What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Monday, 7 April 2014

హిందూ ధర్మంలో ముక్కోటి దేవతలు వున్నారని అంటారు. ఇంతమంది దేవతలు ఎందుకు?

హిందూ ధర్మంలో ముక్కోటి దేవతలు వున్నారని అంటారు. ఇంతమంది దేవతలు ఎందుకు?
ముక్కోటి దేవతలలో కోటి అనే శబ్దాన్ని సంఖ్యగా భావించవచ్చు లేక సమూహమని కూడా గ్రహించవచ్చు. సమూహమంటే ఒక గ్రూప్ అని అర్థం. మూడు కోట్లు అంటే మూడు వర్గాలు. అందులో సృష్టి అనే వర్గానికి బ్రహ్మ, స్థితి అనే వర్గానికి విష్ణువు, లయము అనే వర్గానికి ఈశ్వరుడు అధిష్ఠాన దేవతలు. 

ఇది గాక మూడు కోట్లను సంఖ్యా పరంగా తీసికొంటే అసంఖ్యాకమైన దేవతాగణం మనలను ప్రతి కోణం నుండి నిరంతరం సంరక్షిస్తున్నారనీ చెప్పబడింది. ఒక రాజ్యంలో రకరకాల విభాగాలు వుంటాయి. ఒక్కొక్క విభాగంలో క్రింది స్థాయి నుండి పై స్థాయి వరకూ వివిధ ఉద్యోగస్థులుంటారు. అలానే సృష్టికర్తగా బ్రహ్మ, అతని అనుగ్రహంతో ప్రజాపతి, అశ్వనీ దేవతలు, విశ్వకర్మ, మొదలగు వారంతా సృష్టిక్రమానికి ఉపయోగపడే దేవతలు. అలాగే స్థితి అనే క్రియలో విష్ణువుతో పాటు ద్వాదశాదిత్యులు, ఇంద్రాది దేవతలు, కుబేరుల వంటి యక్షులు, లయము అనే క్రియకు పరమేశ్వరునితో పాటు ఏకాదశ రుద్రులు, రుద్రగణాలు, యమాది ప్రాణాంతక గణాలుంటారు. 

దైవము అంటే దివ్యత్వము కలిగిన వారని అర్థం. అంటే వారికి మనవలె భౌతికంగా కనిపించే రూపాలు వుండవు. వారు దివ్యమైన శక్తి సంపన్నులు. ఆ శక్తుల ద్వారా సృష్టిలోని సమస్తాన్ని రక్షించడమే వారి కర్తవ్యం. సరస్వతీ దేవి వాక్కుకి అధిష్ఠాన దేవతయై వాక్కుని, సమస్త వాఙ్మయాన్ని రక్షిస్తుంది. లక్ష్మీ దేవి సంపదకు, పార్వతీదేవి సౌభాగ్యానికి అధిదేవతలు. కాబట్టి ఇంతమంది దేవతలా అనుకునే బదులు ప్రకృతిలో ఉన్న ఒక్కొక్క విభాగానికీ ఒక్కొక్కరినీ అధిష్ఠాన దేవతలుగా భావించి ఆరాధించడం మనకు ఎంతో శుభదాయకం.


No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML