What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Wednesday, 9 April 2014

అందుబాటులో ఔషదం అల్లం

అందుబాటులో ఔషదం అల్లం
గుండెలో మంట వచ్చినప్పుడు అల్లం తీసుకుంటే వెంటనే ఉపశమనం లభిస్తుంది.
కొలెస్టరాల్‌ను తగ్గిస్తుంది. కేన్సర్‌ ట్యూమర్స్‌ పెరగనీయదు.
మైగ్రేన్‌ తలనొప్పిని వెంటనే తగ్గిస్తుంది.
అల్లం పెయిన్‌ కిల్లర్‌. అలానే మంట ఎక్కడ ఉన్నా తగ్గిస్తుంది.
కఫం, దగ్గుకు అల్లం తేనె కలిపి ఇచ్చిన వెంటనే ఉపశమనం కలుగుతుంది.
నీరసంగా ఉన్నప్పుడు అల్లం టీ త్రాగాలి. నూతనోత్సహం వస్తుంది.
అల్లం త్వరగా పాడవకుండా ఉండాలంటే ఇసుక కుండీలో గానీ, పెరటిలో గానీ పాతిపెడితే చాలా కాలం నిల్వ ఉంటుంది.
కాల్చిన అల్లాన్ని శొంఠి అంటారు. శొంఠిని పొడిగా చేసి అర స్పూన్‌ పొడి, ఆర స్పూన్‌ పంచదార కలుపుకొని పరకడుపున తీసుకోవాలి. లేదా మొదటి ముద్దలో శొంటిపొడిని తీసుకుంటే తిన్నది జీర్ణం బాగా అవుతుంది.
రక్త క్యాన్సర్‌ను నిరోధించ డంలో బాగా పని చేస్తుంది. కనుక అల్లాన్ని ఆహారంలో వాడడం ఎంతో మంచిది. అల్లం టీ త్రాగడం, రోజు ఉదయం ఓ చిన్న అల్లం ముక్క నమిలి తినడం ద్వారా అజీర్తి, గ్యాస్ట్రిక్‌ సమస్యలకు దూరంగా ఉండవచ్చు.
అందుకే పూర్వకాలం వంటిళ్ళల్లో అల్లం తప్పనిసరిగా కనిపించేది. అల్లాన్ని నిమ్మరసంలో ఊరబెట్టి అజీర్ణం అనిపించినప్పుడు తింటుంటే ఆ మందం తగ్గుతుంది. అల్లం సర్వరోగ నివారిణిగా పనిచేస్తుంది.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML