What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Monday, 28 July 2014

ఇది శివునికి విష్ణువు చెప్పినటువంటిది.

నమో నమస్తే గోవింద చక్రం గృహ్య సుదర్శనమ్!
ప్రాచ్యాం రక్షస్వమాం విష్ణో త్వామహం శరణం గతః!!
గదాం కౌమోదకీం గృహ్య పద్మనాభామితద్యుతే!
యామ్యాం రక్షస్వమాం విష్ణోత్వామహం శరణం గతః!!
హలమాదాయసౌనందం నమస్తే పురుషోత్తమ!
ప్రతీచ్యాం రక్షమే విష్ణో భవంతం శరణం గతః!!
శార్జమాదాయచ ధనురస్త్రం నారాయణం హరే!
నమస్తే రక్ష రక్షోఘ్న ఐశాన్యాం శరణం గతః!!
పాంచజన్యం మహాశంఖమంతర్బోధ్యం చ పంకజమ్!
ప్రగృహ్య రక్షమాం విష్ణో ఆగ్నేయ్యాం యజ్ఞసూకర!!
చర్మ సూర్య శతం గృహ్య ఖడ్గం చంద్రమసంతథా!
నైరృత్యాం మాం చ రక్షస్వ దివ్యమూర్తే నృకేసరిన్!!
వైజయంతీం ప్రగృహ్యత్వం శ్రీవత్సం కంఠభూషణమ్!
వాయవ్యాం రక్షమాం దేవ అశ్వశీర్ష నమోస్తుతే!!
వైనతేయం సమారుహ్య అంతరిక్షే జనార్దన!
మాంత్వరం రక్షాజిత్ సదా నమస్తే త్వపరాజిత!!
విశాలాక్షం సమారుహ్య రక్ష మాంత్వం రసాతలే!
ఆకూపార నమస్తుభ్యం మహామోహ నమొస్తుతే!!
కరశీర్సాంఘ్రిపర్వేషుతథాష్ట బాహు పంజరమ్!
కృత్వారక్షస్వమాం దేవ నమస్తే పురుషోత్తమ!!
ఏతదుక్తం భగవతా వైష్ణవం పంజరం మహత్!
పురా రక్షార్థమీశేన కాత్యాయన్యా ద్విజోత్తమ!!
నాశయామాస సా యత్ర దానవం మహిషాసురమ్!
సమరం రక్తబీజం చ తథాన్యాన్ సురకంటకాన్!!
ఇది శివునికి విష్ణువు చెప్పినటువంటిది. ఏ దిక్కున ఎలా రక్షించాలి. రకరకాల ఆయధాలు ఇందులో పట్టుకున్నాడు. హలము, ముసలము - రోకలి, నాగలి పట్టుకున్న స్వరూపం - బలరామ కృష్ణ స్వరూపం; నృసకేసరీన్ - మహానరసింహ స్వరూపం; స్వామి మహామీన - మత్స్యావతారం; దశదిశలలో నారాయణుడు ఎలా రక్షిస్తాడో చెప్తున్నారు. ఇందులో బీజాక్షర సంపుటిలు లేవు. అంటే పెద్ద నియమాలు, బాధలు లేవు. రోజూ స్నానం చేసి శుద్ధంగా చదువుకుంటే చాలు. ఇది గౌరీదేవి శివునియొద్ద ఉపదేశం పొంది చదివింది.అసుర సంహార సమయంలో దేవతలు విష్ణు పంజర స్తోత్రం చదువుకున్నారు. విష్ణు పంజరస్తోత్రం చేస్తే విష్ణువు వారి చుట్టూ ఉండి రక్షిస్తాడు. విన్నా చాలు, చదివినా చాలు.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML