What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Sunday, 13 April 2014

కఠోపనిషత్తు – I : (మొదటి అధ్యాయం)

కఠోపనిషత్తు – I : (మొదటి అధ్యాయం)

స్వర్గ ఫలాలను కోరి వాజశ్రవనుడు ఒకయుగంలో తన అస్తినంతటిని దానం చేశాడు. అతనికి నచికేతుడనే పేరు గల ఒక పుత్రుడున్నాడు.

నచికేతుడు, "తండ్రీ నన్ను ఎవరికి ఇవ్వబోతున్నావు?" అని అతడు తండ్రిని రెండు మూడు సార్లు అడిగాడు. ఆ ప్రశ్నకి కోపం వచ్చిన తండ్రి 'నిన్ను మృత్యు దేవతైన యముడికి యిస్తాను' అని బదులు పల్కాడు. 

అప్పుడు నచికేతుడు తనలోతాను ఇలా అనుకున్నాడు, నన్ను యముడికి ఇవ్వటంలో అయన ఉద్దేశ్యం ఏమిటి ? అప్పుడు నచికేతుడు ఇలా ఆలోచించాడు, ప్రాచీనులు ఎలా వర్తించారో జ్ఞాపకం తెచ్చుకో. అలాగే ఇపుడు ఇతరులు కూడా ఎలా నడుచుకుంటున్నారో గమనించు. మర్త్యులు ధాన్యంలాగానే పండి రాలిపోతారు. ధాన్యంలాగానే మళ్ళీ పుట్టుకొస్తారు. 

సత్యమహిమను గుర్తించినవాడై నచికేతుని తండ్రి చివరికి తన కుమారుని యముని వద్దకు పంపుతాడు. అప్పుడు యముడు ఇంట్లో ఉండదు. అందుకు నచికేతుడు నిద్రాహారాలు లేకుండా మూడు రోజులు వేచి ఉండవలసి వస్తుంది. యముడు తిరిగి వచ్చాక నచికేతునితో యముడు ఇలా అన్నాడు, నీవు నిరాహారిగా మూడు రాత్రులు గడిపావు కావున వాటికీ పరిహారంగా మూడు వారలు కోరుకో.

అప్పుడు నచికేతుడు మూడు వరాలు కోరుకుంటాడు. అందులో రెండు వరాలను యముడు మామూలుగానే ప్రసాదిస్తాడు కానీ నచికేతుడు మూడో వరం ఇలా అడుగుతాడు. 
మానవుడు మరణించాక వచ్చే సందేహమిది. చనిపాయిన వ్యక్తీ ఉన్నాడని కొందరంటారు. మరీ కొందరు లేదంటారు. దీని గురించి తెలుసుకోవాలని నా కోరిక. అప్పుడు యముడు, నచికేత ఇది చాల సూక్ష్మమైన విషయం. అర్థం చేసుకోవడం ఎంతో కష్టం. అందువలన వేరే ఏదైనా కోరుకో, ఈ వరం మాత్రం నన్ను అర్ధించకు. ఈ మాటనుండి నన్ను వదిలిపెట్టు. 

అప్పుడు నచికేతుడు ఈ విషయం అంత సులభంగా అర్ధమయ్యేది కాదని నువ్వే చెపుతున్నావు. నాకు నీతో సమానుడైన ఆచార్యుడు కూడ ఎక్కడ లభ్యం కాడు. అందుచేత ఈ వరంతో సమానమైన వరం మరేది లేదనే నేను అనుకుంటున్నాను.

అప్పుడు యముడు, ఓ నచికేత నీవు అనుభవించడానికి కావలసినన్ని సంపదలు మరియు ఎంతో అందమైన స్త్రీలు, మరియు నీవు నీకు ఇష్టమైనంత వరకు జీవించెంత కాలమును నీకు ప్రసాదిస్తాను వాటిని కోరుకో అంటాడు. దీనితో సమానమైన వరమేదైనా నీకు తోస్తే అదే కోరుకో . ఓ నచికేత సువిశాల సామ్రాజ్యానికి నువ్వు చక్రవర్తిగా వుండు. నీకు కలిగే కోరికలన్నీ నేరేవేరెలా నేను వరమిస్తాను. కానీ మరణాన్ని గురించి మాత్రం నన్ను అడుగవద్దు.

అప్పుడు నచికేతుడు, ఓ యమరాజ నువ్వు చెప్పే ఇవన్ని కూడా క్షణికాలే మానవుడి ఇంద్రియాల శక్తిని నశింపజేసేవే. ఎంత పొడిగించినా మానవుడి జీవితం అల్పమే. అందువలన నీవు ఇవ్వదలచుకున్నవి అన్నియు నువ్వే ఉంచుకో. 

మానవుడు ఏనాటికి ధనంతో తృప్తి పడలేడు. నువ్వు విధించినంత కాలము ఎలాగు జీవిస్తాము . కానీ మరణానంతరము వుండే అమోఘమైన జీవితం గురించిన జ్ఞానం నేను కోరే వరం .

ఓం నమో పరమాత్మయే నమః 

అప్పుడు యముడు, ఓ నచికేత అజ్ఞానము జ్ఞానము అనబడే ఈ రెండు విభిన్న గమ్యాలకు తీసుకుపోయేవి. అపారమైన అంతరం కలవి. నచికేతుడు జ్ఞానాన్ని అన్వేషిస్తున్నాడని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఎన్ని విషయభోగాల ప్రలోభాలైన నిన్ను చలిమపచేయలేక పోయాయి. 

గాఢమైన అజ్ఞానంలో కూరుకుపోయి వున్న మూర్ఖులు తామే ప్రజ్ఞావంతులు గొప్ప విద్వాంసులు అనుకుంటూ గ్రుడ్డివాళ్ళ చేత నడిపించబడే గ్రుడ్డివాళ్ళలాగా తూలుతూ తడబడుతూ సుడులు తిరుగుతూ వుంటారు. 

జాగ్రత్తలేని బాలుడికి ధనమదంతో మతిపోయన వారికీ శ్రేయోమర్గము ఎన్నటికి కనిపించదు. వున్నది ఈ లోకమే మరో లోకం లేదు అనుకునేవాడు మళ్ళీ మళ్ళీ నా చేతిలో పడుతూ ఉంటాడు. 

దానిగురించి వినడం కూడా ఎంతోమందికి సాధ్యపడదు. దాని గూర్చి వినినవరుగూడ ఎందరొ దానిని గ్రహించలేరు. దాని గురించి విని దాన్ని గ్రహించగలిగిన వాడే నిజంగా అద్భుతమైన వాడు. 

శాశ్వత వస్తువు అశాశ్వత వస్తువులచేత ఎన్నటికిని పొందబడదు గనుక ఈ సంపదలన్నియు అనిత్యాలని నాకు తెలుసు. అయిన ఈ అనిత్య వస్తువులతో నేను నచికేతాగ్నిని నిర్వర్తించాను. (తద్వారా) శాశ్వత వస్తువును పొందాను.

ఓ నచికేత దీమంతుడవైన నువ్వు ద్రుడనిశ్చయంతో తిరస్కరించావు. అందువలన నేను నీకు చెప్పుచుంటిని దాని గురించి. అది (ఆత్మ)ఈ శరీరంలోనే వున్నది, హృదయంలో ఆసీనమై ఉన్నది, సనాతనము అతి సూక్ష్మము అంతర్లీనము జ్యోతిర్మయము అయిన ఆ ఆత్మను ధ్యానము ద్వార సాక్షాత్కరించుకొని ధీశాలి సుఖ దుఃఖాలకు అతీతుడవుతాడు. 

ధర్మానికి ప్రాణమైన ఆ సుక్ష్మతత్వాన్ని విని తగిన విధంగా అలోచించి చక్కగా గ్రహించిన మానవుడు దానిని పొందుతాడు. ఆనందించదగిన దానిని పొందడంచేత ఆనందపరవశుడవు.
 


No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML