
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Monday, 28 July 2014
దేవతల్లో నాలుగు చేతులు, ఎనిమిది చేతులు, పద్దెనిమిది చేతులు, పదిచేతులు ఇలా ఎందుకుంటాయి? అన్ని చేతులున్న వాళ్ళెక్కడైనా ఉంటారా?
మనకి కనిపించే మనలాంటి జంతువులతో దేవతల్ని పోల్చుకోనక్కర్లేదు. మనవలె ఉండని వారే దేవతలు. వారి బహుశక్తి సంపన్నతకు సంకేతాలు బహుబాహువులు. నాలుగు దిశలలో విస్తరించిన విశ్వ చైతన్య శక్తి (Cosmic energy) దైవం. ఆ దిశలని ఎనిమిదిగా (మూలలతో - విదిశలతో కలిపి) చూస్తే - అష్టదిశలా ఆవరించిన అష్టభుజాలు. పరిపూర్ణ సంఖ్యకు (1+8=9) సంకేతంగా పూర్ణశక్తి సంకేతం అష్టాదశ భుజాలు. ఇవీ దేవతల చేతులకి సంకేతాలు. ఇంతేకాక - మనకు తెలియని రహస్యాలు చాలా ఉంటాయి. జంతు ప్రపంచంలోనే మనకంతుపట్టని దేహ స్వభావాలున్నవి అసంఖ్యాకం. మరి దేవతా జగతి గురించి మన బుద్ధులతో అంచనా వేయగలమా!
పై సంకేతాలే కాక - ఆయా దేవతలకి సంబంధించిన శబ్ద స్వరూపమైన మంత్రాలలోని బీజాక్షరాలు, మంత్రాక్షర నిర్మాణం కూడా దేవతకృతిలో గర్భితమై ఉంటుంది. ఆయా మంత్రాలను శ్రద్ధగా ఉపాసిస్తున్న కొద్దీ ఆ దేవత అనుగ్రహిస్తుంది. ఆ అనుగ్రహంతో దేవతా తత్త్వం అవగతమవుతుంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment