What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Tuesday, 22 July 2014

లోకాధ్యక్షస్సురాధ్యక్షో ధర్మాధ్యక్షః కృతాకృతః!

లోకాధ్యక్షస్సురాధ్యక్షో ధర్మాధ్యక్షః కృతాకృతః!
లోకాధ్యక్ష - ప్రపంచ వ్యవహాములు పర్యవేక్షించువాడు, మూడు లోకములను అధ్యక్షుడు పరమ పురుషుడైన విష్ణువు. వామనావతారంలో విష్ణువు ముల్లోకాలకు అధ్యక్షునిగా పురణాలలో వర్ణింపబడినాడు. లోకాధ్యక్షుడగు విష్ణువుకు నమస్కరిస్తున్నాము.
సురాధ్యక్ష - దేవతలకు అధిపతి. దైవీ సంపత్తి కలవారికి తగిన రక్షణను ఇచ్చువాడు భగవంతుడు. భక్తులందరకు బ్రహ్మానందమును కలుగజేయువాడగుటచే సురాధ్యక్షుడుగా కొలువబడుచున్నాడు. అట్టి విష్ణువుకు నమస్కరిస్తున్నాము.
ధర్మాధ్యక్ష - ధర్మాధర్మములను పరికించుచూ తగిన ఫలములను ఇచ్చువాడు. సమస్త ప్రాణికోటియొక్క ధర్మాధర్మ కర్మలను పరిశీలించువాడు పరమాత్మ. జీవులకు వారి కర్మానుసారం తగిన ఫలములను ఇచ్చుటకై ప్రత్యక్షముగా పరికించును. ధర్మాధ్యక్షుడగు విష్ణువుకు నస్కరిస్తున్నాము.
కృతాకృతాయ నమః - కార్య కారనములు రెండునూ తానేయైన వాడు. వ్యక్తావ్యక్త రూపములందు ఉండువాడు పరమాత్మ, ఆత్మ స్వరూపుడగు విష్ణువు కారణమందు, కార్యమందు వ్యక్తముగాను, అవ్యక్తముగాను ఉంటాడు. కృతాకృతుడగు విష్ణువుకు నమస్కరిస్తున్నాము.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML