What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Saturday, 5 April 2014

Fwd: దత్తుని రూపంలో అంతరార్థం





దత్తుని రూపంలో అంతరార్థం శ్రీ దత్తమూర్తి మూడు శిరస్సులతో, ఆరుభుజములతో, ఆయుధములతో, నాలుగు కుక్కలతో, ఆవుతో ఉన్నట్టు చిత్రించబడి ఉంటుంది. వీటికి గల అర్థాలను పరిశీలిస్తే, *మూడు శిరస్సులు:- బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, సృష్టి, స్థితి, లయములు, ఓంకారములోని అ, ఉ, మ లు త్రిమూర్త్యాత్మక పరబ్రహ్మము. *నాలుగు కుక్కలు:- నాలుగు వేదములు ఇవి. దత్తమూర్తి సకల వేదవిజ్ఞానమును అధిగమించిన జ్ఞానసాగరుడు. *ఆవు:- మనసే మాయాశక్తి. సంకల్ప, వికల్పములకు, సుఖదుఃఖములకు కారణమైన మాయను యోగబలముచే శ్రీదత్తమూర్తి కామధేనువుగా మార్చాడు. *మాల:- అక్షరమాల, సర్వమంత్రమయము, సమస్త వైఖరి, వాగ్జాలమునకు,సాహిత్యసంగీతములకు సర్వ వ్యవహారములకు మూలము. *త్రిశూలము :- ఆచారము, వ్యవహారము, ధర్మార్థ కామముల సంపుటి. *చక్రము:- అవిద్యా నాశకము, ఆత్మావలోకన, సామర్థ్యమును, వివేకమును కలుగచేయును. *డమరు:- సర్వవేదములు దీనినుంచి ప్రాదుర్భవించినవి. *కమండలము:-సమస్త బాధలను పోగొట్టును. శుభములను సమకూర్చును. ***గణపతి లంభోదరుడుగా ఎందుకు పిలవబడుతున్నారు? అన్న విషయం పురాణ విశేషాలు చదివే వరకు మాకు తెలియదు.మాకు తెలియని విశేషాలు అందిస్తున్నందుకు వెంకట మధు గారికి ధన్యవాదాలు---శ్రీమతి సుభద్ర (కాకినాడ) -


No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML