What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Friday, 4 April 2014

దత్త దీక్ష నియమములు

దత్త దీక్ష నియమములు *ఒక మంచిరోజు గురుసన్నిధిలోగాని, దైవసన్నిధిలోగాని, దత్తమాలను, ఓక్ ఔదుంబర (మేడి) పుల్లతో సహా ధరించాలి. *మాలను దత్తార్పణం గావించి గురువుగారి నుండి స్వీకరించి దీక్షనియమాలను నిష్ఠతో పాటించేందుకు ప్రతిన పూనాలి. *దీక్షాకాలం 40 రోజులు గాని, 21 లేక 11 లేక 7 రోజులుగా గాని స్వీకరించాలి. *దీక్షాకాలంలో వీలైనంత వరకు మౌనాన్ని పాటిస్తూ దత్త నామాన్ని జపిస్తూ ఉండాలి. మౌనంగా ఉండటం విశేషం. *దీక్షాకాలంలో ఆకుపచ్చని వస్త్రాలను దీక్షావస్త్రాలుగా విధిగా ధరించాలి. *దీక్షాకాలంలో భూషయనము (భూమి మీద నిద్రించటం), మానసిక బ్రహ్మచర్యం, ఒకపూట సాత్వికమైన భోజనం స్వీకరించాలి. దీక్షాకాలంలో తీసుకొనే ఆహారంలో పులుపు, ఉప్పు, కారం అసలు ఉండరాదు. *ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం తప్పక చన్నీటితో తలస్నానం ఆచరించాలి. పాదరక్షలు లేకుండా నడువవలెను. *ప్రతిరోజూ 'శ్రీగురుచరిత్ర' గ్రంథాన్ని పారాయణ చేయాలి. సద్గురుచరిత్ర, గురుగీత, అవధూతగీత మొదలగు గ్రంథాలను పారాయణ చేయవచ్చు. *ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటలకు కనీసం 5 ఇండ్లలో భిక్ష స్వీకరించాలి. *దీక్ష పూర్తి అయ్యే లోపల అనఘావ్రతం, ఔదుంబర వృక్ష ప్రదిక్షణలు చేయాలి. *దీక్ష మొదటిరోజున శ్రీ గురుదత్తాత్రేయులవారికి ముడుపుకట్టి దీక్షాకాలం అంతా గురువు ఆదేశాలను భక్తిశ్రద్ధలతో పాటించాలి. ముడుపు: _______ ఒక ఎండు కొబ్బరి  చిప్పలో కొద్దిగా ఎండు  శనగలు, ఖర్జూరం పండు, పంచదార, ఆవునెయ్యి, తేనె, దక్షిణ (9 రూపాయి నాణెములు) అన్ని కలిపి ఒక క్రొత్త ఆకుపచ్చ వస్త్రంలో శ్రీ గురుదత్తునికి ముడుపుకట్టి ఇంటిలో దైవం వద్ద గాని లేక దేవాలయంలో గాని దీక్ష ముగియువరకు భద్రపరచాలి.   దీక్షవిరమణ: ________  దీక్షాకాలం ముగిసిన తరువాత దీక్ష విరమణ గుంటూరుజిల్లా లోని మాచర్ల వద్ద ఉన్న 'ఎట్టిపోతల'లో స్వయంభువై వెలసిన ఏకముఖి దత్తాత్రేయులవారి సన్నిధిలో శ్రీదత్తజయంతి పర్వదిన అనంతరం దీక్ష విరమణ జరుపవలెను. అలా కుదరని భక్తులు తమకు దగ్గరలో నున్న దత్తమందిరంలో దీక్ష విరమణ చేయాలి. *పురాణ విశేషాలు అద్భుతమైన శీర్షిక...

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML