కః పథ్యతరో? ధర్మః; కశ్శుచి? రిహయస్యమానసంశుద్ధమ్!
కః పండితో? వివేకీ; కిం విషమ్? అవధారణా గురుషు;
కః పథ్యతరః?= మిక్కిలి పధ్యమైనది ఏది? అన్నది ప్రశ్న.
ధర్మః = ధర్మము అన్నది సమాధానము.
పథ్యము అనగా హితమును కలిగించునది. పథ్యతరః అంటే అధిక హితమును కలిగించునది. మరి హితమంటే ఏమిటి? ఈలోకంలో మానవుడు పొందే ప్రయోజనమే హితము. అయితే అధిక హితమనగా ఏమి? సత్యదృష్టిని ఆత్మజ్ఞానాన్ని దర్శింపజేయగల ప్రయోజనమే అధిక హితము. ఇట్టి పథ్యతరమైనది ధర్మమని సమాధానము.
మరి ధర్మమనగానేమి? "ధర్మతీతి ధర్మః" ఈ చరాచర జగత్తునంతటినీ, ఒక క్రమపద్ధతిలో నడిపించగల శక్తియే ధర్మము. విశ్వస్థితికి కారణభూతమైనదీ, సద్భావమును కలిగించి, సక్రమ జీవనపథాన్ని చూపించేది ’ధర్మ’మనబడుతుంది.
మానవజాతిని ఉద్ధరించుటకు కావలసిన సాధనములన్నియి, ధర్మమునందే ఇమిడియుండును. ధర్మాన్ని విశ్వసించడమే కాదు. దానిని నిత్యము ఆచరించుట ఎంతో ముఖ్యం. ధర్మాచరణముతో హితమును పొందాలి.
కః శుచిః?= ఎవడు పరిశుద్ధుడు? అన్నది ప్రశ్న
ఇహయస్యమానసంశుద్ధమ్ = ఎవడైతే శుద్ధమైన మనస్సును కలిగి ఉంటాడో, అతడే పరిశుద్ధుడు. అన్నది సమాధానం.
శరీరము, వస్త్రములు, ఎంత పరిశుభ్రముగా ఉంచుకొనిననూ, మనస్సు శుద్ధిగా లేనివాడు పరిశుద్ధుడు కాలేడు. మానవుడు తన హృదయంలోని కల్మషమంతా తొలగించుకొనిననాడే పరిశుద్ధుదౌతాడని భగవత్పాదుల వారిందులో తెలియజేశారు.
కః పండితః? = పండితుడెవడు? దీనికి సమాధానం వివేకీ - వివేకము గలవాడు.
వివేకమంటే ఏమిటి? మంచి చెడులను వేరుపరచగల శక్తియే వివేకము. సత్యమును గ్రహించగలుగు సామర్థ్యమే వివేకము. సత్యమును గ్రహించగలుగు సామర్థ్యమే వివేకము. ఇట్టి వివేకము గలిగినవాడే నిజమైన పండితుడని స్వామి సెలవిచ్చారు. ఏదో ఒక విద్యలో ఆరితేరినవాడు పండితుడనుట సామాన్య విషయం. ఆత్మజ్ఞానం కలిగి పరమాత్మను దర్శింపగలిగినవాడే పండితుడనునది విశేషాంశము.
కిం విషమ్? = ఏది విషము? దీనికి సమాధానము అవధీరణాగురుషు = గురువులయందు తిరస్కార భావము. అంటే గురువుల యెడల ప్రదర్శించు తిరస్కార గుణము, విషముతో సమానమన్నమాట.
విషమంటే ’హాలాహలం’. దీనివల్ల ప్రాణం పోతుమ్ది. ఇట్లే, గురుతిరస్కారాన్ని చేసినచో, ఆ దోషం విషమై వారికి ఎంతో కీడును కలిగిస్తుంది. పెద్దలయెడల గౌరవ భావమ్తో ప్రవర్తించాలనేది శంకరులు మనకిచ్చిన సందేశం.

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment