What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Wednesday, 9 April 2014

నల్గొండ జిల్లాలో నల్గొండకు అతి సమీ పం లో ”పాను గల్లు ”గ్రామం ఉంది .అక్కడున్న ఛాయా సోమేశ్వర ఆలయం ప్రసిద్ధ మైనది .

నల్గొండ జిల్లాలో నల్గొండకు అతి
సమీ పం లో
”పాను గల్లు ”గ్రామం ఉంది .అక్కడున్న ఛాయా
సోమేశ్వర ఆలయం ప్రసిద్ధ
మైనది .ఆలయం చుట్టూ ఎనిమిది వైపులా చిన్న
మండపాలున్డటం ప్రత్యేకత .వీటి మధ్యలో
మూడు గర్భ గుడులు ఉన్న
దేవాలయం ఉండటం విశేషం .దీన్నే
”త్రికూటాలయం ”అంటారు .గర్భాలయం లో
నడుము లోతు జలం లో
శివలింగం ఉండటం ప్రత్యేకత .ఈ జలం అన్ని
కాలాల్లో అదే లోతు లో ఉండటం విచిత్రం .ఈ జల
లింగం పైన అన్ని సమయాల్లో స్తంభాకారం లో నీడ
పడటం మరో వింత .సూర్యోదయం నుంచి
సూర్యాస్తమయం వరకు నీడ ఒకే రకం గా
పడటం వింతల్లో వింత .ఇదే ”ఛాయా
సోమేశ్వరం ”ఈ రహశ్యం ఇప్పటికీ
దుర్భేద్యం గానే ఉంది .ఇంకో వింత కూడా
ఉందండోయ్ .సింహ ద్వారానికి
ఎదురుగా ,గర్భాలయం ద్వారం లో నిల బడితే ,మన
నీడ ఒకటి మూడు చాయాల్లో ,అయిదు చాయాల్లో
ఎదుటి గోడ మీద పడుతుందట .ఈ కాంతి
రహశ్యం తెలిసిన ఆ అజ్ఞాత శిల్పి చాతుర్యానికి
మప్పి దాలు .
అంతే కాదండోయ్ .ఈ ఊరి దగ్గరే ”పచ్చల
సోమేశ్వరాలయం ”ఉందట .నల్ల రాతి స్థంభ
నిర్మాణం అది .ఆ స్తంభాలపై మన ప్రతి బింబాన్ని
చూసు కో వచ్చు నట .అంటే అంత నున్నగా
చేక్కారన్న మాట .అద్దం లాగా ఉంటుందన్న
మాట .లింగం లో ”ఒక పచ్చ ”ను శిల్పి
పోదిగాడట .పచ్చల హారం నిత్యం స్వామికి ధరింప
జేయటం వల్ల పచ్చల సోమేశ్వరుడు అయాడు .
 —




No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML