దంతాల సున్నితత్వం ( సెన్సిటివ్ ) తో బాధపడుతున్నారా ? అయితే ఇలా చేసి చూడండి !
వేడి, చల్లని లేదా పుల్లని ఆహారాన్ని తీసుకున్నప్పుడు దంతాల్లో కలిగే అసౌకర్యమైన స్థితిని దంతాల సున్నితత్వం అంటారు. ఇది కొన్ని నిమిషాల నుంచి గంటల వరకు ఉండి, బలమైన నొప్పికి దారితీస్తుంది.
దంతాల సున్నితత్వానికి కారణం ..... ఆమ్లాలతో కూడిన ఆహారపదార్థాలు, పానీయాలు, చాలా గట్టిగా పళ్లుతోమడం, పగుళ్లు వచ్చిన దంతాలు, రక్తం కారుతున్న చిగుళ్లు(జింజివైటిస్), దంతాలు అరిగిపోవడం, పాచి పేరుకుపోవడం, నోటి పరిశుభ్రత తక్కువగా ఉండటం.
ఒక వేళ మీకు నొప్పితో కూడిన సున్నితమైన దంతాలు ఉంటే, తక్షణమే దంత వైద్యున్ని సంప్రదించాలి.
మీరు చేయాల్సినవి .....
- మృదువైన బ్రెసిల్స్ ఉన్న టూత్‌బ్రష్‌ను వాడాలి.
- రోజుకు రెండుసార్లు బ్రష్ చేయాలి.
- మధ్యస్థంగా లేదా గట్టిగా ఉన్న బ్రెసిల్స్ గల టూత్‌బ్రష్‌ను వాడవద్దు.
- ఆమ్లాలతో కూడిన ఆహారం తీసుకున్న తక్షణమే బ్రష్ చేయడాన్ని నివారించాలి.
- అధిక ఒత్తిడితో బ్రష్ చేయడం లేదా ఎక్కువ సమయం పాటు బ్రష్ చేయడాన్ని నివారించాలి.
- ఎక్కువగా ఫ్లాసింగ్ చేయకూడదు.
- చిగుళ్ల దగ్గర గుచ్చడం లేదా గోకడం లేదా టూత్‌పిక్‌ను వాడటాన్ని నివారించాలి.
- దంతాలకు నష్టాన్ని కలిగించే పానీయాలను నివారించాలి.
- అతి దంతావధానం చేస్తూ ఉండకండి.
-సున్నితత్వాన్ని తగ్గించే టూత్‌పేస్టును వాడాలి. ( ఉదా : SENSO PLUS )
.- నోటి శుభ్రతను పాటించాలి.
- పొటాషియం సాల్ట్, ఫ్లోరైడ్ కలిగిన మౌత్‌వాష్‌ను ఉపయోగించాలి.

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment