What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Monday, 28 July 2014

శ్రీ కృష్ణ కర్ణామృతం గ్రంథ కర్త లీలాశుకుడు

శ్రీ కృష్ణ కర్ణామృతం గ్రంథ కర్త లీలాశుకుడు. ఈయన అసలు పేరు బిల్వమంగళుడు. లీలాశుకుడు - ఈయనకు ఇది ఒక ఆశ్రమ నామధేయమా? లేకపోతే రచనబట్టి వచ్చిన నామధేయమా? మనకు తెలియదు. చిత్రమేమంటే మన పూర్వ మహా కవుల చరిత్రలు మనకు తెలియవు. కారణం వారు వాళ్ళని తెలియజేసుకోవాలని ఎప్పుడూ తాపత్రయపడలేదు. అదీ విశేషం. వారి వారిద్వారా మహా వస్తువులను చెప్పడమే ఆనందించారు తప్ప Identification కోసం తాపత్రయపడలేదు. అది తెలియక మనవాళ్ళు మనవాళ్ళకి చరిత్ర మీద శ్రద్ధ తక్కువండీ అని అంటారు. భౌతికమైన Identification భారతీయ వేదాంతం ఎప్పుడూ పట్టించుకోలేదు. అందుకే కాళిదాసు ఎప్పటివాడు అన్న లెక్క ఇప్పటికీ తేలలేదు. శంకరుల కాలం గురించి ఇప్పటికీ తేలలేదు. అనేక గ్రంథాలకి కర్తలెవరో కూడా మనకు తెలియలేదు. ఎటువంటి పరిస్థితి యేర్పడింది అంటే ఆ మహాత్ములు ఎప్పుడో ఆ భగవంతునితో తన్మయత్వం చెంది తమ నామరూపముల పరిధులను అతిక్రమించి పోయారు. అటువంటి మహాత్ములు. లీలాశుకుడి కాలం యేమిటి? ఆయన అసలు పేరు ఏమిటి? ఏ ప్రాంతం వాడు? ఏ భాష వాడు? వీటన్నింటి మీద తర్జనభర్జనలు ఎన్నో సాగాయి, సాగుతూన్నాయి, సాగుతాయి. వాటిలో మార్పులుండవచ్చు కానీ శ్రీకృష్ణునిలో మార్పులేదు. కృష్ణ కర్ణామృతంలో మార్పులేదు. ఎందుకు లీలా శుకుడు అని పేరు పెట్టారు అంటే శ్రీకృష్ణ కర్ణామృతాన్ని ముందు ప్రపంచానికిచ్చిన వాడు శుకమహర్షి కదా మనకి. ఆయన తర్వాత మళ్ళీ అదేవిధంగా కృష్ణ కర్ణామృతాన్ని మనకు అందించినవాడు కనుక అభినవ శుకుడు అనే అర్థమే లీలాశుకుడు. అంటే లీలగా వచ్చిన మరియొక శుకుడు. అంతే కాకుండా శ్రీకృష్ణుని లీలలను గానం చేసిన శుకమిది. శుకము అంటే చిలక అని అర్థం.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML