మూత్రపిండాల ఆరోగ్యానికి అవసరమయిన మంచి ఆహారపదార్థాలు : అలవాట్లు
ప్రపంచ వ్యాప్తంగా కిడ్నీ (మూత్రపిండాల) జబ్బులు పెరుగుతున్నాయి. దానికి సంబంధించిన చికిత్సా విధానాల్లో అత్యాధునిక మార్పులు వస్తున్నాయి.
నిరంతరం రక్తంలోని వ్యర్థాలను వడకడుతూ...మూత్రపిండాలు మన శరీరంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంటాయి. వీటిని జాగ్రత్తగా కాపాడుకోవడం ప్రాణావసరం. ఒకసారి మూత్రపిండం పనితీరు మందగించి అది విఫలమవటం ఆరంభమైందంటే దాన్ని పూర్తిగా నయం చేయటం కష్టం. పైగా చికిత్సకు ఎంతో ఖర్చు అవుతుంది. మూత్రపిండం పూర్తిగా విఫలమైతే కృత్రిమంగా రక్తాన్ని శుద్ధి చేసుకుంటూ ఉండక తప్పదు. ఈ 'డయాలసిస్' కోసం నెలకు సుమారు రూ.4-5వేలు ఖర్చు అవుతాయి. అంతేకాకుండా ఇతరత్రా సమస్యలు ఏర్పడతాయి. చికిత్స తీసుకున్నా కిడ్నీ తిరిగి సమర్థంగా మారదు.
గుండె జబ్బులు, అవయవాలు దెబ్బతినటం వంటివీ మొదలవుతాయి. పోనీ దెబ్బతిన్న మూత్రపిండాన్ని మార్పిడి చేయించుకోవాలంటే కిడ్నీ దాతలు దొరకటం కష్టం. ఆపరేషన్ పెద్ద ప్రయత్నమనుకుంటే ఇక ఆ తర్వాత జీవితాంతం వేసుకోవాల్సిన మందులకూ ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. ఎన్నో ఇబ్బందులు, దుష్ప్రభావాలు, ఇంత ఖర్చు చేసి చికిత్స తీసుకున్నా జీవనకాలమూ తగ్గవచ్చు. ఇలాంటి ప్రమాదాలన్నీ దరిచేరకుండా వుండాలంటే ముందే మేల్కొని, అసలు కిడ్నీలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది.
శరీరం మొత్తాన్నీ శుచిగా, శుద్ధిగా ఉంచే సహజసిద్ధ యంత్రాలు కిడ్నీలు, అవి ఒక్కసారి పనిచేయమని మొరాయిస్తే...ఆరోగ్యం అస్తవ్యస్తం అయిపోతుంది. అంతటి ప్రాముఖ్యం ఉన్న కిడ్నీలను కాపాడుకోవాలంటే ముందు జీవనశైలి ఆరోగ్యంగా ఉండాలి.జీవనశైలి ఆరోగ్యంగా ఉండాలంటే అం దుకు మంచి ఆహారం తీసుకోవాలి. కిడ్నీకు ఉప యోగపడే కొన్ని ఆహారాలను తరచూ తీసుకోవడం వల్ల కిడ్నీసమస్యలను అరికట్టవచ్చు.కిడ్నీలో రాళ్ళు ఏర్పడటం, కిడ్నీఇన్ఫెక్షన్‌వంటివాటికి దూరంగా వుం డొచ్చు.కిడ్నీనిపదిలంగా ఉంచే కొన్నిఆహారాలు:-
వెల్లుల్లి : వెల్లుల్లి సూపర్‌ఫుడ్‌గా పేరొందింది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు యాంటీ క్లోటింగ్ కణాలు అంటే గుండె సంబంధిత వ్యాధులను కట్టడిచేసే పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించడానికి శరీరం మొత్తాన్ని శోధిస్తుంది.
బెర్రీస్ : బెర్రీస్ అనే ఈ పండ్లు పలు రంగుల్లో వస్తాయి. వీటిలో బ్లాక్‌బెర్రీ తప్పించి మిగిలినవన్నీ తినతగినవే. స్ట్రాబెర్రీ, క్రాన్ బెర్రీస్, రాస్పెరీస్ మరియు బ్లూబెర్రీస్ అన్నింటిలోనూ కిడ్నీ ఫ్రెండ్లీ న్యూట్రిషియన్స్ మరియు యాంటీఇన్‌ప్లమేటరి గుణాలు పుష్కలంగా ఉండి, వ్యాధి నిరోధకతను కలిగించి బ్లాడర్ ఫంక్షన్స్ సక్రమంగా పనిచేసేందుకు సహాయపడుతాయి.
రెడ్‌బెల్ పెప్పర్ : చాలా మంది వారికి తెలిసి మరియు తెలియకుండానే కిడ్నీ వ్యాధులకు గురి అవు తుంటారు. కిడ్నీ సంబంధిత వ్యాధుల నుండి రక్షణ పొందడానికి ఈ సూర్ ఫుడ్‌ను మీ డైలీ డైయట్ లో చేర్చుకోవాలి. రెడ్‌బెల్ పెప్పర్‌లో పొటాషియం తక్కువగా ఉండి విటమిన్స్ (ఎ,సి,మరియు బి6) పోలిక్ యాసిడ్ మరియు ఫైబర్ ఉండటం వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాదు కొన్ని క్యాన్సర్లను ఎదుర్కొంటుంది.
మొలకెత్తిన విత్తనాలు : పచ్చివి చిరుధాన్యాలు మొల కెత్తించి తినడం వల్ల శరీర ఆరోగ్యానికి మాత్రమే కాదు, మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి. మొలకెత్తిన విత్తనాలు రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల మూత్రపిండాలను శుభ్రపరచి, కిడ్నీలో రాళ్ళు ఏర్పడటాన్ని తగ్గిస్తుంది.
క్యాబేజ్ :క్యాబేజ్ మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. సాధారణంగా క్యాబేజ్‌ను మూత్రపిండాల డ్యామేజ్‌ను అరికట్టడానికి మరియు మూత్రపిండాల పోషణకు ఒక మంచి సహజ ఔషధంగా ఉపయోగిస్తారు.
ఆపిల్స్: ద్రాక్ష, చెర్రీ మరియు ఆపిల్స్ వంటివి ఆరోగ్యానికి చాలా మంచివి. ఇవి మూత్రపిండాలు నిర్విషీకరణం మరియు శుభ్రపరచడానికి బాగా సహాయపడుతాయి. మీరు డాక్టర్‌కు దూరంగా ఉం డాలంటే ప్రతిరోజు ఒక ఆపిల్ తినడం మంచిది!
ఆలివ్ ఆయిల్ : వివిధ రకాల ఆయిల్స్‌లో ఆలివ్ ఆయిల్ ఆరోగ్యానికి మరియు గుండెకు ఎంత మేలు చేస్తుందో మనందరికీ తెలిసిన విషయమే. ఆలివ్ ఆయిల్‌లో యాంటీఇన్ ప్లమేటరీ ఫాటీ యాసిడ్స్ కలిగి ఉండి కిడ్నీ ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతాయి.
ఉల్లిపాయలు : ఉల్లిపాయలు, కిడ్నీలోని రాళ్ళను సహజంగా తొలగించడానికి సహాయపడుతాయి. అంతేకాదు. మూత్రపిండాలను నిర్విషీకరణం మరియు మూత్రపిండాల శుభ్రతలో ప్రముఖ పాత్రను పోషిస్తాయి.
రెడ్ గ్రేప్స్ : ఇది కిడ్నీ హెల్దీ ఫుడ్. అందువల్లే దీన్ని మీ డైలి డైయట్‌లో ఖచ్చితంగా చేర్చుకోవాలి. రెడ్‌గ్రేప్స్‌లో అధికంగా ప్లవనాయిడ్స్ కలిగి ఉండి బ్లడ్‌కాట్స్‌ను తగ్గిస్తాయి. రెడ్‌గ్రేప్స్ తరచూ తీసుకోవడం వల్ల గుండె మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులను తగ్గించే అవకాశాలు ఎక్కువ.
చెర్రీస్ : చెర్రీస్‌లో అధికంగా విటమిన్స్ మరియు లోప్రోటీన్స్ కలిగివుంటాయి. చెర్రీస్‌ను తరచూ తీసు కోవడం వల్ల శరీరంలోని పొటాషియం లెవల్స్‌ను తగ్గించేందుకు సహాయపడుతుంది. దాంతో కిడ్నీ ఆరోగ్యంగా ఉండటానికి సహాయ పడుతుంది.
ఎగ్‌వైట్ : ఎగ్‌వైట్‌లో అమినోయాసిడ్స్ మరియు లోఫాసస్ర్ అధికంగా కలిగి ఉంటాయి. అందుకే వీటిని కిడ్నీ ఆరోగ్యంగా ఉంచే ఆహారాల్లో దీన్ని కూడా సూపర్ ఫుడ్‌గా లెక్కిస్తారు.
చేపలు : చేపల్లో ఒమేగా 3, ప్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండి, శరీర శోషణకు బాగా సహక రిస్తుంది. చేపల్లో సాల్మన్, రైన్బో ట్రౌట్, మకెరేల్, హెరింగ్ మరియు తున చేపలు ఆరో గ్యానికి మేలు చేసే చేపలు. ఇవి కిడ్నీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment