What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Monday, 7 April 2014

రామాయణం అంటే... రాముని చరిత్ర అని ఎవరినడిగినా అనేస్తారు. కానీ అది నిజం కాదు. రామాయణం అంటే రాముని మార్గం అని అర్థం.

రామాయణం అంటే... రాముని చరిత్ర అని ఎవరినడిగినా అనేస్తారు.
కానీ అది నిజం కాదు. రామాయణం అంటే రాముని మార్గం అని అర్థం.

మరి రామాయణంలో రాముని కథే లేదా ఉంది..కానీ.. రామాయణం చదువుకోవాల్సింది రాముడి కథ విని ఆనందించడానికి కాదు..రాముడి మార్గం తెలుసుకుని ఆచరించడానికి..చదువుకోవాలి.
న్యాయం అంటే ఏమిటి ధర్మం అంటే ఏమిటి వాటిని ఎలా ఆచరణలో పెట్టాలి మాటకు కట్టుబడి ఎలా బతకాలి ఎలాంటి కష్టమొచ్చినా మాటతప్పకుండా ఎలా బతకాలి -వంటి అనేక అంశాలు తెలుసుకోవడానికి రామాయణం చదువుకోవాలి.
మొట్టమొదటిసారిగా గురువు విశ్వా మిత్రునితో కలిసి అడవికి వచ్చినపుడు తాటక, మారీచ, సుబాహు వంటి జమాజెట్టీ రాక్షసులను చంపి వార్తలకెక్కాడు. ఆ వెంటనే శివుని విల్లు విరిచి మరోసారి వార్తలకెక్కాడు. తండ్రి మాట ప్రకారం అడవిబాట పట్టి మళ్ళీ వార్తలకెక్కాడు. బోయగూడేలకు వెళ్ళి ఎంగిలి పండ్లను తిని అడవులలోనూ వార్తలు సృష్టించాడు. అడవినే అయోధ్యగా మార్చి రామరాజ్యానికి గిరిజన గూడాలలోనూ, అడవి పల్లెల్లోనూ పునాదులు వేసి తాను ఏ పక్ష నాయకుడో తెలియచెప్పాడు.
అయోధ్యకు తిరిగి రాజై రామరాజ్యం ఏర్పాటుచేశాక సామాన్యుడికే పట్టం కట్టాడు. వాడి మాటను గౌరవించే నిండు గర్భిణి అయిన సీతను వదులుకున్నాడు. లేకలేక పుట్టిన లవకుశుల ఆట పాటలు, అచ్చట్లు ముచ్చట్లు అన్నిటికీ దూరమయ్యాడు..
అన్నీ ఉండి కూడా ఏమిలేని వాడయ్యాడు..
అయినవాళ్ళంతా కళ్ళ ముందే ఉన్నా ఏకాకిగా మారాడు.. ఏకోనారాయణుడయ్యాడు. ఎన్ని కష్టాలొచ్చినా తానుగా అనుభవించాడే తప్ప సామాన్యుడి తల తీయించి రాజుగా తన తడాఖా చూపించలేదు.
కోతుల సాయంతో సముద్రానికి వారధికట్టడంద్వారా.. సీతను ఎత్తుకుపోయిన రావణాసురుని తమ్ముడని తెలిసి కూడా మిత్రుడిగా చేసుకుని.. రావణ, కుంభకర్ణులను వధించడం ద్వారా..ఎప్పటికపðడు వార్తలకెక్కాడు.
పనిమంతుడు,కార్యదక్షుడు, కర్తవ్యనిష్ఠ కలవాడు అడవిలో ఉన్నా, అంత:పురంలో ఉన్నా పనిచేసుకుంటూనే పోతాడని, కీర్తి ప్రతిష్ఠల గురించి ఆలోచించడని రాముడు నిరూపించాడు. మనిషి చేసే పనులను బట్టి పేరు ప్రతిష్ఠలు వాటంతట అవే వస్తాయన్న నిత్యసత్యాన్ని లోకానికి చాటాడు.
మనిషి మంచి పేరు తెచ్చుకోవాలంటే ఇంటగెలిచి రచ్చ గెలవా లంటారు పెద్దవాళ్ళు. రాముడూ అదే పనిచేశాడు. ఆయన సూర్యవం శానికి చెందిన వాడు. అదే వంశంలో పుట్టి తమ్ముని భార్యను చెరపట్టి అనాగరికంగా వ్యవహరించిన వాలిని వధించి అతని తమ్ముడు సుగ్రీవుడికి పట్టం కట్టాడు. అలాఅని వాలి కుటుంబానికి అన్యాయం చేయకుండా ఆతని కొడుకును తన దూతగా నియమించుకున్నాడు. తపðను తపðచేసిన వాడికే పరిమితం చేసి అతని సంబంధీకులను తన వారిగానే చేరదీసి తాను నిష్పక్షపాతినని నిరూపించుకున్నాడు. ఇలా ఎవ్వరినీ చిన్న చూపు చూడకుండా రాముడు ఇంట గెలిచాడు.
సూర్యుని ద్వారా పాఠాలు నేర్చుకున్న ఆంజనేయుని తన ముఖ్య అనుచరునిగా నియమించుకుని అనేక ఘనకార్యాలు సాధించాడు. తద్వారా తన పేరును, ఆంజనేయుని పేరునూ సుస్థిరం చేశాడు. ఆంజనేయుడికి దేవుడి స్థాయి కల్పించాడు. అందుకే అన్ని ఊళ్ళలో ఆంజనేయుడికి విడిగా ఆలయాలు కనబడుతున్నాయి. తాను ఎదగడం కోసం తనవారిని తొక్కేసే దుష్టరాజకీయాలకు దూరంగా ఉండి తన వారిని తనంతటి వారిని చేశాడు.
నిరంతర సంచలనాలతో సమాజాన్ని ప్రభావితం చేస్తూ మనిషిగా బతకడానికి, మంచి మనిషి అనిపించుకోవడానికి, చనిపోయినా పదికాలాలా పేరు ప్రతిష్ఠలతో వర్థిల్లడానికి ఏంచేయాలో రాముని చూసి తెలుసుకోడానికి రామాయణం చదువుకోవాలి.
మరి రావణాసురుని గురించి చదువుకోనక్కర్లేదా ఖచ్చితంగా చదువుకోవాల్సిందే... ఏ కోణం నుంచి చదువుకోవాలి రావణుడు ఎందుకు నాశనమైపోయాడు ఎలా నాశనమైపోయాడు ఏం చేసినందుకు చెడ్డపేరు మూటకట్టుకున్నాడు వ్యక్తిగత పరువు కోసం వంశాన్ని ఎలా దుంపనాశనం చేశాడు
-ఇలాంటివి తెలుసుకోడానికి రావణుని కధ చదువుకోవాలి.
రాముడికి పూర్తిగా విరుద్ధమైన వాడు రావణాసురుడు. ఆయన బహు ముఖ ప్రతిభావంతుడు. ఈ బహుముఖ ప్రతిభకు గుర్తులు ఆయన కున్న పదితలలు. ఈ పదితలలనూ వెర్రితలలు వేయడానికే వాడు కుంటే ఎలా పతనమైపోతాడో, దారిన పోయే దరిద్రాన్ని తలకెత్తుకుని ఎలా ప్రాణం మీదికి తెచ్చుకుంటాడో తెలుసుకోడానికి రామా యణం చదువుకోవాలి. రావణుడు వేద వేదాంగాలు చదువుకున్న వాడు. గొప్ప సంప్రదాయమైన కుటుంబంలో పుట్టినవాడు. అయినా సీతను స్వయంవరంలో గెలుచు కోలేక జన్మజన్మాల వైరాన్ని కెలకవేసుకుని పెళ్ళయిన స్త్రీ అని కూడా చూడకుండా చెరపట్టాడు. ఆమెను ఎలాగైనా చేపట్టాలని పట్టుదలకుపోయాడు. పంతం నెగ్గించుకోవా లనే దురుద్దేశంతో విపరీత రాజకీయాలా డాడు.. సీతను మానసికంగా నానా హింసలు పెట్టాడు. ఫలితంగా తాను ఒక్కడే కాదు బంధు, మిత్రులతో సహా నాశనమైపోయాడు. అనేక మంచి పనులు చేసిన రాముడు వంశ వర్థనుడైతే, అనేక దుర్మార్గాలు చేసిన రావణుడు కులనాశకు డయ్యాడు. మనిషి బాగుపడాలన్నా, చెడిపోవాలన్నా ప్రవర్తనే ప్రధాన కారణమన్న సందేశాన్ని రామాయ ణాన్ని రచించిన వాల్మీకి మనకు సందేశంగా అందించాడు. చదివే వారికి ఈ కోణం తెలియడానికి, రామాయణాన్ని ఇలా చదువు కోండయ్యా అని చెప్పడానికి వాల్మీకి రామా యణానికి 'పౌలస్యవథ' అనే మరోపేరు పెట్టాడు.
బాగా బతకడానికి ఉత్తమపురుషుని జీవనవిధానాన్ని, ఎలా బతకకూడదో తెలుసుకోడానికి అథమపురుషుని పతనాన్ని తెలుసుకోవాలన్నమాట. రాముడికి, రావణా సురుడికి ఇదే తేడా! అనుక్షణం ఆయుధాలతో బతికే క్షత్రియుడై పుట్టినా రాముడు ఎంతో ప్రశాంతంగా, సత్యవాక్కే ఆయుధంగా జీవించి రామచంద్రుడు అనిపిం చుకుంటే పరమ ప్రశాంతతో వెలిగిపోవాల్సిన బ్రాహ్మణ వంశంలో పుట్టిన రావణుడు పరమ బీభత్సమూర్తిగా బతికి చితికిపోయాడు. అంటే మంచి చెడులు ఎలా సాగిపోతుం టాయో, వాటి మధ్య పోరాటం ఎలా ఉంటుందో తెలుసుకోడా నికి రామాయణం చదువు కోవాలి. ఈ పోరాటాన్ని కళ్ళకు కట్టడానికి రామాయణం వాలీ సుగ్రీవుల జీవితాలను, ఇంద్రుడు అహల్య జీవితాలను చిన్నచిన్న కథలుగా అందిం చింది. కట్టుబాటులేని జీవితా నికి, మంచిగా మర్యాదగా ఉండే జీవితానికి గల తేడాను రామాయణం ఇలా ఎక్కడికక్కడ ఎంతో బలంగా నొక్కి చెప్పింది. కనుక బాగా బతకడానికి, ప్రమాదకరంగా బతక ఉండడానికి ఉండే తేడా ఏమిటో తెలుసుకోడానికి రామాయణం చదువుకోవాలి.
రామాయణం అంటే పురాణం కదా.. పురాణంలో అనేక కథలుంటాయంటారు కదా..మరి రామాయణం నిండా ఆదర్శాల గోలేనా ఆనందంగా చదువుకోవడానికి కథలే లేవా
ఎందుకు లేవూ...! కథగా చదువుకోవాలంటే సీతమ్మ చరిత్ర ఉంది. ఆదర్శ ప్రభువు శ్రీరాముడైతే ఆదర్శనారి సీతమ్మ. ఇద్దరూ ఆదర్శంగా జీవించిన వాళ్ళు కనుక వాళ్ళు ఆదర్శదంపతులయ్యారు. వారి కుటుంబం ఆదర్శ కుటుంబమైంది. దీన్ని ప్రధానంగా చాటేందుకే వాల్మీకి రామాయణానికిి సీతమ్మ చరిత్ర అనే ఇంకో పేరు కూడా పెట్టాడు.
రాముడి కోణంలో చదివితే ఇది రామా యణం, సీత కోణం నుంచి చదివితే ఇది సీతమ్మచరిత్ర, రావణుడి కోణం నుంచి చదివితే ఇది పౌలస్యవథ, ఈ మూడు పేర్లు పెట్టడం ద్వారా వాల్మీకి రామాయణాన్ని ఈ మూడు కోణాలనుంచి చదవండీ అని పాఠకుడికి చెబుతున్నా డన్నమాట.
ఈ ముగ్గురే కాదు. రామాయణంలో.. మంచి కోసం తిరుగులేని శాసనాలను చేయగల సుగ్రీవుడున్నాడు. సుఖసంతో షాలకు పుట్టిల్లులాంటి రామరాజ్యానికి ఎంత పేరు వచ్చిందో సుగ్రీవాజ్ఞకూ అంత పేరు వచ్చింది. రావణాసురుని కన్నా బలవంతుడైనా, అధికారాన్ని, బలాన్ని తమ్ముడి భార్యను చెరపట్టడానికే వినియోగించి నాశనమైపోయిన వాలి ఉన్నాడు. వీళ్ళ చరిత్ర కూడా మంచీ చెడుల పోరాటమే!
అసంభవాలను సంభవాలు చేయగల

ఆంజనేయుడున్నాడు. సముద్రాన్ని పిల్ల కాల్వలా దాటగలిగిన వాడు, సంజీవని పర్వతాన్ని పెకలించి తెచ్చిన వాడు అని ఆంజనేయుడికి పెద్ద పేరుంది.
అమ్మ ప్రేమకు కులం మతంలేదని, ఆ ప్రేమకు భగవంతుడైనా దాసుడైపోతాడని చాటి చెప్పిన చల్లని తల్లి శబరి కథ ఉంది.
సంసార సాగరాన్ని దాటించే తారకరాముని చిన్న పడవలో గంగానది దాటించి అపారమైన భక్తి ప్రపత్తులు చాటుకున్న గుహుడున్నాడు.
ఇలా మంచినీ, చెడును, మనిషినీ, రాక్షసుణ్ణీ ఎంతో లోతుగా చూసి అందరికీ అర్థమయ్యేలా ఎంతో తేలికైన భాషలో చెప్పిన వాడు వాల్మీకి. సంస్కృత భాషలో తొలిసారి గ్రంథరచనకుపక్రమించి ఆయన తొలికవి అయ్యాడు. ఆయన ద్వారా అక్షర ప్రపంచం లోకి జాలువారిన రామాయణం ఆదికావ్య మైంది. తరువాత కవులకు వాల్మీకి రామాయణం ఆదర్శ కావ్యమైతే, అందులోని కథానాయకుడు రాముడు లోకానికే ఆదర్శనాయకుడై ఈ నాటికీ పూజలందు కుంటున్నాడు.
భూమ్మీద నదీనదాలు, కొండలూ కోనలూ ఉన్నంత కాలం రామాయణం నిలిచే ఉంటుంది. ఇంటింట పారాయణ గ్రంథం గానే కాక మనను కర్తవ్య పరాయణులను చేసే గ్రంథంగా అక్షరాక్షరం చైతన్యం నింపుకున్న శ్రీమద్రామాయణం వర్థిల్లుతునే ఉంటుంది.
ఈ అద్భుతమైన రామాయణాన్ని మరోసారి మనదైన భాషలో చదువుకుందాం..మనసా స్మరించుకుందాం..ఒంట బట్టించుకుందాం..
శక్తికొద్దీ ఆచరించుకుందాం...!
యావత్‌ స్థాస్యతి గిరయస్సరితశ్చ మహీతలే
తావద్రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి
శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ:



No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML