What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Thursday, 31 July 2014

లలితా దేవిని పరదేవత అంటారు కదా! అంటే పరానికి తప్ప, ఇహానికి ఆ దేవతను ఉపాసించరాదని మా మిత్రులొకరు అన్నారు నిజమేనా?

లలితా దేవిని పరదేవత అంటారు కదా! అంటే పరానికి తప్ప, ఇహానికి ఆ దేవతను ఉపాసించరాదని మా మిత్రులొకరు అన్నారు నిజమేనా? 

ఆ పదానికి అర్థం తెలియక ఏది తోచితే దానిని చెప్తే ఇలాంటి తప్పుడర్థాలే వస్తాయి.
’పరదేవత’ అంటే ’ఇంతకు మించిన దేవతలేదు’, ’సర్వోన్నతురాలు’ - అని అర్థం. అంతేకానీ కేవలం ’పరమే’ తప్ప, ’ఇహం’ కాదు - అనే అర్థం లేదు. ఇక్కడ ’ఇహపరాలు’ అనే భావమే లేదు.
’ధనధాన్యవివర్ధినీ’, ’సర్వసౌభాగ్యదాయినీ’, ’సర్వవ్యాధిప్రశమనీ’, ’ధర్మిణీ ధర్మవర్ధినీ’, ’దౌర్భాగ్యతూలవాతూలా - జరాధ్వాంతరవిప్రభా’, ’లోక యాత్రావిధాయినీ’....ఇలాంటి ఎన్నో నామాలు లలితా సహస్రనామాలలో గోచరిస్తాయి. అలాగే ’ధ్యానధ్యాతృ ధ్యేయరూపా’, ’కేవలా’,”కైవల్య ప్రదాయినీ’ - వంటి నామాలూ ఉన్నాయి. ఈ రెండు విధాలైన నామాలను పరిశీలిస్తే - అమ్మవారు ఇహ, పరాలను ప్రదానం చేసే జగదంబిక అని స్పష్టమౌతుంది.
లలితా దేవిని అరాధించేవారికి - ఐహిక సుఖాలేకాక, పారమార్థిక జ్ఞానం, మోక్షం కూడా లభిస్తాయి.




No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML