ఆరోగ్యం సూర్యుని యొక్క ఆధీనం-- !!యేవ సూర్య జ్యోతిషా బాధసే తమో, జగచ్చ విశ్వముదియర్షి భానునా, తెనాస్మద్విశ్వామనిరామనాహుతి, మపామీవామప దుస్వప్నం సువ !! (ఋగ్వేదం) అంటే, "ఓ సూర్య భగవానుడా నీవు నీ తేజస్సుతో ఏవిధంగా అంధకారాన్ని బంధిస్తున్నావో, ఏవిధంగా జగత్తుకు నీ దీప్తి వలన తేజస్సును ఇస్తున్నావో, అదేవిధంగా మా రోగాలను సర్వనాశనం చేసి, చెడుస్వప్నాలను మాకు దూరం చేయగలవు". పై మంత్రం ద్వారా, సూర్యకాంతి సర్వరోగనివారిణి అని మనకు తెలుస్తోంది. పన్నెండు రూపాలలో గోచరించే సూర్యుడు రకరకాల వ్యాధులను నయం చేస్తాడని ప్రతీతి. అందుకే ' ఆరోగ్యం భాస్కరాధిచ్ఛేత్ ' అని అన్నారు.అంటే, ఆరోగ్యం సూర్యుని యొక్క ఆధీనమని అర్థం. *సూర్య భగవానుడు ఆరోగ్యాన్ని, తేజస్సును, బలాన్ని ప్రసాదిస్తాడని సామవేదం చెబుతుండగా, *జ్ఞానం కోసం సూర్యారాధనమని కృష్ణ యుజుర్వేదం పేర్కోంటోంది. సూర్యుడు ఆదిత్యరూపంలో వాత, పిత్త రోగాలను సూర్యరూపంలో కామెర్లరోగాన్ని, సవితృరూపంలో సర్వశస్త్రబాధలను, పూష్ణ రూపంలో సుఖ ప్రసవాన్ని కలుగజేస్తాడని చెప్పబడుతోంది. |

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Tuesday, 8 April 2014
Fwd: ఆరోగ్యం సూర్యుని యొక్క ఆధీనం--
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment