What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Tuesday, 22 July 2014

ప్రపంంచానికె విద్య నేర్పిన మనవాళ్ళు............

ప్రపంంచానికె విద్య నేర్పిన మనవాళ్ళు............
చాణక్యుడు (c. 350-283 BC) మొదటి మౌర్య చక్రవర్తి అయిన చంద్రగుప్తుని ఆస్థానంలో ప్రధానమంత్రి మరియు తక్షశిల విశ్వవిద్యాలయం లో అర్దశాస్త్ర విభాగానికి అధ్యక్షుడు. కౌటిల్యుడు మరియు విష్ణుగుప్తుడు, అనే పేర్లతో కూడా చాణక్యుడిని వ్యవహరిస్తారు.చాణక్యుడు చతుర్విధపురుషార్దాలలో రెండవదైన 'అర్ధ' పురుషార్ధము గురించి అర్దశాస్త్రాన్ని రచించాడు. చాణక్యుడు రాజనీతి శాస్త్రంతో పాటు ఆర్థిక శాస్త్రం, భౌతిక శాస్త్రం మరియు మనస్తత్వ శాస్త్రంలో కూడా నిపుణత కనబరిచాడు. ఇతడు తన సూక్ష్మబుద్దితో శత్రువులను జయించి భారతదేశంలో మొదటి చక్రవర్తిత్వాన్ని నెలకొల్పిన విధానం విశాఖదత్తుని ముద్రారాక్షసం అనే సంస్కృత నాటకం లో వివరింపబడింది. చాణక్యుడు రచించిన నీతిశాస్త్రం చాణక్య నీతి పేరుతో ప్రసిద్ది చెందింది.. చాణక్యుడు తక్షశిల విశ్వవిద్యాలయంలో భోధించేవాడు.
తక్షశిల విశ్వవిద్యాలయం పురాతన భారతదేశపు అత్యున్నత విద్యాలయాలలో ఒకటి. ఇందు లొ చదివిన వాళ్ళలొ అశొకుడు కుడా ఒకరు. ఇది భారతదేశనికే కాదు ప్రపంచం లొ గొప్ప విశ్వవిద్యాలయం అని చెప్పవఛ్చ.


No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML