What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Tuesday, 22 July 2014

లక్ష్మీ నివాస స్థానములు

లక్ష్మీ నివాస స్థానములు
నిత్య సత్యులు, శౌచనిరతులు, గురుభక్తు లప్రమత్తులు, దక్షు లమలమతులు
సత్కర్మపరులు, విజ్ఞానము దపము దానము బ్రహ్మచర్యంబు శమము గల్గు
వారలు, ప్రీతి నా వసియించు నిక్కలు క్రూరు, నాస్తికుగృతఘ్నుని గుబుద్ధి
వర్జింతు నెంగిలి వర్జించి, యిలువాడి! ఘటశుద్ధి గలిగిన కాంతలందు
నిల్తు వల్లభ ప్రతికూల, నిష్ఠురాత్మ, నన్యమందిరగామిని, నధికనిద్ర
యైన మానిని దొరగుడు నబ్జినీ తటాక తరుషండ పుష్ప వాటముల నిలుతు!!
(మహాభారతం - అనుశాసనిక పర్వం - ప్రథామాశ్వాసము - 285)
లక్ష్మి ఉండే చోట్లు, ఉండని చోట్లు ఈ పద్యంలో చెప్పబడ్డాయి. లక్ష్మి అంటే ధనమే కాదు శుచీ శుభ్రత, సరళత, అందం - ఇట్లాంటివన్నీ. ’నిత్యమూ సత్యం చెప్పేవారు, శుచికలవారు, గురుభక్తులు, మతులు కానివారు, కార్య సాధకులు, స్వచ్ఛమైన మనస్సు కలవారు, మమ్చి కర్మలు చేసేవారు. విజ్ఞానం, తపస్సు, దానం, బ్రహ్మచర్యం, ఇంద్రియనిగ్రహం కలవారు - నేను నివసించే స్థలాలు.
నేనుండని స్థలాలు - క్రూరులు, నాస్తికులు, కృతఘ్నులు, చెడ్డబుద్ధి కలవారు (లోకంలో వీరిదగ్గర డబ్బుండడం చూస్తున్నాం. కానీ లక్ష్మి అంటే డబ్బు కాదు. తృప్తి, ఆనందం, నిండుదనం, సంతోషం). ఎంగిలి కాని పాత్రశుద్ధి కలిగిన గృహనీతి కల స్త్రీల దగ్గర ఉంటాను. భర్తను ఎదిరిమ్చే స్త్రీ, కఠినమైన మనస్సు కలదీ, కొంపలవెంట తిరిగేదీ, ఎక్కువ నిద్రపోయేదీ - ఈ స్త్రీలు నాకు నచ్చరు. ఇట్లాంటి వారిలో నేనుండను. తామరపూలతో నిండిన సరస్సులు, చెట్లు, పూలు కల తోటలలో ఉంటాను. (కనుక అందమున్న చోట్లు లక్ష్మికి నివాసాలు).



No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML