What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Sunday, 20 July 2014

కృష్ణుడి ప్రియ భక్తుడు ఒకసారి కృష్ణుడి దగ్గరికి వచ్చి, కృష్ణ నాకు ఒక వరం కావాలి ఇస్తావా? అని అడిగాడు!

కృష్ణుడి ప్రియ భక్తుడు ఒకసారి కృష్ణుడి దగ్గరికి వచ్చి, కృష్ణ నాకు ఒక వరం కావాలి ఇస్తావా? అని అడిగాడు!
కృష్ణుడు దానికి ప్రత్యుత్తరంగా నీకు నాదగ్గర మొహమాటం ఎందుకు? అడగవయ్యా ఏమి కావాలో! ఏది అడిగినా ఇస్తాను అన్నాడు!
దానికి భక్తుడు : అడిగినతరువాత కాదనవుగా?
కృష్ణుడు: అడగమని చెప్పానుగా! అధికారం కావాలా?
భక్తుడు: అమ్మో అధికారం నాకు వద్దు! ఎందుకంటే అధికారం మీద వ్యామోహంతో నిన్ను మర్చిపోతాను!
కృష్ణుడు: మరి ఆస్తులు కావాలా?
భక్తుడు: అయ్యబాబోయ్ ఆస్తులా! నన్ను నేనే మర్చిపోతాను!
కృష్ణుడు: ఇంకేం కావాలయ్యా! మొహమాటం లేకుండాఅడుగు!
భక్తుడు: నీకు అష్ట భార్యలు కదా!
కృష్ణుడు : అవును! ఐతే?
భక్తుడు: అంతమంది కాకపోయినా! కనీసం ఒక్కరితోఅయిన పెళ్లి చెయ్యి!
కృష్ణుడు : నీకిదేం పోయే కాలమయ్య! బాగానే ఉన్నావుగా! నీకెందుకు ఈ సంసార లంపటం! ఇది మహాసాగరం ఈదాలంటే కష్టం! దూరంగా ఉంటే అందంగానే కనపడుతుంది! దగ్గరికి వెళ్ళావో మునిగిపోతావ్! నీ ఇష్టం మరి!
భక్తుడు: ??????????? నువ్వున్నావుగా నన్ను సాగరం దాటించడానికి! మాట నిలబెట్టుకో! నేను వెళ్తున్నా!
కృష్ణుడు: ఆగు ఆగు నేను చెప్పేదివినవయ్య ­ా! ఆగు ఆగాగు!......... ­.......... ! ఏమిటో ఎంత చెప్పిన వినరు కదా మానవులు!

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML