What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Sunday, 20 July 2014

ఆంగ్ కోర్ వాట్ ప్రపంచంలోనే అతి పురాతనమైన, అత్యంత పెద్దదైన హిందూ దేవాలయం..

ఆంగ్ కోర్ వాట్ ప్రపంచంలోనే అతి పురాతనమైన, అత్యంత పెద్దదైన హిందూ దేవాలయం.. 
చరిత్రను పరికిస్తే... హిందూ సంస్కృతి ఆనవాళ్ళు విశ్వవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఉన్నట్టు ఇప్పటికే ఋజువులున్నాయి. వేల ఏళ్ళ క్రితమే మన హిందూ సంస్కృతి ప్రపంచం నలుమూ లలా ఫరిఢవిల్లింది. నాటి హిందూ రాజులు మన సంస్కృతిని విశ్వ వ్యాప్తం చేశారు. మన సంప్రదాయాలు, శిల్ప కళా నైపు ణ్యం విదేశాల్లో ఇప్పటికీ వేనోళ్ళ పొగడ్తలందుకుంటూనే ఉంది.హిందూ దేవాలయ సంప్రదా యం కేవలం మన భారతదేశంలోనే కాకుండా అనేక దేశాల్లో కూడా వ్యాపించింది. జైన, బౌద్ధ మతాల కన్నా హిందూ మతం బాగా పరిఢవిల్లిం దనడం అతిశయోక్తి కాదు. అందుకు నిదర్శనమే ఈ కంబోడియా లోని కొన్ని వం దల సంవత్సరాల క్రితం నిర్మించిన విష్ణూదేవు ని ఆలయం ‘ఆంగ్‌కోర్‌ వాట్‌’.
ఆంగ్‌కోర్‌ వాట్‌ దేవాలయం కంబోడియాలోని సీమ్‌ రీప్‌ పట్టణానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. హిందూ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించే అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం ఇక్కడ కనిపి స్తుంది. భారతీయ ఇతిహా సాలను తనలో ఇముడ్చుకుని అందరినీ ఆకట్టుకుంటోంది. అంతేకాదు ఈ దేవాల యం ఆ దేశ జాతీయ పతాకంలో కూడా స్థానం సంపాదించుకుంది. ఈ ఆలయానికి కొన్ని దశాబ్దాల చరిత్ర ఉంది. ఖ్మేర్‌ సామ్రాజ్యంలో ఈ అద్భుత కట్టడానికి అంకురా ర్పణ జరిగింది. క్రీశ 12వ శతాబ్దకాలంలో ఆంగ్‌ కోర్‌ వాట్‌ను రాజధానిగా చేసుకుని పాలించిన రెండవ సూర్యవర్మన్‌ కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగి నట్లు చరిత్ర చెబుతోంది. దీన్ని నిర్మించడానికి సుమారు 30 సంవత్సరాలు పట్టిందట. ఈ దేవాలయ నిర్మాణం మన దేశంలోని తమిళనాడు దేవాలయాలను పోలి వుంటాయి. తమిళనాడుకు చెందిన చోళరాజుల నిర్మాణ పద్ధతులు ఈ దేవాలయాల్లో కనిపిస్తా యి. అయితే ఈ దేవాలయాలన్నీ మిగతా వాటికి భిన్నంగా పశ్చిమ ముఖద్వారాన్ని కలిగి ఉన్నాయి. టోనెల్‌ సాస్‌ సరస్సు తీరాన సుమారు 200 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఎంతో విశాలమైన ప్రాంగణంలో ఎన్నో దేవాలయాల సముదాయం తో ఆహ్లాద భరితంగా ఉంటుంది.మనదేశంలో కూడా లేదు..!భారతదేశంలో కూడా ఇంత పెద్ద దేవాలయం లేదనే చెప్పాలి. అద్భుతమైన ఆర్కి టెక్చర్‌తో ఈ దేవాలయాన్ని రూపొందించారు. కులేన్‌ పర్వత శ్రేణుల పాదాల చెంత నిర్మించబడ్డ ఈ దేవాలయం ప్రపచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా, విష్ణు మూర్తి ఆలయంగా వెలుగొందుతోంది.
అత్యత్భుత సాంకేతిక నైపుణ్యం...ఖ్మేర్‌ సామ్రాజ్యంలో నీటిని నిల్వ చేసుకునేందుకు అద్భుత మైన టెక్నాలజీని ఉపయో గించారు. ఇక్కడి నీరు పల్లం నుండి ఎత్తుకు ప్రవహించేదట. అదే టెక్నాలజీని ఆంగ్‌ కోర్‌ వాట్‌ దేవాలయంలో కూడా వాడారు. ఇది అప్పట్లోనే ఎలా సాధ్యమయ్యిందనే విషయం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ఐదు మైళ్ల పొడవు, ఒకటి న్నర మైలు వెడల్పు తో విశాలమైన రిజర్వాయర్లు (వీటిని అక్కడ ‘బారే’లు అంటారు) నిర్మించడం ఆనాటి ఇంజనీర్ల ప్రతిభకు నిదర్శనం. ఈ రిజర్వాయర్లను వ్యవ సాయ అవసరాలకు కూడా ఉపయోగించే వారట. ఫ్రెంచ్‌ ఆర్కియాలజిస్ట్‌ ఫిలిప్‌ గ్లోసియర్‌ ఈ రిజర్వా యర్లపై పరి శోధన జరిపి ఈ విషయాన్ని ధృవపరిచారు. నాసా చిత్రీకరించిన ఉపగ్రహ చిత్రాల ఆధారంగా పరిశోధ నలు జరిపిన సిడ్నీ యూనివర్శిటీ ఆర్కియాలజిస్టుల పరిశోధన కూడా ఫిలిప్స్‌ అభిప్రాయాన్ని బలపరు స్తోంది. ఉపగ్రహ చిత్రా ల్లో అప్పటి మానవ నిర్మితమైన నీటి ట్యాంకులు, కాలువలు, డ్యాములు చాలా స్పష్టంగా కనిపించాయట.అద్భుతమైన దృశ్యాలు...ముఖద్వారం నుండి దేవాలయం లోపలికి వెళ్లగానే చుట్టూ పచ్చని పచ్చికతో అక్కడి వాతావరణమం తా ఆహ్లాదభరితంగా ఉంటుం ది. ముఖద్వారం నుండే మూడు పెద్ద పెద్ద గోపురా లు దర్శనమిస్తాయి. ఇం దులో మధ్య గోపురం నుం డి లోపలికి వెళ్తే అనేక గోపురాలు కనిపిస్తాయి. భారత పురాణాలైన రామాయణ, మహా భారత దృశ్యాలు అనేకం ఇక్కడ మనకు సాక్షాత్కరిస్తాయి. దేవతలూ, రాక్షసుల మధ్య జరిగిన క్షీరసాగర మధన దృశ్యాలు అందర్నీ ఆకట్టుకుంటాయి. తూర్పు వైపు మండపంలో విష్ణుమూర్తి పుట్టుక, అవతా రాలకు సంబంధించిన శిల్పాలు ఉంటే పశ్చిమం వైపు మండపం గోడలపై యుద్ధాలు, మరణాలకు సంబంధించిన ఆకృతులు కనిపిస్తాయి.కురుక్షేత్ర యుద్ధం, రామ రావ ణ యుద్ధ సంఘటనలు ఎంతో చక్కగా మలచబడ్డాయి. ఇక దక్షిణ మండపంలో ఆల యాన్ని నిర్మించిన రాజు రెండవ సూర్యవర్మన్‌ రాజ్యానికి సంబంధించిన సైనిక పటాల దృశ్యాలు దర్శనమిస్తాయి. ఇవే కాక పురాణ పురుషులు, మునులు, కిన్నెర కింపురు షాధి అప్సరసల నాట్య విన్యాసాలు, యమధర్మరాజు కొలువుదీరిన యమసభ వంటి అనేక కళాఖండాలు ఆంగ్‌కోర్‌ వాట్‌ ఆలయ గోడలపై సాక్షాత్కరిస్తాయి.ఈ పేరెలా వచ్చిందంటే...ఇదంతా చదివిన తర్వాత భారతీయ సంస్కృతి ఆనవాళ్లే లేని కంబోడియాలో ఇంతపెద్ద హిందూ దేవాలయాన్ని ఎలా? ఎందుకు నిర్మించారనే ప్రశ్న తలెత్తే ఉంటుంది కదా? అసలు విషయానికొస్తే పూర్వకాలంలో ‘కాంబోజ దేశం’ అని పిలిచేవారు. తర్వాత కాంబోజ దేశం కాలక్రమంలో కంబోడియాగా మారిపోయింది.కంబోడియా చరిత్ర...పూర్వకాలంలో కాంబోజ దేశంలో హిందూ సంస్కృతే ఎక్కువగా ఉండేది. 9-15 శతా బ్దాల కాలంలో ఈ దేవాలయాన్ని నిర్మించిన రెండవ సూర్యవర్మన్‌తో పాటు అనేకమం ది హిందూ రాజులు కంపూచియాను పాలించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. చైనా రికార్డుల ప్రకారం ఈ ప్రాంతమంతా భరత ఖండానికి చెందిన రాజుల పాలనలో ఉంది. ఖ్మేర్‌ నాగరికత తర్వాత కొన్ని శతా బ్దాల అనంతరం భారతీయ సంస్కృతి కంపూచియాకు వ్యాపించింది. సం స్కృతం అధికార భాషగా హిందూ, బౌద్ధమతాలు అధికార సంప్రదాయా లుగా వెలుగొందాయి. జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా దర్శించాల నుకునే పర్యాటక ప్రాంతాల్లో ఆంగ్‌కోర్‌ వాట్‌ దేవాలయం ఒకటి.మరో అద్భుతం ఆంగ్‌కోర్‌ థోమ్‌...ఆంగ్‌కోర్‌ వాట్‌ దేవాలయానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరం లో ఉన్న మరో అద్భుత ప్రదేశం ఆంగ్‌కోర్‌ థోమ్‌. ఖ్మేర్‌ సామ్రాజ్యంలోని చివరి చక్రవర్తుల్లో ఒకరైన ‘జయవర్మన్‌ - 6 ఆంగ్‌కోర్‌ థోమ్‌ను రాజధానిగా చేసుకుని రాజ్యాధికారం చేపట్టాడనడానికి చారిత్రక ఆధారాలున్నాయి. దీనినే ‘గ్రేట్‌ సిటీ’ అని కూడా అంటారు. తొమ్మిది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ దేవాలయ నిర్మాణం జరిగింది. ఇక్కడ కూడా అనేక పురాణ కళాకృతులు మనకు దర్శనమిస్తాయి. ఇక్కడ బౌద్ధమత సంస్కృతి ఎక్కువగా ఉంది. ఏను గుల మిద్దెలు, లెపర్‌ రాజు ప్రతిమలు, బెయాన్‌, బఫూన్‌ లాంటి అనేక నిర్మాణాలు ఇక్కడి ప్రత్యేకత. ఆంగ్‌కోర్‌ థోమ్‌ మధ్యలో చిన్న చిన్న మిద్దెలతో నిర్మించిన గోర్డెన్‌ టవర్‌ (బెయాన్‌) ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. 54 అంతస్తులతో నిర్మించిన బెయాన్‌ (బుద్ధుని) దేవాలయంలో ఆంగ్‌కోర్‌ థోమ్‌కి ఆకర్షణీయంగా నిలుస్తుంది.ఖ్మేర్‌ నాగరికత తర్వాత కొన్ని శతాబ్దాల అనంతరం భారతీయ సంస్కృతి కంపూ చియాకు వ్యాపించింది. సంస్కృతం అధికార భాషగా హిందూ, బౌద్ధమతాలు అధికార సంప్రదాయాలుగా వెలుగొందాయి. జీవిత కాలంలో కనీసం ఒక్కసారైనా ఇంత పెద్ద విష్ణుమూర్తి దేవాలయాన్ని దర్శించలనడం అతిశయోక్తి కాదు. ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకర్షిస్తోన్న ఆంగ్‌కోర్‌ వాట్‌ వంటి అద్భుత కళాసౌరభం ప్రపంచ వింతల్లో ఒకటిగా చేరకపోవడం బాధాకరం.





No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML