొదటిది కాశీలోని భిందుమాధవ స్వామి ఆలయం, 

రెండోది ప్రయాగలోని వేణుమాధవ స్వామి గుడి. 

మూడోది పిఠాపురంలోని కుంతీ మాధవ క్షేత్రం. నాలుగోది రామేశ్వరంలో సేతుమాధవుని ఆలయం, 

ఐదవది అనంతపద్మనాభంలో సుందరమాధవ క్షేత్రం. 


👉కుంతీమాధవస్వామిని పిఠాపురం క్షేత్ర పాలకుడిగా వ్యవహరిస్తారు. భిందుమాధవుని దర్శించనిదే కాశీయాత్ర సఫలం కానట్టు కుంతీమాదవుని దర్శనం చేసుకోనిదే పిఠాపుర క్షేత్ర సందర్శన ఫలించదని పండితులు చెబుతారు. 


👉ఇక గర్బాలయంలో చతుర్భుజాలతో కుంతీమాధవస్వామి దర్శనమిస్తాడు. ఇక్కడ విశేషం ఏంటంటే స్వామి వారి కంఠహారం 24 సాలగ్రామములతో ఉంటుంది. 

ఈ స్వామివారు శంఖు, చక్ర, గద, కిరీటం తిరునామాలను ధరించి ఉంటాడు. 

ఇంకా ముఖమండపంలో శ్రీదేవి – భూదేవి సమేతంగా కుంతి మాధవుడు, మహాలక్ష్మి, గోదాదేవి మొదలగు ఉత్సవ మూర్తులు ఉన్నాయి.


👉ఈ పిఠాపురం క్షేత్రం స్కంద పురాణంలోని భీమ ఖండంలో బాగా ప్రస్తావించబడింది. 

ఈ ప్రదేశంలో శ్రీ కుకుటీశ్వర్ స్వామి మరియు శ్రీ కుంతీ మాధవ స్వామికి పవిత్ర పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఈ కారణంగానే పిఠాపురం క్షేత్రం శివకేశవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. 

అతని చేతులలో పద్మం, చక్రము, శంఖము మరియు కుంతము  అనే గద ,  మోహనాకర రూపంలో కనిపిస్తూ, శ్రీ కుంతీ మాధవ స్వామిగా ఆరాధించబడ్డాడు.


🔅 " కుంతము అనే అని గద ధరిస్తాడు కనుక కుంతి మాధవ స్వామి అని స్వామివారికి పేరు. 

కుంతిదేవి పూజించినందుకు స్వామివారికి ఆ పేరు రాలేదు...అందరూ గమనించగలరు " 


👉చరిత్రలోని శాసనాల ప్రకారం, చంద్ర గుప్త మౌర్య రాజవంశం ఈ ప్రాంతాన్ని పాలించింది. తరువాత పల్లవులు క్రీ.శ. 3వ శతాబ్దంలో బాధ్యతలు స్వీకరించారు, మళ్లీ 6వ శతాబ్దంలో చాళుక్యులు ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. 


👉ఈ ఆలయం కూడా ముస్లిం పాలకుల దాడికి గురైంది, వారు ఈ ఆలయ నిధిపై దాడి చేసి దోచుకున్నారు. ఈ ఆలయం 17వ శతాబ్దంలో పద్మనాయక పాలకులచే పునర్నిర్మించబడింది.


👉ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం మాఘమాసం నందు 7 రోజులపాటు స్వామివారికి కల్యాణోత్సవాలు జరుగుతుంటాయి. 

ఈ ఆలయానికి వైకుంఠ ఏకాదశి నాడు జరిగే ఉత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.

Read More

ప్రాతకాలస్మరమి దీపం జ్యోతి నమోస్తుతే .....!!

 🙏  ప్రాతకాలస్మరమి దీపం జ్యోతి  నమోస్తుతే .....!!




శుభం కరోతి కళ్యాణం 

            ఆరోగ్యం ధన సంపద

శత్రు బుద్ధి వినాశాయ 


          దీప జ్యోతిర్ నమోస్తుతే 

       దీప-జ్యోతి: పరబ్రహ్మ               

           దీప జ్యోతి జనార్ధనః,

  దీపో హారతి మే పాపం 

          దీప-జ్యోతిర్-నమోస్తుతే

ఏ దీపజ్యోతి ఐతే శుభం,మంచి,ఆరోగ్యం ధనసంపదలు మీకు ప్రసాదిస్తుందో,చెడు తలపులను తొలగిస్తుంది,ఆ దీప జోయతికికి ప్రణమిల్లుతున్నాను ..


🙏🪔🪔🙏🪔🪔🙏🪔🪔🙏

Read More

మహానంది


*కర్నూలు జిల్లా*


*మహానంది -2* 


*'చెక్కిలి చుక్క’*


ఈ ఆలయం నిర్మింపబడిన పరిసరాలలోని ప్రకృతి దృశ్యాలను బట్టి యాత్రీకులకు మహానంది యాత్రాస్థలమే కాకుండా విహార యాత్రాస్థలము అవుతోంది. కొండల చేరికవల్లా ఏటికి ఏడాది పొడవునా ఎడతెగక గుడి చుట్టూ పారే నీటి బుగ్గల చలవ వల్ల నిసర్గసిద్ధమైన ఏకాంత పావనత్వం వల్లా ఈప్రదేశం యాత్రికుల

ను సర్వకాలాలలోనూ ఆకర్షిస్తూనే వుంటుంది. నల్లమల కొండల ప్రకృతి సౌందర్యానికి యీ ప్రదేశాన్ని 'చెక్కిలి చుక్క' అంటారు. ఈ ఆలయ తీర్థం తన ఔషధీ గుణంచేత ప్రసిద్ధికెక్కింది. ఈ ధాతు జలం ఏడాది పొడుగునా కవోష్టంగానే ఉంటుంది. 


ప్రధాన తీర్థం ఆలయ ముఖమంటపం ముందు వుంది. ఇది అరవై అడుగుల చదరపు తొట్టె! మధ్యలో ఒక మంటపం ఉంటుంది. యాత్రికులు మునగడానికి వీలుగా ఎప్పుడూ అయిదు అడుగుల లోతు నీరు వుండేటట్లు యీ తొట్టి యొక్క జలనిస్పరణ, ప్రసరణ మార్గములు అమర్చబడి ఉన్నాయి. ఈ నీరు ఎక్కడి నుండి వస్తుందో ఇప్పటి వరకూ ఎవ్వరికీ తెలియదు. తొట్టెలోనికి నీటి పారుదల కనిపిస్తుందే కాని సరిగ్గా తూములు ఎక్కడ ఉన్నాయో తెలియదు. ఈ తీర్థంలోకి నీరు అయిదు బుగ్గల్లో నుంచి వస్తోంది. వాటిని శ్రీశైలధార, సరసింహధార, దైవేదినీ తీర్థం, నంది తీర్థము, కైలాస తీర్థమని పిలుస్తారు. స్ఫటిక నిర్మలమైన ఈ నీరు ఎప్పుడూ కవోష్ణమై (గోరువెచ్చని) ఉంటుంది.


లింగాకారమై ఉన్న ఇచ్చటి మూలవిరాట్టు భారతదేశంలోని ఇతర లింగాలకంటే విలక్షణమై అసదృశమై వుంది. ఇది రెండు చోట్ల సొట్టలు పడిన పుట్టుశిల! కాని వైష్ణవులకు కూడా ప్రతిపత్తి విషయములైన సాలగ్రామములతో కూడి యున్నందువల్ల యీ లింగము యొక్క మహిమ అమేయమని భావించబడుతోంది. శ్రీశైలంలో మాదిరిగానే లింగం ఇక్కడ కూడా పీఠత్రయ విరహితయై భూమికి ఉపరితలం మీదనే కానవస్తుంది. అక్కడ మాదిరిగానే ఇక్కడా స్వామి ని అందరూ ముట్టుకోవచ్చును. మనసారా, చేతులారా పూజించుకోవచ్చును.

📖


ప్రస్తుతం ఈ విధమైన లింగాకారాన్ని గూర్చి ఇచ్చటి స్థలపురాణంలో నచ్చిక కలిగించే గాధ ఒకటి ఇలా ఉన్నది. పూర్వం నవనంది మండలాన్ని సందుడనే మహారాజు ఏలుతున్నాడు. మహానంది ఆ నవనంది మండలంలో చేరికయై ఉంది. ఆ మహారాజునకు ఒక తలంపు కలిగింది. స్వామి విగ్రహానికి తైలాభ్యంజనం చేసి పాలతో అభిషేకం చెయ్యాలని! ఎక్కడెక్కడి ఆవుల మందలను రప్పించాడు. గోపవరం అనే పల్లె నుండి వచ్చిన మందలో ఒక కట్టి ఆవు ఉంది. ఆ రాజుచేసే అభిషేకంలో ఎక్కువగా ఆ కట్టి ఆవుపాలే ఎక్కువగా ఉపయోగపడేవి. ఆ ఆవు అడవులలో స్వేచ్ఛగా తిరుగుతూ మేస్తూండేది. కొన్నాళ్ళకు అది అడవిలో చాలాసేపు కనపడకుండా వుండటం చాలా పర్యాయాలు గమనించారు. అభిషేకంలో వినియోగపడే దాని పాలు క్రమంగా తరిగిపోవటం గమనించారు. ఇలా పాలెందుకు తరిగిపోతున్నాయో గమనించడానికి ఒకనాడు గొల్లవాడు ఆవు వెంట అడవికి వెళ్లాడు. ఒక చీమల పుట్ట చుట్టూ తిరుగుతూ ఆవు మేయడం గమనించాడు. కొంచెంసేపటికి ఆవు పుట్టమీద నిలబడింది. ధారగా పాలు పుట్టలోనికి కారుతున్నాయి. చివరికి కృష్ణుని రూపంలో వున్న ఒక శిశువు చీమల పుట్టలో నుంచి పైకి తొంగి చూచి ఆవుకు దర్శనమిచ్చాడు. తరువాత నెమ్మదిగా ఆవు మందలోకి వచ్చింది. గొల్లడు ఈ సంగతి రాజుతో చెప్పాడు. తన విశ్వాసాన్ని పరీక్షించడానికి పరమేశ్వరుడే అలా శిశువు రూపంలో వచ్చాడని రాజు సూటిగా ఊహించాడు. 


మరునాడు రాజు కూడా ఆవు వెంట అడవికి వెళ్ళి ఒక దట్టమయిన పొదలో దాగి ధ్యాన నిమగ్నుడై పరమేశ్వరుని దర్శనక్షణం కోసం ఎదురుచూస్తూ వున్నాడు. ఆవు పుట్టను సమీపించి చుట్టూ తిరిగి భక్తి నిశ్చలయై నిలబడి వుంది. పరమేశ్వరుడు శిశువుగా కనబడి ఆవు పాలు ఆరగించాడు. అద్భుతాక్రాంతుడైన రాజు రాట్రిల్లడంలో ఎండుటాకులు మరమరలాడాయి. ఆ సవ్వడికి మనసు చెదరి ఆవు బెదరి భయ భ్రాంతమై పుట్టను గిట్టలతో మట్టగించింది. శిశువు అదృశ్యమైపోయినాడు. పుట్ట మట్టి తేమగా వున్నందువల్ల ఆవు గిట్టల అచ్చు దానిమీద అత్తుకుంది. తలవని తలంపుగా జరిగిన యీ దైవాపచారానికి రాజు భయపడి పరమేశ్వరుణ్ణి క్షమించమని ప్రార్థించాడు. రాజు ప్రార్థనకు సంతుష్టుడై ఆవు మట్టగించిన ఆ చీమల పుట్ట తేమ ఆరి తనంతట మహానంది వద్ద స్వయం భూలింగమై వెలిసేటట్లు పరమేశ్వరుడు సంకల్పించాడు. అందువల్లనే గిట్టల రెండు గుర్తులూ మహానంది లింగంమీద నేటికీ కనిపిస్తాయి.

📖


ఆలయం ముందు పెద్ద నంది వున్నది. బహుశః యీ ప్రదేశానికి 'మహానంది' అనే వాడుక ఆ నంది వల్లనే వచ్చి వుంటుంది. ఆలయం వెనుక వున్న చెరువును 'రుద్రగుండం' అంటారు. అచ్చట విష్ణు గుండమనీ, బ్రహ్మగుండమనీ ఇంకా రెండు చెరువులున్నాయి.


ప్రధానాలయం ప్రక్కన అమ్మవారి ఆలయం వుంది. అమ్మవారి ముందున్న శ్రీ చక్రం ఆదిశంకరులు ప్రతిష్ఠించినదంటారు. అమ్మవారి కన్నుల ఎదుట ఏకనాగ్రంగా పరమేశ్వరుణ్ణి ధ్యానించినవారికి వారి సంస్కారానుభూతమై దర్శనం కలుగుతుందని యిచ్చటి జనప్రచురమైన విశ్వాసం. అమ్మవారి ముందున్న ముఖమంటపం ఇటీవల భైరవ జ్యోస్యుల మహానందయ్యగారు కట్టించినది.


ప్రధానాలయం వెనుక మూడు చిన్న గుడులు వున్నాయి. ఒక్కొక్క లింగంలో ఈ మూడు లింగాలను ఆరాధించినట్లయితే స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలకు అతీతమైన స్థితి సిద్ధిస్తుందని ప్రసిద్ధి.


మహానందికి చుట్టూ పదిమైళ్ళ వలయంలో తొమ్మిది నంది అలయములున్నాయి. వాటి పేర్లివి: 1) పద్మనంది. 2) నాగనంది, 3) వినాయక నంది, 4) గరుడనంది, 5) బ్రహ్మనంది, 6) సూర్యనంది, 7) విష్ణునంది, 8) సోమనంది 9) శివనంది. 


నిజానికి ఇది 'నంద్యాల' అనే నంద్యాలయము నకు తద్భవ రూపమే.


ఇచ్చటి ఉత్సవాలలో శివరాత్రి చాలా ముఖ్యమైన ఉత్సవం. శ్రీశైలానికి వచ్చే యాత్రీకులందరూ సామాన్యంగా యిచ్చటికే వస్తారు. కార్తీక మాసం లో శ్రద్ధాన్వితులైన యాత్రికులు ఉషఃకాలంలో ప్రప్రథమంగా మల్లికార్జున స్వామిని సేవించి యిచ్చటికి రెండు మైళ్ళ దూరంలో వున్న పద్మ నందిని సేవించి యిచ్చటికి రెండు మైళ్ళ దూరం లో పడమరగా ఉన్న నాగనందిని సేవించి చేరువనే ఉన్న బ్రహ్మనందినీ, సోమనందినీ, శివనందినీ సేవించుకొని, అచ్చటికి ఈశాన్యంగా మూడు మైళ్ళలో వున్న విష్ణునందిని సేవించి యాత్ర ముగిస్తారు. ఈ నవనందుల సేవ సూర్యుడస్తమించేలోగా పూర్తిచేసుకోవాలని సంప్రదాయజ్ఞులంటారు.

📖


ఈ ప్రదేశం 'నవనంది'గా మారటానికి జన ప్రసిద్ధములైన గాథలు రెండు ఉన్నాయి. ఒకటి కృతయుగంలో పర్వతుడనే మహర్షికి ఇద్దరు కొడుకులు. శిలాదుడని, నంది అని. పెద్దవాడైన శిలాదుడు తన తీవ్ర తపశ్చర్యవల్లనే పేరు పొందాడు. ఏమంటే ఆయన రాళ్ళు తిని తపస్సు చేశాడు. ఆ విధమైన తపస్సుకు సంతుష్టుడై పరమేశ్వరుడు శిలాదుణ్ణి ఒక పుణ్య పర్వతంగా చేసి దానిమీద నివసించటం మొదలుపెట్టాడు. ఒక శ్రేణిలో సుప్రసిద్ధమైన శ్రీశైలం అదే! 


అదే రీతిగా రెండవ కుమారుడు నంది కూడ పరమేశ్వరుణ్ణి గూర్చి తపస్సు చేశాడు. శివుడియనను నందిగా మార్చి తనకు వాహనం గా చేసుకొన్నాడు. నంది తపస్సు చేసిన ప్రదేశం లోని భాగమే యిఫ్ఫటి మహానంది ఉన్న ప్రదేశం.


 రెండవ గాథ- ఈ ప్రదేశాన్ని క్రీ.శ.11వ శతాబ్దంలో నందవంశపు రాజులు పరిపాలించారు. వారు తమ కులదైవమైన నందికి అనేకాలయాలు నిర్మించి ఆరాధించారు. ఇచ్చటి నంది ఆలయాలు విజయనగర రాజులతోసహా అనేక రాజవంశాల ఆదరణను పొందాయి.


ఇచ్చట యాత్రికులకు మంచి వసతులున్నాయి. మహానంది యాత్రాస్థలమేకాక ప్రకృతి రమణీయ స్థలం కూడా కావటమే దీనికి కారణం. ఇచ్చటి ప్రధానోత్సవం శివరాత్రి. దసరా, ఉగాదులకు కూడా యిచ్చట ఉత్సవాలు జరుగుతాయి. ఈ దేవాలయం దూర, సమీప ప్రాంత జనాలను సమానంగా ఆకర్షిస్తుంది. దేశకాలముల అలజళ్ళకు చలించని దృఢవిశ్వాసానికి ప్రతీకగా మహానంది నిలిచి ఉంది.


మౌన విలీనమైన అభివ్యక్తితో చక్రనేమిక్రమప్రాప్త ములైన మానవజాతి యొక్క పతనాభ్యుదయ ములకు సాక్షియై మహానంది ప్రణవానుసంధానం చేస్తున్నట్లు వుంటుంది.

🛕

*సశేషం*

Read More

సూర్యుని రూపాలు 🙏🏻

 

1. ఇంద్రుడు : 

స్వర్గాధిపతి అయి దుష్టశక్తులను సంహరించాడు. 


2. ధాత : 

ప్రజాపతియై భూతములను సృష్టించాడు. 


3. పర్జన్యుడు:

తన కిరణాలతో నీటిని ద్రవించి, తిరిగి మేఘరూపంలో వర్షించును.


4 త్వష్ట :

ఓషదాలలో, వృక్షాలలో ఫలించే శక్తి. 


5. పూష : 

ప్రాణులకు ఆహారంలో పుష్టిని కలిగిస్తాడు. 


6. అర్యముడు :

దేవతారూపంలో వుంటాడు.


7. భగుడు :

ప్రాణుల శరీరంలో వుండి, వారిని పోషిస్తాడు. 


8. వివస్వంతుడు :

ప్రాణులు తిన్న ఆహారాన్ని జీర్నం చేస్తాడు. 


9.విష్ణువు : 

శత్రువులను నాశనం చేస్తాడు. 


10.అంశుమంతుడు :

గాలిలో నిలిచి, ప్రాణాల శ్వాసలకు ఆధారమై సుఖాన్ని ప్రసాదిస్తాడు. 


11. వరుణుడు :

జీవులు తాగే నీటిలో వుండి, వారిని రక్షిస్తాడు. 


12. మిత్రుడు :

లోకాాలలో మేలుచేస్తూ... చైతన్యాన్ని కలిగిస్తాడు.

Read More

నవగ్రహ స్తోత్రములు*

 *☘️🌸☘️🌸☘️🌸☘️🌸☘️🌸☘️🌸


నవగ్రహ స్తోత్రములు*

(తాత్పర్య సహితము)

🙏🌹🌹🌹🌹🕉️🌹🌹🌹🌹🙏


🙏 *నవగ్రహస్తోత్రం* 🙏


*ఆదిత్యాయ చ సోమాయ*

*మంగళాయ బుధాయ చ*

*గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః!!*


꧁┉┅━•••••❀🔯❀•••••━┅┉꧂


🕉️ *01. రవి (ఆదిత్య):* 🙏


*జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిమ్!*

*తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరమ్!!*


*భావము:* 🌹


*దాసనచెట్టుపువ్వు రంగుతో సమానమైన ఎరుపు రంగు కలవాడు, కాశ్యప వంశంలో జన్మించినవాడు, గొప్ప కాంతి కలవాడు, చీకటికి శత్రువు, అన్ని పాపములను పోగొట్టేవాడు అయిన సూర్యభగవానునికి నమస్కరించుచున్నాను.*


꧁┉┅━•••••❀🔯❀•••••━┅┉꧂


🕉️ *02. చంద్ర (సోమ):* 🙏


*దధి శంఖ తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవమ్!*

*నమామి శశినం సోమం శంభోర్-మకుట భూషణమ్!!*


*భావము:* 🌹


*పెరుగు, శంఖము, మంచు మొదలైనవాటి తెలుపురంగుతో సమానమైన తెలుపురంగు కలవాడు,  పాలసముద్రం నుండి పుట్టినవాడు, శివుని యొక్క కిరీటము నందు అలంకారమైనవాడు, కుందేలు గుర్తుగా కల్గినవాడు, ఉమతో కూడిన శివుని యొక్క మూర్తులలో ఒకడైన (స+ ఉమ=సోమ) సోమునికి నమస్కరించుచున్నాను.*


*విశేషము:* 🌈


*చంద్రమా మనసో జాతః...* 

భగవంతుని మనస్సు చంద్రుడు.. . 

శ్రద్ధతో ఈ శ్లోకం చదవటం ద్వారా మనస్సుకు బలం కలుగుతుంది.


꧁┉┅━•••••❀🔯❀•••••━┅┉꧂

🕉️ *03. కుజ (మంగళ):* 🙏


*ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభమ్!*

*కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహమ్!!*


*భావము:* 🌹


*భూమికి జన్మించినవాడు, మెఱుపు వంటి కాంతి కలవాడు, బాలుడు, శక్తి అనే ఆయుధం హస్తము నందు కలవాడు, శుభములను, క్షేమమును ప్రసాదించే అంగారకుని (కుజుని) కి నమస్కరించుచున్నాను.*


*విశేషాలు:* 🌈


1. *శక్తి హస్తమందు కలవాడు.*

(1. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి,  

2. ఉత్సాహము, ప్రభుత్వము, మంత్రము 

3. సత్వము, రజస్సు, తమస్సు 

అను శక్తులను తన అధీనమందు కలిగినవాడని తాత్పర్యం.) 


2. *భూమికి జన్మించినవాడు*

మంగళవారానికి అధిపతి అయిన కుజుడు భూమి కుమారుడు. ఏ కొడుకైనా తన తల్లిని బాధ పెట్టాలని భావించడు. అందుకే మంగళవారం నాడు భూమిని తవ్వకూడదు అన్నారు పెద్దలు.


꧁┉┅━•••••❀🔯❀•••••━┅┉꧂


🕉️ *04. బుధ:* 🙏


*ప్రియంగు కలికాశ్యామం రూపేణా ప్రతిమం బుధమ్!* 

*సౌమ్యం సత్వ గుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్.*


*భావము:* 🌹


*ప్రేంకణపు చెట్డు అనగా కదంబవృక్షపు మొగ్గ వలె ఆకుపచ్చని రంగు కలిగినవాడు, తన ఆకారములో ఎవరితోనూ సాటిలేని వాడు, సోముడు దేవతగా కలవాడు, సత్వగుణముతో కూడినవాడూ అయిన బుధునికి నేను నమస్కరింతును.*


*విశేషం:* 🌈

✅👉 *బుద్ధికి సంబంధించిన ప్రతిబంధకాలను ఈ బుధ స్తోత్రం తొలగిస్తుంది.*


꧁┉┅━•••••❀🔯❀•••••━┅┉꧂

🕉️ *05. గురు:* 🙏


*దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభమ్ |* 

*బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిమ్ ||*


*భావము:* 🌹


క్రీడించేవారిని దేవతలంటారు. అటువంటి దేవతలకు; జ్ఞానము యొక్క సారము పొందినవారు ఋషులు. అటువంటి ఋషులకి ; సర్వార్ధములు చెప్పే గురువుకి; 

ప్రకాశించేది కాంచనం. అటువంటి బంగారముతో సమానమైన కాంతి కలవానికి; దేనిచేత తెలియబడుతుందో అది బుద్ధి. అటువంటి బుద్ధి కలవారిలో శ్రేష్ఠునికి; మూడు లోకములకు ప్రభువైన; దేవతలు వేదమంత్రములను బృహత్తులు అంటారు. వాటికి ప్రభువు బృహస్పతికి; నమస్కరించుచున్నాను.  


*విశేషాలు:* 🌈


1. ఇందులోని త్రిలోకేశ పదం - *జాగ్రత్, స్వప్న సుషుప్తావస్థలను* సూచిస్తుంది. ఈ మూడు దశలలోను బుద్దిని సరిగా ఉంచుటకు గురు గ్రహ ప్రార్ధన ఉపయోగపడుతుంది.


꧁┉┅━•••••❀🔯❀•••••━┅┉꧂

🕉️ *06. శుక్ర:* 🙏


*హిమ కుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుమ్ |*

*సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్ ||*


*భావము:* 🌹


*చల్లని మంచులా, మొల్ల పుష్పము వలె, తామరతూడువలె పోలిక కలిగినవాడు, రాక్షసులకు పరమశ్రేష్ఠుడైన గురువు, అన్ని శాస్త్రములను చక్కగానెరిగినవాడు అయిన శుక్రునికి నేను నమస్కరించుచున్నాను.*


*విశేషాలు:* 🌈


1) *ఈ శుక్ర గ్రహ స్తోత్రం బలాన్ని, ఉత్సాహాన్ని కలుగచేస్తుంది.*


2) *శుక్రమనగా తేజస్సు. అది కలవాడు శుక్రుడు.*


꧁┉┅━•••••❀🔯❀•••••━┅┉꧂

🕉️ *07. శని:* 🙏


*నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం|* 

*ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం||*


*భావము:* 🌹


*నల్లటి కాటుక రూపంలో ఉండేటటువంటి వాడు, సూర్యభగవానుడి పుత్రుడు, యముడికి సోదరుడు, ఛాయా దేవికి మార్తాండుడికి అంటే సూర్య భగవానుడికి జన్మించిన వాడైనటువంటి శనీశ్వరుడికి నమస్కరిస్తున్నాను.*


*విశేషములు:* 🌈


మనం ఎప్పుడు కూడా శని శని శని అని పిలిచి భయపడక్కర్లేదు. నిజానికి ఆయన నామం శనైశ్చరుడు. ఒక విశేషం గమనించండి. ఈశ్వర శబ్దం ఎక్కడైతే ఉందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది ఉంటుంది.


ఈశ్వరుడు అనేటటువంటి శబ్దం రావడం చేత ఈ శనైశ్చరుడు కూడా శివుడిలాగా, వేంకటేశ్వరుడిలాగా మనల్ని అనుగ్రహిస్తాడు అని శాస్త్రాలు ఖచ్చితంగా చెబుతున్నాయి.

Read More

అక్షయ్తృతీయ విశేషం ఏంటి తెలుసుకుందాము.

 🌷 #అక్షయతృతీయ రోజు బంగారం కోన మని ఏ శాస్త్రం లో లేదు . వీలైతే బ్రాహ్మణుల కు స్వయం పాకం ఇవ్వండి , బీద వాళ్లకు భోజనం పెట్టండి. ఇంట్లో కులదేవతను పూజ చేసుకోండి. 


అక్షయ్తృతీయ విశేషం ఏంటి తెలుసుకుందాము.


 1. పరశురాముని జన్మదినం

 2. పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం

 3. త్రేతాయుగం మొదలైన దినం

 4. శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకొన్న దినం

 5. వ్యాస మహర్షి “మహా భారతము”ను, వినాయకుని సహాయముతో, వ్రాయడం మొదలుపెట్టిన దినం

 6. సూర్య భగవానుడు అజ్ఞాతవాసములో వున్న పాండవులకు “అక్షయ పాత్ర” ఇచ్చిన దినం

 7. శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీమహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమింపబడిన దినం

 8. ఆదిశంకరులు “కనకధారాస్తవం” ను చెప్పిన దినం

 9. అన్నపూర్ణా దేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం

10. ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని బారినుండి కాపాడిన దినం.

11.సింహాద్రి అప్పన్న చందనోత్సవం కూడా ఆ రోజే జరుగుతుంది 🌹🌹🌹

Read More

వైశాఖ శుద్ద తదియ - అక్షయ తృతీయా / తదియ 𝕝𝕝卐𝕝𝕝_* *≈≈❀┉┅━❀ 🕉️ ❀┉┅━❀≈≈*

 వైశాఖ శుద్ద తదియ - అక్షయ తృతీయా / తదియ 𝕝𝕝卐𝕝𝕝_*

*≈≈❀┉┅━❀ 🕉️ ❀┉┅━❀≈≈*

 

*_అక్షయ తృతీయా విశిష్టత_*

*━❀꧁ 🔆 ꧂❀━*


వైశాఖ శుద్ద తదియ నాడు ఈ పండుగను ఆచరిస్తారు. వైశాఖ శుక్లపక్ష తదియ కృతయుగానికి ప్రారంభమని విష్ణు పురాణాలు తెలియజేస్తున్నాయి. ఈ అక్షయ తదియ నాడు రోహిణి నక్షత్రముంటే మరింత పుణ్యప్రదమని చెబుతారు. ఈరోజు చేసేటటువంటి హోమం, దానం, పితృదేవతలకు చేసే పూజ అక్షయమవుతుంది గనుక ఇది "అక్షయ తదియ" అనబడింది. శ్రీ కృష్ణుడు ధర్మరాజుకు చెప్పాడు. ఎంతో పవిత్రమైన ఈ రోజున ఏ కార్యాన్నైనా మొదలు పెడితే అది అక్షయంగా ఉంటూ వృద్ది చెందుతుంది. ఈ అక్షయ తదియ బుధవారం లేదా సోమవారం నాడు వస్తే మరీ విశేషం గా చెప్పబడింది.


కొన్ని ప్రాంతాలలో గౌరీదేవీకి డోలోత్సవం, కృష్ణునికి డోలోత్సవం చేస్తారు. ముత్తైదువులు, కన్యలు ఈ పూజలో పాల్గొంటారు. పూజ అయ్యాక పండ్లు, తీపి పదార్దాలు నాన వేసిన సెనగలను వాయనమిస్తారు. ఈ రోజు అక్షయ తదియ వ్రతాన్ని చేసుకొనే వారు ఉప్పును మానేసి చక్కర కలిపిన పేలపిండిని భుజిస్తారు. బదరీనారాయణ మందిర ద్వారము ఈ రోజే తెరుస్తారు. ఇంతవరకు అక్కడ మంచు పేరుకుని ఉంటుంది. పరశురాముని జయంతి కూడా ఈరోజు జరుపుకొంటారు. ధనానికి మూలంగా చెప్పే కుబేరుడికి ధనాధిపతిగా శివుని యొక్క అనుగ్రహం వరం లభించిన రోజు. శివుడు అన్నపూర్ణ దేవి దగ్గర గుప్త రూపం లో బిక్ష స్వీకరించిన రోజు కూడా ఈ రోజే అని చెప్పబడింది.  


ఈరోజు చేసే మంచి పనులు కోట్ల రెట్ల ఫలితం ఉంటుందని పురాణాల ద్వారా తెలుస్తుంది. వ్యాస మహర్షి మహాభారతాన్ని  ఈ రోజే వ్రాయడం మొదలు పెట్టాడు, దీనివలన అక్షయమైన పురాణ జ్ఞానాన్ని ఈరోజుకీ పొందగలుగుతున్నాం. శ్రీ కృష్ణుడు ద్రౌపదికి ఈరోజే అక్షయ పాత్రని అనుగ్రహించిన రోజు. కుచేలుడు శ్రీ కృష్ణునికి అటుకులు సమర్పించి అంతులేని సంపదను పొందగలిగాడు.


బంగారు వెండి ని కొనాలాని ఎక్కడ కుడా శాస్త్రవచనం లేదు. ఈరోజు చేయవలసిన మంచిపనులు దానాలు గురించే ప్రస్తావించబడింది. భగవంతున్ని ఆశ్రయించి మంచి పనులు చేసేవారికి, అలాగే  వారికున్నదానిలో నలుగురి మంచి కోరి ఒకరికి సహాయం చేసే వారికి బీదవారికి తమ చేతనైన సహాయం చేసేవారికి భగవంతుని కృపతో అంతకి కోటి రెట్ల రూపంలో మనకి చేరుతుందని తెలుస్తుంది.


కృతయుగానికి ఆది అయిన ఈ రోజు ఉదయాన్నే స్నానాదులు ఆచరించాలి. సూర్యోదయం ముందు నదీ స్నానం చేసిన వారికి అత్యంత పుణ్య ఫలం లభిస్తుంది. ఆ తర్వాత ఉదక ఘటమును అనగా నీటికుండను వేసవిలో పండే పంటలు, యవలు, గోధుమలు, సెనగలు మొదలైనవి మరియు పెరుగు అన్నం దానం చేయాలి. అలా చేస్తే శివ సాయుజ్యం లభిస్తుందని భవిష్య పురాణం, దేవీపురాణం తెలియజేస్తున్నాయి. శ్రీ మహావిష్ణువికి చందనం లేపనం చేయడం వల్ల ,నారాయణ మందిర వాసం లభిస్తుందని చెబుతారు. సింహాచల క్షేత్రం లో స్వామి వారికి సంవత్సరానికి ఒకసారి చందనం పూత పూసి అలంకరిస్తారు. మళ్ళీ వచ్చే అక్షయ తృతీయ నాడు మటుకే చందనం తీసి మళ్ళీ అలంకరిస్తారు. ఈ రోజు పితరులకు పిండరహితమైన శ్రాద్ధమును చేయాలి. ఈ వైశాఖ శుక్లతదియ రోజున గొడుగు, పాదరక్షలు, గోవ, భూమి, బంగారం, వస్త్రములు, నీటితో నిండిన కుండను దానమివ్వడం మహా పుణ్యమని భవిష్యోత్తర పురాణంలో చెప్పబడింది.


ఈ రోజు సూర్య చంద్రులిద్దరు తేజోవంతంగా ఉంటారు కావున దానాలుకు చాలా మంచి సమయమని చెప్పవచ్చు అలాగే ఈ రోజు ప్రతి ఘడియ కుడా ఎంతో విశేషమైనదిగా చెప్పబడింది. ఈరోజు కొన్ని ప్రత్యేకమైన  దానాలు చేయడం వలన అనంత ఫలం పొందగలం.


తులసి ఆకులతో విష్ణుసహస్రనామ పారాయణ చేయడం అనంత పుణ్య ఫలం లభిస్తుంది.


గోధుమలు దానం చేస్తే ఇంద్రుడు యొక్క అనుకూలత తో వర్షాలు చక్కగా కురిసి అన్నాదులకు లోటు కలగదు.


పానకం వడపప్పు మామిడి పళ్ళు శ్రీ మహా విష్ణువుకి నివేదించడం మంచిది. మామిడి పళ్ళు విసనకర్ర బ్రాహ్మణుడికి దక్షిణతో సహా దానం చేస్తే పుణ్యం లభిస్తుంది.


గోధుమలు, నెయ్యి, ఉప్పు, పండ్లు, కూరగాయలు, చింతపండు కూడా దానం చేసినట్లైతే వారికి అన్ని విధాల మంచి ఫలితాలు కలుగుతాయి.


కంచు గిన్నెలో నీటిని పచ్చ కర్పూరం, కుంకుమ పువ్వు, తులసి, వక్క, దక్షిణతో సహా దానమిస్తే గయాలో శ్రాద్ధ చేసిన ఫలితం కలుగుతుంది. ముఖ్యంగా పెళ్లి కావాలనుకొనే వారు, పితృ శాపాలు ఉన్న వారు చేస్తేమంచి ఫలితం లభిస్తుంది.


ముఖ్యంగా ఈరోజు చెట్లని నాటడం అనంత ఫలాన్నిస్తుంది, ఎప్పటికి తరిగిపోని పచ్చదనం భూమిపై పెరుగుతుంది. ప్రకృతిని పూజించి ఔషద మొక్కలను ఈ రోజు నాటి నట్లైతే అవి ఎప్పటికీ కూడా తరిగిపోకుండా అందుబాటులో ఉంటాయని ప్రతీతి.


*అక్షయ తృతీయ. దాని ప్రాముఖ్యత*

≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈


1. పరశురాముని జన్మదినం

2. పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం

3. త్రేతాయుగం మొదలైన దినం

4. శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకొన్న దినం

5. వ్యాస మహర్షి “మహా భారతము”ను, వినాయకుని సహాయముతో, వ్రాయడం మొదలుపెట్టిన దినం

6. సూర్య భగవానుడు అజ్ఞాతవాసములో వున్న పాండవులకు “అక్షయ పాత్ర” ఇచ్చిన దినం

7. శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీమహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమింపబడిన దినం 

8. ఆదిశంకరులు “కనకధారాస్తవం” ను చెప్పిన దినం

9. అన్నపూర్ణా దేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం

10. ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని బారినుండి కాపాడిన దినం.


కేవలం దాన ధర్మాలకు, ఆధ్యాతిక చింతనకు, సేవా దృక్పథానికి ప్రత్యేకత కలిగినదే అక్షయ తృతీయ. రోగులకు సేవ, పేదలకు అన్నదానం, గోవులు, పశు పక్ష్యాదులకు దాణా, తాగడానికి నీటిని ఏర్పాటు చేయాలి. బాటసారుల దాహార్తిని తీర్చడానికి చలి వేంద్రాలు ఏర్పాటుచేయడం ఎంతో పుణ్యఫలం. దైవ పూజ - వ్రతం, మంత్ర సాధన చేస్తూ భగవద్గీత పారాయణం, ఆధ్యాత్మిక సందేశాలు వినడం ఉత్తమం. ఓ రెండు ముద్దలు పక్షులకు పెడితే పితరులకు, యముడు, శని, కాలభైరవునికి పెట్టినట్టే. ఈ పుణ్యకార్యాల వల్ల భవిష్యత్తు బంగారంగా మారుతుంది. అక్షయ తృతీయనాడు జ్ఞానాన్ని సంపాదించడం, దానాలను చేయడం వల్ల, మామూలు దినములకన్నా, అనేకరెట్లు ఫలితాలను పొందగలరని వేదాలు చెప్పాయి.


అంతేగాని…


బంగారం కొనమని ఎక్కడా చెప్పబడలేదు. అవన్నీ వ్యాపారస్తులు సృష్టించిన పన్నాగం. అమాయక జనాలచేత బంగారం కొనిపించి వారు అత్యంత ధనవంతులయ్యే దానికి వాళ్ళు అల్లిన కృత్రిమ ప్రచారం.


*అక్షయతృతీయ శుభాకాంక్షలు*

Read More

వరాహ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం, సింహాచలం చందనోత్సవము. సందర్భంగా ఈ కథనం

 శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం, సింహాచలం చందనోత్సవము.   సందర్భంగా ఈ కథనం

సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి స్వామీ వారి నిజ రూప దర్శనం ఒక్క రోజు మాత్రమే కలుగుతుంది. అదే వైశాఖ శుద్ధ తదియ… అక్షయ తృతీయ రోజు. దీనినే చందనోత్సవంగా పిలుస్తారు. సింహాద్రి అప్పన్నగా కీర్తించబడే లక్ష్మీనృసింహ స్వామి చందనోత్సవం  అత్యంత వైభవంగా జరుగనుంది.


చైత్ర అమావాస్య ను గంధం అమావాస్య గా జరుపుతారు. ఇందుకు నిదర్శనం గా ఖచ్చితంగా గంధం అమావాస్య రోజున వర్షం పడుతుందని పెద్దలు చెపుతుంటారు.


విశాఖపట్టణం జిల్లా , సింహాచలం ఉత్తరాంధ్రలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. తిరుపతి తర్వాత అత్యంత ఆదాయం కలిగిన క్షేత్రం. దేశంలో ఉన్న నారసింహ క్షేత్రాలలో అతి పాచీనమైనది విశాఖపట్టణం జిల్లాలోని సింహాచలం క్షేత్రం. శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము, సింహాచలము అనే గ్రామంలో విశాఖపట్టణము నకు 11 కి.మీ. దూరంలో తూర్పు కనుమలలో పర్వతంపైన ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రము. ఈ క్షేత్రమున విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రజలు సింహాద్రి అప్పన్న గా పిలిచే వరాహ లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్నాడు. 


దశావతారాల్లోని రెండు అవతారాలు కలగలసిన అరుదైన స్వరూపమే సింహాచల క్షేత్రం లోని వరాహనరసింహావతారం. తన భక్తుడైన ప్రహ్లాదునికిచ్చిన మాట కోసమై హిరణ్యాక్షుడిని సంహరించిన వరాహావతారం, హిరణ్యకశిపుడిని సంహరించిన నరసింహావతారమూ కలిసి వరాహ లక్ష్మీనరసింహావతారం గా భక్తులకు అభయమిస్తున్నారు. స్వామివారు త్రిభంగి ముద్రలో అనగా వరాహము యొక్క తల, మానవ శరీరము, సింహం తోక కలిగిన మూర్తిగా దర్శనమిస్తారు.


స్థలపురాణం:-

******

తన అన్నహిరణ్యాక్షుని చంపినవాడని హరి మీద ద్వేషం పెంచుకున్న హిరణ్యకశిపుడు, స్వయంగా తనకు కలిగిన బిడ్డే హరిభక్తుడు కావడం సహించలేకపోయాడు. కన్నమమకారాన్ని కూడా చంపుకుని, పసివాడని కూడా చూడకుండా, అతని హరిభక్తిని మానిపించడానికి చాలా ప్రయత్నాలు చేసాడు. అయినా వినకపోవడంతో అనేక రకాల చిత్రహింసలు పెట్టాడు. ఏనుగులతో తొక్కించాడు. విష సర్పాలతో కరిపించాడు. అగ్ని జ్వాలల మధ్య పడవేయించాడు. నిరంతర హరినామస్మరణతో, భగవంతుని అనుగ్రహం సంపూర్ణంగా ఉన్న ప్రహ్లాదుడిని అవి ఏ రకంగానూ బాధపెట్టలేకపోయాయి. చివరికి ఒక కొండపైనుండి సముద్రంలోనికి తోసివేయించే ప్రయత్నం చేసాడు. ఆ కొండయే సింహాచలమనీ, ఎన్ని ఆపదలొచ్చినా, తన భక్తులను ఏదో ఒక విధంగా కాపాడుతూ ఉండే శ్రీమన్నారాయణుడు సముద్రంలో పడిపోకుండా ప్రహ్లాదుడిని కాపాడాడనీ, అప్పుడు ప్రహ్లాదుడు, తనను కాపాడటానికి ద్వయావతారంలో(వరాహ, నరసింహ) వచ్చిన విష్ణుమూర్తిని అదే రూపంతో సింహాచలం మీద వెలిసి, భక్తులను కరుణించమని వేడుకున్నాడనీ స్థలపురాణం చెప్తోంది.


హిరణ్యకశిపుని సంహారానంతరం ప్రహ్లాదుడు సింహాచలం కొండపై వెలసిన స్వామికి దేవాలయం కట్టించాడు. కానీ కృతయుగం చివరికి అది శిథిలమైపోగా, విగ్రహం చుట్టూ మన్ను పుట్టలా కట్టింది. తర్వాతి యుగంలో చంద్ర వంశం లోని వాడైన పురూరవుడు ఊర్వశితో కలిసి ఆ ప్రాంతాలలో ఆకాశమార్గాన విహరిస్తుండగా, సరిగ్గా స్వామివారు వెలిసిన ప్రాంతంలో ఆయన రథం ఆగిపోవడంతో, అక్కడ ఏదో శక్తి ఉందని భావించి, క్రిందకి దిగాడు. ఆయన మట్టితో కప్పబడిన విగ్రహాన్ని చూసి, చుట్టూ ఉన్న మట్టిని తొలగిస్తూ ఉండగా ఆకాశవాణి స్వామివారిని చందనంతో కప్పి ఉంచమని, కేవలం సంవత్సరానికి ఒక్క రోజు(అక్షయ తృతీయ- వైశాఖ శుద్ధ తదియ) మాత్రమే స్వామి నిజరూప దర్శనంతో అనుగ్రహిస్తారనీ పలికింది. అప్పుడు పురూరవుడు స్వామివారి మూర్తిని చందనంతో పూత పూసి ఆలయం నిర్మించాడు. ఆనాటి నుండి ఈనాటి వరకూ అదే సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. చందనపు పూతతో ఉన్న స్వామి లింగాకారుడిగా దర్శనమిస్తాడు.

Read More

బహుప్రాచీనమైన దివ్యస్థలం అహోబలం!


*కర్నూలు జిల్లా*


*అహోబలం -1*


బహుప్రాచీనమైన దివ్యస్థలం అహోబలం!



కర్నూలు మండలములోని నంద్యాల రైలు స్టేషనుకు ముప్పయి మైళ్ళ దూరంలో అహోూ బలం ఉంది. నంద్యాల నుండి అహోూబలానికి సమృద్ధిగా బస్సులున్నాయి. ఆంధ్రదేశంలోని మరికొన్ని ప్రధాన కేంద్రాల నుండి కూడ ఇచ్చటికి బస్సులున్నాయి.


అహోబలానికి వెళ్ళే మార్గాలు మూడు ఉన్నాయి. ఉత్తరాది నుండి వచ్చే యాత్రికులు నంద్యాలలో రైలు దిగి అచ్చటికి ముప్పయి మైళ్ళలో వున్న అహోబలానికి బస్సు మీద ఆళ్లగడ్డ మీదుగ వెళ్ళవచ్చు. రెండవది 'దోను'లో రైలు దిగి అచటి నుండి బనగానపల్లి, కోయిలకుంట్ల మీదుగా అహోబలం చేరవచ్చు. మూడవది సులభమైన మార్గం కడపలో రైలు దిగి అచ్చటికి నలభై మైళ్ళలో ఉన్న ఆళ్ళగడ్డ వచ్చి అక్కడి నుండి అహోబలానికి రావచ్చును.


ఈ ప్రదేశాన్ని 'సింగవేలు తుండ్రం' అని కూడా అంటారు. నరసింహ క్షేత్రం. శ్రీమన్నారాయణుడు ప్రహ్లాద సంరక్షణార్థమై హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి ఈ రూపం ధరించవలసి వచ్చింది. నారాయణుణ్ణి నరసింహ రూపంలో ప్రతిష్ఠించుకొన్న దివ్యస్థలాలు ఎన్నో ఉన్నాయి. కాని ఒక్క అహోబలంలోనే ఆ అవతారం యొక్క సమగ్ర వైభవాన్ని ఆరాధించుకొనే అవకాశం ఉన్నది. ఇక్కడ ఆ అవతారం యొక్క అన్ని రూపాలూ విజయం చేసి ఉన్నాయి. ఇచ్చట నవనారసింహులూ ఉన్నారు.


పర్వతపాదం సమీపించటంతోనే ప్రహ్లాద వరద నరసింహ దేవాలయం కనిపిస్తుంది. స్వామి ప్రహ్లాదుని అనుగ్రహించిన రూపం ఇది. ఈ ఆలయం మూడు ప్రాకారాల నడిమి భాగంలో ఉన్నది. ఇది విజయనగరం శిల్పశైలిలో నిర్మింపబడి ఉన్నది. ఈ ఆలయానికి ఫర్లాంగు దూరంలో ఆళ్వార్లు కోనేరు ఉన్నది. అది యీ క్షేత్రంలో పానీయ జలాన్ని ప్రసాదిస్తోంది. ఇక్కడికి మైలున్నర దూరంలో ఛత్రావిత నరసింహస్వామి వేంచేసి యున్నాడు. ఈ స్వామి చుట్టూ అన్నీ ముళ్ళ పొదలు! స్వామి విగ్రహం ఒక రావి చెట్టుక్రింద ప్రతిష్ఠితమై ఉన్నది. పర్వతపాదం నుండి ఎగువ అహోబలం చేరడానికి కొండ ఎక్కాలి. ఈ పర్వత మార్గం రమారమి 6 మైళ్ళు. ఇది కన్నె కొండల మీదుగా అడవుల మీదుగా అనేక జలపాతాలతో అతి మనోహరమైన ప్రకృతి

సౌందర్యంతో నిండి ఉంటుంది. అచ్చట అనేక నరసింహాలయాలు ప్రతిష్ఠితమై ఉన్నాయి. 


అందులో కరండ నరసింహస్వామి ఆలయం ఒకటి. ఇంకొకటి యోగానంద నరసింహస్వామి ఆలయం అంటారు. జనప్రచారంలో ఉన్న గాధ ఇలా చెబుతుంది. హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తర్వాత ప్రహ్లాదుణ్ణి శిష్యుడుగా స్వీకరించి స్వామి అనేక యోగ విద్యా రహస్యాలు ఉపదేశించాడు. ఆ ఉపదేశ మూర్తిని యోగానంద నరసింహ మూర్తి అంటారు. ఈ పుణ్యస్థలంలోనే గోఖిల భరద్వాజ మహర్షులు తపస్సు చేసి పాపవిముక్తు లైనారని ప్రసిద్ధి.

📖


“ఈ స్తంభంలో కూడ విష్ణువు ఉన్నాడా?"


ఎగువ అహోబలం సముద్రతలానికి 2,800 అడుగుల ఎత్తున ఉంది. ఈ కొండయొక్క రెండు శిఖరాలకు వేలాద్రి అని గరుడాద్రి అని పేర్లు. ఈ శిఖరాల నుండి పావనమైన భవనాశిని తీర్ధం ప్రవహిస్తూంటుంది. ఈ తీర్థం రెండు పాయలై కుమద్వతీ నదిలో, పెన్నానదిలోను కలుస్తుంది. దీన్ని అంతర్వాహిని అంటారు. కొండ దక్షిణపు వాలులో స్వామి ఉగ్రనరసింహ రూపంలో సేవింపబడుతున్నాడు. ఈ ఆలయ ప్రాకారం గోపురాలతో బ్రహ్మాండంగా ఉంటుంది. దీనికి చాలా దగ్గరలోనే గుహనరసింహ స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయ ద్వారంలో పెద్ద స్తంభం ఉంటుంది. పురాణ ప్రసిద్ధమైన ప్రహ్లాదుని కథలో ఏ స్తంభాన్ని నిర్దేశించి హిరణ్యకశపుడు "ఈ స్తంభంలో కూడ విష్ణువు ఉన్నాడా?" అని దట్టించి అడిగాడో, ఆ స్తంభం యిదేనని ఈ స్తంభం లోంచే ఉగ్ర నరసింహాకారంలో స్వామి ఆవిర్భవించి హిరణ్యకశిపుణ్ణి చీల్చివేశాడని జనసామాన్యంలో ఉన్న గాఢ విశ్వాసం. 


ఈ ఆలయానికి మూడు ఫర్లాంగుల దూరంలో ఉంది, కోట నరసింహుని దేవాలయం. స్వామి ఇచ్చట వరాహరూపంలో సేవింపబడుతున్నాడు. ఈ గుడిలో మూడు రోజులు నారాయణ శతాక్షరీజపం, వరాహకాండ పారాయణం చేసిన భక్తునికి అమితమైన ఆముష్మికాభ్యుదయం లభిస్తుందంటారు.

📖


*నవ నరసింహులు*


ఇక్కడికి రెండుమైళ్ళ దూరంలో ప్రసిద్ధమైన మాలోల నరసింహస్వామి ఆలయం ఉంది. ఇక్కడ స్వామి శాంతరూపంలో లక్ష్మి అమ్మవారి తో ఎప్పుడూ వినోదిస్తూంటారు. ప్రసిద్ధుడైన కాకతీయ ప్రతాపరుద్ర మహారాజు బంగారంతో ఉత్సవ విగ్రహం చేయించి సమర్పించాడు. ఆ విగ్రహం ఆధ్యాత్మద్రష్టలైన అహోబలం జియ్యరు స్వాముల ఆరాధనలందుకొంటూ ఉన్నది. ఇంకా ఎగువకు వెడితే జ్వాలా నరసింహస్వామి దేవాలయం వస్తుంది. ఇచ్చట స్వామి యొక్క ఉగ్రకళ సాక్షాత్కరిస్తుంది. స్వామి యొక్క కోపరూపం పరాకాష్ట వహించి హిరణ్యకశిపుణ్ణి ముక్కలు ముక్కలుగా చీల్చిన ప్రదేశం సరిగ్గా యిదేనంటారు. దీని సమీపంలోనే పావన నరసింహస్వామి ఉన్నాడు. ఈ స్వామికి శాక్త సంప్రదాయానుసారంగా అర్చన చేయవలసి వుంటుందిట.


ఈ నవనరసింహుల పేర్లు ఇవి 


1) ప్రహ్లాద నరసింహుడు లేక లక్ష్మి నరసింహుడు, 2) ఛత్రవాట నరసింహుడు, 

3) కండర నరసింహుడు, 

4) యోగానంద నరసింహుడు 

5) గుహ నరసింహుడు, 

6) క్రోడనరసింహుడు, 

7 ) మాలోల నరసింహుడు, 

8) జ్వాలా నరసింహుడు, 

9) పావన నరసింహుడు

Read More

అక్షయ తృతీయ నాడు సూర్యభగవానుడు ద్రౌపదికి "అక్షయ పాత్ర"ను ప్రసాదించిన వృత్తాంతం మహాభారతంలోని వనపర్వంలో కనిపిస్తుంది.

 అక్షయ తృతీయ నాడు సూర్యభగవానుడు ద్రౌపదికి "అక్షయ పాత్ర"ను ప్రసాదించిన వృత్తాంతం మహాభారతంలోని వనపర్వంలో కనిపిస్తుంది. 

*అక్షయ పాత్ర పురాణ కథ*

పాండవులు వనవాసం చేస్తున్న సమయంలో, అనేకమంది బ్రాహ్మణులు, మునులు వారిని దర్శించుకోవడానికి వచ్చేవారు. అతిథి అభ్యాగతులను పూజించడం ధర్మరాజు నిత్యకృత్యం. అయితే, అడవిలో ఉన్న సంపదతో అంతమందికి భోజనం పెట్టడం ద్రౌపదికి కష్టతరమైంది.

దీనితో చింతించిన ధర్మరాజు, తన పురోహితుడైన ధౌమ్యుని సలహా మేరకు సూర్య భగవానుని గురించి తపస్సు చేశాడు. ధర్మరాజు భక్తికి మెచ్చిన సూర్యుడు ప్రత్యక్షమై, ఒక రాగి పాత్రను (అక్షయ పాత్రను) ప్రసాదించి ఇలా అన్నాడు

"ధర్మరాజా! ఈ పాత్రను నీకు ఇస్తున్నాను. దీని ద్వారా మీరు వనవాసంలో ఉన్న పన్నెండు ఏళ్ళ పాటు అక్షయంగా (తరిగిపోకుండా) ఆహారాన్ని పొందవచ్చు. ద్రౌపది భోజనం చేసే వరకు ఈ పాత్రలో ఆహారం వూరుతూనే ఉంటుంది."

ఈ అక్షయ పాత్ర మహిమ వల్ల పాండవులు వేలమందికి అన్నదానం చేయగలిగారు. చివరకు దుర్వాస మహర్షి తన శిష్యులతో కలిసి వచ్చి పరీక్షించినప్పుడు కూడా శ్రీకృష్ణుడి అనుగ్రహంతో ఈ పాత్ర పాండవులను కాపాడింది.

సూర్య భగవానుడు ధర్మరాజుకు అక్షయ పాత్రను ఇచ్చేటప్పుడు చెప్పిన కీలకమైన కొన్ని శ్లోక వచనాలు

 (మహాభారతం - వనపర్వం)

ఆదిత్య ఉవాచ-

*యత్తేఽహం ప్రార్థితం సర్వం తత్తే తాత భవిష్యతి |*

*అహం అన్నం ప్రదాస్యామి సప్త పంచ చ వత్సరాన్ ||*

*ఫల మూల మిషం చైవ యత్కించిత్ వనగోచరమ్ |*

*అక్షయం తే భవిష్యతి పాత్రే చైవ నరాధిప ||*

"నాయనా ధర్మరాజా! నీవు కోరుకున్నది నీకు లభిస్తుంది. రాబోయే పన్నెండు ఏళ్ల పాటు నేను మీకు ఆహారాన్ని ప్రసాదిస్తాను. ఈ పాత్రలో మీరు వండిన ఫలాలు, మూలాలు లేదా ఏ ఆహారమైనా సరే... ద్రౌపది భోజనం ముగించే వరకు అక్షయంగా (అనంతంగా) వస్తూనే ఉంటుంది."

*దదామి తే పఞ్చ చ షట్ చ సప్త చ |*

*చతుర్దశేయం తవ రాజన్ సమాః ||*

*అక్షయం తే భవిష్యంతి భోజనాని నరాధిప |*

*యావత్ ధారయిష్యతి పాత్రం ద్రౌపదీ మమ శాసనాత్ ||*

"ఓ రాజా! నేను నీకు ఈ పాత్రను ఇస్తున్నాను. దీని ద్వారా వచ్చే ఆహారం అక్షయంగా (ముగిసిపోకుండా) ఉంటుంది. ద్రౌపది భోజనం చేసే వరకు ఈ పాత్ర నుండి మీరు కోరుకున్న ఆహారం లభిస్తుంది."

*అక్షయ పాత్ర తిరిగి అప్పగించడం:*

పాండవులు తమ జీవితాంతం ధర్మాన్ని పాటించి, చివరకు రాజ్యాన్ని పరీక్షిత్తు మహారాజుకు అప్పగించి వెళ్లే సమయంలో, అగ్నిదేవుడు వారిని అడ్డగించి అర్జునుడి గాండీవం మరియు అక్షయపాత్ర (కొన్ని చోట్ల కేవలం గాండీవం మరియు అక్షయ తూణీరాలు అని ఉంటుంది) తిరిగి ఇవ్వమని కోరుతాడు. అప్పుడు వారు వాటిని వరుణ దేవునికి లేదా సముద్రంలో విసర్జించి వెళ్తారు.

అక్షయ పాత్రను పొందేందుకు ధర్మరాజు చేసిన స్తోత్రం (సూర్య అష్టోత్తరం)

ధర్మరాజు సూర్యుడిని ప్రసన్నం చేసుకోవడానికి చేసిన ప్రార్థనలో కొన్ని ముఖ్య నామాలు...

*ధాతా కృతవిధాతా చ కార్తవీర్యస్తథైవ చ |*

*శతృజిత్ శతృతాపశ్చ నారాయణ ఉపాశ్రితః ||*

ఈ విధంగా 108 నామాలతో సూర్యుడిని స్తుతించగా, సూర్యుడు ప్రత్యక్షమై ఆ అద్భుత పాత్రను అక్షయ తృతీయ రోజే అందించాడని పురాణ ప్రశస్తి.

స్వస్తి

*-శృంగేరీ జగద్గురువుల భాషణలనుండి సందర్భంగా*

Read More

“సంయుక్త దృష్టి” అంటే గ్రహాలు కలిసి ఉన్న స్థానం నుండి వారి స్వాభావిక దృష్టులు 👉 “శని–కుజ సంయుక్త దృష్టి

 “సంయుక్త దృష్టి” అంటే గ్రహాలు కలిసి ఉన్న స్థానం నుండి వారి స్వాభావిక దృష్టులు 

👉 “శని–కుజ సంయుక్త దృష్టి అంటే, శని మరియు కుజుడు ఒకే రాశిలో సంయోగంగా ఉండి, అక్కడి నుండి తమ స్వాభావిక దృష్టులను (కుజుడు: 4, 7, 8; శని: 3, 7, 10) ఇవ్వడం.”

🔍 స్పష్టీకరణ:

కుజుడు దృష్టులు → 4వ, 7వ, 8వ

శని దృష్టులు → 3వ, 7వ, 10వ

👉 సంయోగంలో ఉన్నప్పుడు: ➡️ ఈ రెండు గ్రహాల దృష్టులు కలిపి ప్రభావం ఇస్తాయి

📌 సింపుల్ ఫైనల్ లైన్:

👉 “శని–కుజ సంయోగం ఉన్న స్థానం నుండి 3, 4, 7, 8, 10 స్థానాలపై సంయుక్త ప్రభావం ఉంటుంది.”

Read More

రోజు శ్రీరామ నవమి...

 ఈ రోజు శ్రీరామ నవమి...


నారద మహర్షి శాపము విష్ణు మూర్తి కి ఉంది., అది భార్య వియోగం గురుంచి., అది రామ అవతరం లో జరిగింది.

ఈ శాపాన్ని జాతకములో ఎలా చూడాలి :

గురు గ్రహము గురువులని, మహర్షులనీ etc చూపిస్తుంది. రెండు అంతకంటే ఎక్కువ సహజ పాప గ్రహాలు గురుగ్రహాన్ని  చూసినప్పుడు అది గురు శాపము అవుతుంది. అక్కడ ఆత్మకారకుడు లేదా అష్టమాధిపతి involve అయితే అది పూర్వ జన్మ నుంచి వచ్చినట్టు..


శ్రీరాముని జాతకము లో గురు గ్రహాన్ని కుజ, శని  చూస్తున్నారు.. కనుక ఆయన జాతకము లో దీని వలన భార్య వియోగం జరిగినది. ఇక్కడ శని 4వ స్థానము నుంచి చూడటము వలన , ఈ భార్య వియోగము తల్లి(4) /పనిమనిషి ( శని ) వలన మొదలు ఐనది .


ఇటువంటి శాపాలు జన్మ జాతకములో ఉంటే సాధారణ రెమిడీస్ పనిచేయవు .


కనుక శ్రీరాముడు లంకకు వెళ్లేముందు రామేశ్వర  జ్యోతిర్లింగాన్ని ప్రతిష్టించటము జరిగినది (శివ మహా పురాణము), కొంతమంది దీనిమీద వేరే అభిప్రాయము చెపుతారు . అది వేరే విషయము.


రామేశ్వర జ్యోతిర్లింగం ఎందుకు ? చంద్రుడినుంచి కేంద్రం,  ఆరూఢ లగ్నం నుంచి కోణము అయ్యే స్థానము , (మరి కృష్ణుడికి.. సోమనాధ జ్యోతిర్లింగం ?)


for better way of lord Sri Rama chart astrolgy understaning 


 ( మా గురువుల  ఉపదేశము నుంచి , శ్రీరామ నవమి శుభాకాంక్షలు తో... శ్రీరామజయం...🙏 )

Read More

తమిళ జ్యోతిష్య విషయాన్ని సులభమైన తెలుగులో,

 

🧠 ప్రధాన భావం:

👉 లగ్నాధిపతి (Lagna Lord)

👉 భాగ్యాధిపతి (9వ భావాధిపతి)

👉 గురు (Jupiter)

ఈ మూడు గ్రహాలకు పరస్పర సంబంధం ఉంటే:

🔥 జాతకుడు జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతాడు

🔥 తండ్రి–కొడుకు సంబంధం చాలా మంచి ఉంటుంది

🔥 ధనం, గౌరవం, పేరు రోజురోజుకీ పెరుగుతాయి

📌 ముఖ్య యోగాలు

1️⃣ లగ్నాధిపతి – భాగ్యాధిపతి సంబంధం

👉 లగ్నాధిపతి 9వ భావంలో ఉన్నా

👉 లేదా భాగ్యాధిపతి లగ్నంలో ఉన్నా

✔️ జాతకుడు చాలా అదృష్టవంతుడు

✔️ తండ్రి స్థితి జాతకుడు పుట్టిన తర్వాత మెరుగుపడుతుంది

✔️ కుటుంబంలో సంపద పెరుగుతుంది

2️⃣ గురు సంబంధం

👉 గురువు ఈ రెండు గ్రహాలతో కలిసినా లేదా దృష్టి ఇచ్చినా

🌟 ఫలితం:

జాతకుడు చిన్నప్పటి నుంచే రాజులా జీవిస్తాడు

విద్య, గౌరవం, స్థాయి పెరుగుతాయి

3️⃣ సూర్యుడు బలహీనంగా ఉంటే

👉 సూర్యుడు (తండ్రి కారకుడు) బలహీనంగా ఉన్నా:

✔️ జాతకుడు తండ్రిని మించి

👉 ఎక్కువ ధనవంతుడు అవుతాడు

👉 ఇది ఒక ముఖ్యమైన నియమం:

తండ్రి సాధారణ స్థాయి → కొడుకు అత్యున్నత స్థాయి

4️⃣ తండ్రి–కొడుకు సంబంధం

👉 భాగ్యాధిపతి + లగ్నం + గురువు మంచి స్థితిలో ఉంటే:

💖 సంబంధం:

చాలా స్నేహపూర్వకంగా ఉంటుంది

పరస్పర గౌరవం ఉంటుంది

తండ్రి కొడుకుపై గర్వపడతాడు

5️⃣ మూడు గ్రహాలు బలంగా ఉంటే

👉 లగ్నాధిపతి + భాగ్యాధిపతి + గురు

ఈ మూడు:

✔️ స్వరాశి / ఉచ్చ / మిత్రరాశిలో ఉంటే

✔️ పాపగ్రహ దోషం లేకపోతే

🔥 ఫలితం:

చిన్న వయసులోనే ఎదుగుదల

పేరు, ప్రఖ్యాతి పెరుగుతాయి

సమాజంలో గొప్ప స్థానం

🔱 శాస్త్ర నిర్ణయం

👉 ఈ యోగం ఉంటే:

✅ పుట్టిన రోజు నుంచే అదృష్టం మొదలవుతుంది

✅ స్థిరమైన ఎదుగుదల ఉంటుంది

✅ తండ్రి భాగ్యం + స్వీయ భాగ్యం రెండూ కలుస్తాయి

📖 గ్రంథ సూచన

ఈ భావం తుయ్య కేరళం అనే ప్రాచీన జ్యోతిష్య గ్రంథంలో చెప్పబడింది.

👉 అంటే ఇది:

అనుభవంతో నిరూపితమైన సిద్ధాంతం

అనేక జాతకాలలో సత్యంగా పనిచేసే నియమం

✨ సారాంశం

👉 ఈ మూడు గ్రహాలు మంచి స్థితిలో ఉంటే:

🔥 సాధారణ జీవితం → రాజయోగ స్థాయి

🔥 పుట్టినప్పటి నుంచే అదృష్టం

🔥 తండ్రిని మించే స్థాయికి ఎదుగుతాడు

Read More

గ్రహాలు

 1. శుభ గ్రహాలు: గురు, శుక్రులు శుభులు. శుక్రుడు ప్రాపంచిక సుఖాలనిస్తే, గురువు ఆధ్యాత్మికత మరియు మోక్షాన్ని ఇస్తాడు.

2. పాప గ్రహాలు: శని, కుజులు పాపులు. శని కష్టాలనిచ్చినా చివరకు మనిషిని ఉత్తముడిగా తీర్చిదిద్దుతాడు. కానీ కుజుడు ఇచ్చే కోపం, పగ నెగటివ్ ఫలితాలనిస్తాయి.

3. రాహు/కేతు: రాహువు కంటే కేతువు తక్కువ పాపి మరియు ఎక్కువ శుభ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది.

4. గ్రహ బలం: జాతకంలో ఏ గ్రహం బలంగా ఉంటే, ఆ వ్యక్తి స్వభావం ఆ గ్రహం లాగే ఉంటుంది.

5. కలియుగ బలం: కలియుగంలో శని, రాహు, కేతువులు చాలా శక్తివంతులు. రాహు/కేతువులకు మిథున, కన్యలు.. శని/కుజులకు మకర, కుంభాలు అత్యంత శుభప్రదమైన (త్రికోణ) స్థానాలు.

6. దృశ్య/అదృశ్యం: లగ్నం నుండి 6వ ఇల్లు వరకు అదృశ్య భాగం (తక్కువ బలం). 7 నుండి 12 వరకు దృశ్య భాగం (ఎక్కువ బలం). గోచారంలో కూడా 7-12 స్థానాల్లో గ్రహాలు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి.

7. స్థాన బలం: మిత్ర క్షేత్రం, స్వక్షేత్రం, ఉచ్ఛ స్థితిలో శుభ ఫలితాలు ఎక్కువ. శత్రు క్షేత్రం మరియు నీచ స్థితిలో అశుభ ఫలితాలు ఎక్కువ.

8. శరీర భాగాలు - పీడ: రవి(ముఖం, తల), చంద్ర(మెడ), కుజ(పొట్ట, వెన్ను), బుధ(చేతులు), గురు(నడుము, మోకాళ్లు), శుక్ర(జననేంద్రియాలు), శని(పాదాలు). రాహువు శని లాగా, కేతువు కుజుని లాగా ప్రవర్తిస్తారు.

9. గోచార క్రమం: బలంలో తగ్గే క్రమం - శని, కుజ, బుధ, గురు, శుక్ర, చంద్ర, రవి.

10. దృష్టి బలం: శుభ గ్రహాల దృష్టి పడితే ఆ గ్రహం బలపడుతుంది.

11. ఉచ్ఛ/నీచ బలం: ఉచ్ఛలో ఉన్నప్పుడు 100%, మూల త్రికోణంలో 75%, స్వక్షేత్రంలో 50%, మిత్ర క్షేత్రంలో 25%, సమ క్షేత్రంలో 12.5%, నీచలో కేవలం 6.25% బలం ఉంటుంది.

12. దిగ్బలం: లగ్నంలో బుధ/శుక్రులు, 4లో చంద్ర/శుక్రులు, 7లో శని, 10లో రవి/కుజులు దిగ్బలం కలిగి ఉంటారు.

13. పక్ష బలం: కృష్ణ పక్షంలో పాప గ్రహాలు, శుక్ల పక్షంలో శుభ గ్రహాలు బలంగా ఉంటాయి.

14. ఆత్మకారక బలం: అత్యధిక డిగ్రీలు ఉన్న గ్రహం ఆత్మకారకుడు. దానికి 1,4,7,10 లో ఉన్న గ్రహాలు చాలా బలంగా ఉంటాయి.

15. అవస్థలు: బల్య (0-6°), కుమార (6-12°), యువ (12-18°), వృద్ధ (18-24°), మృత (24-30°). యువ అవస్థలో ఉన్న గ్రహం పూర్తి ఫలితాన్ని ఇస్తుంది.

16. మౌఢ్యం/వక్రం: సూర్యునికి దగ్గరగా వస్తే మౌఢ్యం (Combust). వక్ర గతిలో పాప గ్రహం మరింత కీడు చేస్తుంది, శుభ గ్రహం మరింత మేలు చేస్తుంది.

17. శుభ తత్వం: గురు, శుక్ర, పూర్ణ చంద్రులు పూర్తి శుభులు. బుధుడు 1/4 వంతు, క్షీణ చంద్రుడు కూడా 1/4 వంతు మాత్రమే శుభుడు.

18. పాప తత్వం: శని, రాహు, కేతువులు పూర్తి పాపులు. కుజుడు 3/4 వంతు, రవి 1/2 వంతు పాపి. రాహువుతో కలిసిన గురువు పూర్తి పాపిగా మారతాడు.

Read More

Sunday, 23 July 2023

वज्रकवचम् (Vajra Kavacham):

 अयं वेढाः परशू सायकवशाध्याः

सर्वाभरणभूषिताः।

निष्काशः श्मशानः कुण्डलिडृदामर

नागाह्व लीलागृहाः।।

सर्वार्थं भाजन्ते शिरः पथि कवटीभिः

कपाटैर्बहुभिः।।


सर्वे युद्धाभिमानिनस्ते बलाध्याः

सरणागताः।

सर्वे शत्रूघ्नाः सर्वार्थशरणास्ते

शर्वाणि देवाश्च ते।

यस्य शक्त्यात्मकाश्चित्रा त्रिदशास्तेन

सुरारिहन्त्रा देवाः।

इत्युक्त्वैवंस्तुवन्तो देवाः ददृशुस्ते

युधि प्रहराणि।


ततस्तु मारुतसेनाभिस्तुष्टुवुश्चाब्रुवन्

प्रहराणि।

श्रुत्वा तुष्टाव मधुसूदन नाग

प्रहराणि चैव ते।

एवमध्ये युधि योध इव स्तुतवन्तः

समागताः।

नैवान्न घोरमुपगच्छत क्षयाय

तत्र देवाञ्जग्मुर्हताः।

न तं देवाश्च मरुतश्च संयोजयंत

उपाददे।

न संयोजयित्वा विष्णोः

कवचाय मधुसूदनः।।


कृष्णो मारुत उवाच:


अयं वज्रकवचस्त्वंस्तु प्रसीद

माधव प्रभो।

वधं प्रति न वा वक्ष्ये त्रातारं त्वां

जनार्दन।

कवचस्यापि यत्प्राप्तै दृढं कार्यं

मया शुभे।

तत्कुरुष्व मतिमांस तु यदहमप्यवाञ्छितः।।


मधुसूदनो वाच:


नरवक्षस्थलालग्नाः समुद्रे घर्मकाननाः।

वज्राधरा मध्यमे वा त्रयः सप्त स्वराः प्रति।

स्वरास त्रयो दश मात्राश्च अक्षराणि च पञ्चदश।

नवत्या द्विशतिमात्रा याः ताः परिदधाति मम्।।

पादयोः सर्वभूतानां शिरः क्ष्माम्बुधारया।

दृढाश्वचीरुणा युक्ता वायुत्रायामवस्थितः।

वायोरन्तर्गतः कृष्णः पृष्ठे सूर्यमण्डले।

कवचं सर्वभूतानां जीवनाय प्रतिष्ठितम्।।


ततः प्रभृति युद्धाय मधुसूदनो

गदाधरः।

रथेन सह सन्धाय भुजङ्गवलयङ्कृतः।।


एवमुपायं भगवान् कवचं भगवत्तमः।

अधिगम्याभिमुख्येन प्राहाद्भुतं नृपाय तत्।

रथाच्च सत्वया युक्तो यथावत् समवस्थितः।

ययौ समागताश्चैव कृष्णस्यैकान्तिकं पदः।।


Telugu:


ఓం


అయం వేఢాః పరశూ సాయకవశాధ్యాః

సర్వాభరణభూషితాః।

నిష్కాశః శ్మశానః కుణ్డలిడృదామర

నాగాహ్వ లీలాగృహాః।।

సర్వార్థం భాజంతే శిరః పథి కవటీభిః

కపాటైర్బహుభిః।।


సర్వే యుద్ధాభిమానినస్తే బలాధ్యాః

సరణాగతాః।

సర్వే శత్రూఘ్నాః సర్వార్థశరణాస్తే

శర్వాణి దేవాశ్చ తే।

యస్య శక్త్యాత్మకాశ్చిత్రా త్రిదశాస్తేన

సురారిహన్త్రా దేవాః।

ఇత్యుక్త్వైవంస్తువంతో దేవాః దదృశుస్తే

యుధి ప్రహరాణి।


తతస్తు మారుతసేనాభిస్తుష్టువుశ్చాబ్రువన్

ప్రహరాణి।

శ్రుత్వా తుష్టావ మధుసూదన నాగ

ప్రహరాణి చైవ తే।।

ఏవమధ్యే యుధి యోధ ఇవ స్తుతవంతః

సమాగతాః।

నైవాన్న ఘోరముపగచ్ఛత క్షయాయ

తత్ర దేవాఞ్జగ్ముర్హతాః।।

న తం దేవాశ్చ మరుతశ్చ సంయోజయంత

ఉపాదదే।

న సంయోజయిత్వా విష్ణోః

కవచాయ మధుసూదనః।।


కృష్ణో మారుత ఉవాచ:


అయం వజ్రకవచస్త్వంస్తు ప్రసీద

మాధవ ప్రభో।

వధం ప్రతి న వా వక్ష్యే త్రాతారం త్వాం

జనార్దన।

కవచస్యాపి యత్ప్రాప్తై దృఢం కార్యం

మయా శుభే।

తత్కురుష్వ మతిమాంస తు యదహమప్యవాఞ్ఛితః।।


మధుసూదనో వాచ:


నరవక్షస్థలాలగ్నాః సముద్రే ఘర్మకాననాః।

వజ్రాధరా మధ్యమే వా త్రయః సప్త స్వరాః ప్రతి।

స్వరాస్ త్రయో దశ మాత్రాశ్చ అక్షరాణి చ పఞ్చదశ।

నవత్యా ద్విశతిమాత్రా యాః తాః పరిదధాతి మమ్।।

పాదయోః సర్వభూతానాం శిరః క్ష్మామ్బుధారయా।

దృఢాశ్వచీరుణా యుక్తా వాయుత్రాయామవస్థితః।

వాయోరన్తర్గతః కృష్ణః పృష్ఠే సూర్యమణ్డలే।

కవచం సర్వభూతానాం జీవనాయ ప్రతిష్ఠితమ్।।


తతః ప్రభృతి యుద్ధాయ మధుసూదనో

గదాధరః।

రథేన సహ సన్ధాయ భుజఙ్గవలయఙ్కృతః।।


ఏవముపాయం భగవాన్ కవచం భగవత్తమః।

అధిగమ్యాభిముఖ్యేన ప్రాహాద్భుతం నృపాయ తత్।

రథాచ్చ సత్వయా యుక్తో యథావత్ సమవస్థితః।

యయౌ సమాగతాశ్చైవ కృష్ణస్యైకాంతికం పదః।।

Read More

Friday, 21 July 2023

sani kavacham .

 సఞ్చరే సుమహాసూరిః రవి పుత్రః యమగ్రజః।

చాయామాచారే సుమహాసూరిః సింహీకాగ్రజః॥

సౌరి గ్రహాధీపతయే సనిప్రపితామహాయై।

నమః కరోమి సద్భావేషు త్రైలోక్యానాం యశస్వినే॥


కోణే దిశం దధానాః స్యాద్రుద్రాధీపతయే నమః।

వాయవ్యాం వాయువే చాన్తరిక్ష గ్రహాధిపాయై॥

దక్షిణే నిశాకరాయ వరుణాధీపతయే నమః।

దక్షిణే చిత్రాసూభాన్తే వార్హదాదిధిపాయ చ॥


కోణే బృహస్పతేస్తు పూర్వఫాల్గుని సన్నుతౌ।

వామే వామాశ్లేష గతిః పశ్చిమార్ద్రే గ్రహపతయే॥

ఉత్తరే వహ్నినా చైవానుదకే నైమిషాయ చ।

ఉత్తరే సోమసంస్థానే విద్యుత్పుఞ్జాయ సన్నుతౌ॥


భృగు గురవే చ సౌమ్యాయ పిప్పలాదిగతాయ చ।

శన్యాం చ మే విధీతాయై పునరాయాన్తు దేహినః॥


నక్షత్రమాలాన్తర్గతాయ పఞ్చమీం ఆశ్రితాయ చ।

జఙ్గమాదిగతాయై చ షష్ఠీ గతికరాయ చ॥


గోప్త్రే సురకటాక్షాయ చక్రద్రుహాయ వై నమః।

త్రయాయుధాయ సర్వజగతాం పతయే నమః॥


యస్య జ్ఞానం దృశి స్థానం యశ్చ యన్త్రోద్యమ చ।

సర్వం తస్య సమాచిన్త్యం నాన్తరా సూరిభిర్గణైః॥


భయప్రదం జగత్సారం బ్రహ్మహత్యాదికారణమ్।

అష్టాదశపురాణాన్తం అజ్ఞానం చ వినాశనమ్॥


యోగాయ యోగసూత్రాయ భక్తానాం ప్రవరాయ చ।

తస్మై తేజోనిధయే చ యోగీశాయ విదేమహే॥


ఇదం కవచం పఠేన్నిత్యం శనేరం భక్తిసంయుతః।

రహతే చ సదా పుత్రం సన్తతోఽప్యవధీర్యతే॥


భుక్తిముక్తి ఫలం వాపి యస్య పుత్రప్రదాయకమ్।

కవచం నో దదీయాత్కిఞ్చిదన్యస్తు సనేరపి॥




Note: The above text is a transliteration of the Sani Kavacham in Telugu script. If you plan to use this prayer, it is recommended to seek the guidance of a knowledgeable priest or spiritual guide for proper pronunciation and understanding of the verses.

Read More

Saturday, 8 July 2023

కర్నూలు జిల్లా* *మంత్రాలయం : రాఘవేంద్రస్వామి*

*తెలుగు రాష్ట్రాల్లో మన దేవాలయాలు వాటి ప్రముఖ్యత -25* 
🛕

*కర్నూలు జిల్లా*

*మంత్రాలయం : రాఘవేంద్రస్వామి

రాఘవేంద్రస్వామి మహిమాన్వితుడైన మహాపురుషుడు, పండిత ప్రవరుడు. యోగి, తుంగభద్రా తీరాన ఆదవాని సమీపంలో మంత్రాలయం మహాక్షేత్రంగా నేడు పరిగణింప బడుతోంది. అది రాఘవేంద్ర స్వామి బృందావనం. అనగా వారి సమాధి స్థానం. కర్నూలు జిల్లాలోని మంచాల గ్రామము. స్వామివారి మహిమచే మంత్రాలయ క్షేత్రమె వెలసినది.

బొంబాయి-మద్రాసు బ్రాడ్ గేజి రైలు మార్గంలో ఆదోని దగ్గర వున్న తుంగభద్ర రైల్వేస్టేషన్ లో దిగి, బస్సుమీద మంత్రాలయం చేరవచ్చు. అక్కడికి తొమ్మిది మైళ్లు, కర్నూలు, ఆదోని పట్టణాలనుంచి బస్సులో వెళ్ళడానికి సదుపాయములున్నవి. మంత్రాలయంలో యాత్రికులకు దేవస్థానం వారిచే వసతి గృహాలు ఉచితంగా ఏర్పాటు చేయబడతాయి.

ఇప్పటికి మూడు శతాబ్దులకు పైగా అయినది. రాఘవేంద్రస్వామి వారి పూర్వాశ్రమ వృత్తాంతం పెద్దలు చెప్పుకుంటారు. వారు మాధ్వ బ్రాహ్మణులు. వారి తాత ముత్తాతలు విజయ నగర చక్రవర్తుల కాలంలో వైణిక విద్వాంసులుగా పేరు పొందినారట. శ్రీకృష్ణ దేవరాయల అనంతరం రాఘవేంద్రుని తండ్రిగారు తిమ్మన భట్టు విజయనగరం విడిచి కంచి దగ్గర భువనగిరి చేరుకున్నారు. తిమ్మనభట్టు భార్య గోపమ్మ. ఈ పుణ్య దంపతులకు వేంకటేశ్వరస్వామి  సేవా ఫలముగా ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె కలిగినారు. కుమారుని పేరు వెంకట భట్టు. గొప్ప మేధావి. ఆయన చిన్ననాటి నుంచి శ్రద్ధా భక్తుల తో విద్యాభ్యాసం చేసి తర్కవ్యాకరణ వేదాంత శాస్త్రాలు, తన అక్కగారి భర్త అయిన గురురాజా చార్యుల వారితో వీణావాద్యంలో నైపుణ్యం సాధించారు. సుధీంద్ర భర్తయైన లక్ష్మీ నరసింహా చార్యుల వద్ద అధ్యయనం చేశారు. అన్నగారు తీర్థులవారి శిష్యులయ్యారు. తమ ముప్పదవ యేట వివాహం చేసికున్నారు. భార్యపేరు సరస్వతి. వీరికి పుత్రుడు కలిగాడు. పుత్ర ముఖావలోకనం చేసిన తరువాత వెంకట భట్టు సుధీంద్ర తీర్ధస్వాముల ఆజ్ఞతో ఆశ్రమ స్వీకారం చేసి రాఘవేంద్ర స్వామిగా పేరుపొందారు.

భార్య సరస్వతికి ఈ వార్త తెలిసి పతి ఎడబాటు భరించలేక బావిలోపడి చనిపోయినదట. ఆ కారణంచే ఆమె పిశాచమైనది. స్వామివారది తెలుసుకొని మంత్రశక్తిచే ఆమెను పిశాచ జన్మ నుండి విముక్తురాలిని చేశారని జనశ్రుతి.

సన్యాసాశ్రమం స్వీకంచిన స్వామి శ్రీరంగం, కంచి, రామేశ్వరం, మధుర మొదలైన క్షేత్రాలు సేవించుతూ మధ్వాచార్యుల స్థానమైన ఉడిపి వచ్చి శ్రీకృష్ణ దర్శనం చేసుకున్నారు. చివరకు తుంగభద్రా తీరంలో వున్న ''మంచాల' తాము సిద్ధి పొందడానికి తగిన స్థలమని నిర్ణయించుకున్నా రు. ఆ రోజులలో ఆదవాని నవాబు సిద్ది మసీదు ఖాన్. అతడు రాఘవేంద్రస్వామి మహిమ గుర్తించి మంచాల గ్రామాన్ని ఆయనకు సమర్పించాడట. మంచాలమ్మ గ్రామదేవత. రాఘవేంద్ర స్వామి ఆ దేవతాలయం ప్రక్క క్రీ.శ. 1670 లో సజీవ సమాధిలో ప్రవేశించారు. శ్రావణ బహుళ విదియ గురువారం బృందావనస్థులై నారు. పన్నెండు వేల సాల గ్రామాలతో నిర్మించ బడిన ఆ స్థానం శుద్ధ మృత్రికచే మూయబడినది. ఎంతో పవిత్రంగా భావించబడుతూ ఉంటుంది.
📖

మంత్రాలయానికి ఆనేక రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు. స్వామిని పూజించి ప్రదక్షిణ నమస్కారాలు చేసి వాంఛిత సిద్ధి పొందుతూ వుంటారు. రాఘవేంద్ర స్వామి ఆశీర్వచన ప్రభావంచే రోగనివారణ చేసికోవచ్చునని భక్తుల విశ్వాసం. మంత్రాలయంలో వేదపాఠశాల వుంది. ప్రసిద్ధులైన వేదశాస్త్ర పండితులు అక్కడ అధ్యాపకులుగా వుంటున్నారు. మంత్రాలయం సర్వజన దర్శనీయమైన క్షేత్రం. రాఘవేంద్రస్వామి ప్రహ్లాదుని అవతారమని చెబుతారు.
📖

*మహబూబ్ నగర్ జిల్లా*

*అలంపురం*

తుంగభద్రా నదీతీరంలో మహబూబ్ నగర్ జిల్లా లో ఉన్న ఈ అలంపురములోని ఆలయములు అసంఖ్యాకములు. 7, 8 శతాబ్దాలలో ఇక్కడ పరిపాలించిన చాళుక్యులు ఈ ప్రాంతములోని ఆలయ నిర్మాణ కారకులు. 9వ శతాబ్దములో రాష్ట్రకూటులు, 10, 11 శతాబ్దములలో కళ్యాణ చాళుక్యులు వారి రాణులు, సామంతులు ఈ ఆలయాల ఉద్ధరణకు ఎంతో తోడ్పడిరి. తరువాత బహమనీ సుల్తానుల పరిపాలన కాలములో ఈ ఆలయములన్నియు ధూపదీప నైవేద్యములు లేక జీర్ణస్థితిలోనికి జారుకొన్నవి. కొన్ని నాశనస్థితికి చేరుకొన్నవి. ఇక్కడ అసలు తారక బ్రహ్మాలయము నేలమట్టము చేయబడిన దనియే చెప్పవలెను. ఆ తరువాత శ్రీకృష్ణ దేవరాయలు, ముస్లిమ్ పరిపాలకులు, కొందరు దొరలు ఈ ఆలయముల రక్షణకు దోహదము చేసిరి.

రాయచూరు విజయ యాత్రానంతరము 1521 లో శ్రీకృష్ణ దేవరాయలు ఈ ప్రాంతమునకు వచ్చి ఆలయములకు అనేక గ్రామములనిచ్చి 'బసవరాజు' అను నతని ఆ పట్టణానికి, ఆలయానికి సంరక్షకునిగా నియమించినట్లు గలదు. ఆ కోట గోడలమీద మహాభారత కథల శిల్ప విన్యాసములను చూడగలము.


 దేవాలయమునకు వెనుకనున్న అర్ధనారీశ్వర కుడ్యచిత్రము, గంగావతరణమును కన్నులకు కట్టినట్లు చూపు చెక్కడము యాత్రీకులకు ఎంతో ఆనందానుభవాన్ని కలుగచేయును

Read More

Powered By Blogger | Template Created By Lord HTML