జయజయ నృసింహ సర్వేశ
భయహర వీర ప్రహ్లాదవరద॥
మిహిర శశినయన మృగనరవేష
బహిరంతస్థల పరిపూర్ణ
అహినాయక సింహాసన రాజిత
బహుళ గుణగణ ప్రహ్లాదవరద॥
చటుల పరాక్రమ సమఘనవిరహిత
నిటలనేత్ర మౌని ప్రణుత
కుటిలదైత్యతతి కుక్షి విదారణ
పటు వజ్రనఖ ప్రహ్లాదవరద॥
శ్రీ వనితా సంశ్రిత వామాంక
భావజకోటి ప్రతిమాన
శ్రీ వేంకటగిరిశిఖరనివాస
పావనచరిత ప్రహ్లాదవరద॥
విశ్వమంతా వ్యాపించిన ఓ నరసింహా... నీకు జయమగు గాక. భయాన్ని హరించే ప్రహ్లాద వరద నరసింహస్వామి నీకు జయమగు గాక. అంటూ అన్నమయ్య ఆ స్వామికి జయజయ ధ్వానాలు పలుకుతున్నాడు.
మిహిరుడు అంటే సూర్యుడు, శశి అంటే చంద్రుడు అంటే సూర్యచంద్రులనే నేత్రాలుగా కలిగిన ఓ నర, సింహ రూపంలో బయట లోపల వ్యాపించిన సర్వేశా. అహి అంటే పాము అహిరాజు అంటే నాగేంద్రుని సింహాసనంపై రాజిల్లుతున్న ఎన్నో గుణగణాలతో శోభిస్తున్న ప్రహ్లాదవరదా... నీకు శుభమగుగాక.
ఘనమైన పరాక్రమాన్ని కలిగిన నరసింహా, ఎందరో మహా మును చేతులెత్తి మొక్కుతున్న నరసింహా, వజ్రసమాలైన నీ గోళ్ళతో రాక్షసులు ఉదరాన్ని చీల్చిన ప్రహ్లాద వరదుడైన నరసింహా... నీకు జయమగుగాక.
ఎడమ భాగంలో లక్ష్మిదేవిని కలిగి ఉన్న వాడా ( అంటే మహావిష్ణు రూపా ), కోటి మన్మధులతో సమానంగా వెలుగుగొందుతున్న శ్రీ వేంకటగిరి శిఖరం మీద నివశిస్తున్న ఓ నరసింహా.... నీకు జయమగు గాక అంటున్నాడు అన్నమయ్య

No comments:
Post a Comment