What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Monday, 7 April 2014

మన పురాణాలలో గోవుకు చాలా పవిత్రత, విశిష్టత ఉన్నది.

మన పురాణాలలో గోవుకు చాలా పవిత్రత, విశిష్టత ఉన్నది. గో ముఖములో దేవతలందరూ వసిస్తారని ప్రతీతి. గోవుదేవతా స్వరూపం. చతుర్వేదాల ప్రతిరూపం. కలియుగంలో గోదానము వలన సర్వపాపములు హరించునని తెలియుచున్నది. గోవులు పాపములుచేయవు. పాపనివృత్తిని ప్రయత్నించదు. అందుకే గో జన్మ పరమ పవిత్రమైనది. ముక్తిదాయకమైన ఉత్తమ జన్మ గోజన్మ మాత్రమే!
గావ స్వర్గస్య సోపానం గావః స్వర్గేషు పూజితాః గావః కామదహాదేవ్యో నాన్యత్కించిత్వరం స్మృతమ్‌'' గోవులే స్వర్గ సోపానాలు, సర్వమున కూడా గోవులు పూజింపబడును. గోవును మించిన ఉత్తమైన వస్తువు మరొకటి లేదని పురాణాలలో శ్లాఘింపబడినవి. ఆవు భారతదేశపు కామధేనువు. సాధుత్వము, ఔదార్యము, త్యాగము, ఉపకారము మూర్తీభవించిన గొప్పప్రాణి ఆవు'' గోమే మాతా ఈషభః పితా మేదివమ్‌ శర్మ జగతీమే ప్రతిష్ఠత'' గోవునా మాత, వృషభము నా తండ్రి. ఈ రెండును నాకు ఐహిక పారలౌకిక సౌఖ్యములను ప్రసాదించుగాక! గోవులతో కీర్తి అంతర్ని హితమై యుండుగాక!'' అని బుుగ్వేదోక్తి! భారత, భాగవత, రామాయణ హిందూ ధర్మశాస్త్ర పవిత్ర గ్రంథాలలో గో మహిమ అసమానమైనదిగా విశదీకరించబడినది.


No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML