What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Friday, 4 April 2014

వ్యాస మహర్షి జన్మ వృత్తాంతం

వ్యాస మహర్షి జన్మ వృత్తాంతం
పరాశర మునీంద్రుడికి, సత్యవతికి జన్మించినవాడు వ్యాసుడు. సత్యవతి అసలు పేరు కాళి. మత్స్య గంధీ అని కూడా అంటారు. బెస్త పిల్ల .
  చేది దేశపు రాజు ఒక రోజు వేటకని అడవికి  వెళ్తాడు.  అక్కడ క్రీడిస్తున్న జంతువుల జంటను చూసి రాజు ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోతాడు. కాశిందీ నదీ తీరాన జరిగిందిది. శాపవశాన చేప రూపంలో ఉన్న అద్రిక అనే దేవకన్య ఆ రేతస్సుని స్వీకరించింది.  చేప గర్భం దాల్చింది. కడుపుతో ఉన్న చేప కదల లేక మెదల్లేక బెస్తావాడి వలకు చిక్కింది.
      తీరా దాన్ని ఇంటికి తీసుకు వెళ్లి కడుపు కొస్తే ఇద్దరు పసికందులు ఉంటారు. ఒకరు మగ శిశువు అయితే, ఇంకొకరు ఆడ శిశువు. మగ శిశువుని బెస్త రాజు గారికి ఇస్తాడు. ఆడ పిల్ల శిశువుని తన దగ్గరే ఉంచుకొని, అల్లారి ముద్దుగా పెంచుతాడు. "కాళి" అని నామకరణం చేస్తాడు. కాళి పెరిగి పెద్దదయ్యింది. పెళ్లీడుకి వస్తుంది.
        పరాశర మహర్షి ఒక రోజు కాళిందీ నది దగ్గరకు వచ్చి, ఆవలి ఒడ్డుకి వెళ్లేందుకు పడవ కోసం వేచి చూస్తుంటాడు.  అదే సమయంలో కాళి తండ్రి నది ఒడ్డున చద్ది మూట విప్పుకొని, భోజనం చేస్తుంటాడు. పరాశర మహర్షిని చూసి కాళీని ఆవలి ఒడ్డున చేర్చమని పనిని కురమాయిస్తాడు. కాళి పరాశర మహర్షిని ఓడలో ఎక్కించుకొని , తీసుకొని వెళ్తుండగా, ఆ పడవ అలలకి, అటూ ఇటూ కదులుతూ ఉంటుంది, ఎగిసి పడే అలలు, కాళి వయ్యారి తనం, ఎగిరెగిరి పడే చేప పిల్లలుని చూసి పరాశర మహర్షి కామోద్రేకంతో కాళీని సమీపిస్తాడు.
    ముని పుంగవుని కోరికని పసిగట్టి కాళీ దూరంగా జరుగుతుంది. పరాశురుడు వినలేదు. పడవ చుట్టూ పొగ మంచుని సృష్టిస్తాడు. కాళీ శరీరము నుండి సుగంధ ద్రవ్యాల పరిమళాన్ని సృష్టిస్తాడు. నది మధ్యలో ఒక దీవిని కూడా సృష్టిస్తాడు. అక్కడ వారు ఇరువురూ సర్వ సుఖాలని అనుభవిస్తారు. కాళీ గర్భం ధరించింది. పరాశురుడు ఆమెను ఓదారుస్తూ, "నీవు గర్భం ధరించినా, నీ కన్యాత్వానికి ఏమీ దూషణ ఉండదు. నీకు పుట్టబోయే పిల్ల వాడు సాక్షాత్తు విష్ణు అంశతో జన్మిస్తాడు.  సద్గుణ శీలుడు, సర్వ విద్యా పారంగతుడు అయ్యి ముల్లోకాలలో కీర్తించబడతాడు.
జగద్గురువవుతాడు. ఏక రాశిగా ఉన్న వేదాలను విభాగం చేసి వాటికి సూత్రభాష్యాలు రచిస్తాడు.  మహా తపస్వీ, మహా మహిమాన్వితుడు అవుతాడు.  ఎప్పుడు నీ ఒంటికి అబ్బిన కస్తూరి పరిమళం శాశ్వతమై నువ్వు "యోజన గంధివి" అవుతావు. అని దీవించాడు.
   మహర్షి అనట్టుగానే కాళీ పండంటి మగ బిడ్డకు జన్మనిస్తుంది. అతడు చిన్న తనం నుండి భక్తితో పెరిగాడు. అతనే వ్యాసుడు. పెద్దల ఎడల వినియ విదేయతలతో మెలిగాడు. పెరిగి పెద్దవాడు అయ్యాడు. తల్లీ! నువ్వు నా గురించి విచారించకు. నేను తపస్సుకి అడవులకి వెళ్తున్నాను. మనస్సు బాధగా ఉన్నా, దుఖం కలిగినా, నేను గుర్తు వచ్చిన ఎడల నువ్వు తలుచుకోగానే క్షణాలలో నీ ఎదుటున ప్రత్యక్షం అవుతాను అని మాట ఇస్తాడు. తల్లి దగ్గర ఆశీర్వాదం తీసుకొని, తపస్సు నిమిత్తం అడవులకి వెళ్ళిపోతాడు.
    అతనే కృష్ణ ద్యైపాయనుడు అయ్యాడు. అతని తల్లే చంద్ర వంశానికి చెందిన శంతనుడను మహా రాజుని పెళ్లి చేసుకుంది. ఆ విధంగా కురుపాండవులకు  చాలా దగ్గరవాడు వ్యాసుడు. ఇరు వర్గాలకు ఆధ్యాత్మిక గురువు ఈ వ్యాసుడే. పరిపాలనా సంబంధమైన విషయాలలో కురుపాండవులు కృష్ణ ద్వైపాయునుడి సలహాలు తీసుకునేవారు.
అయితే, వ్యాసుడు హస్తినాపురంలో కన్నా అడవులలో తపస్సు చేసుకుంటూ ఉన్న కాలమే చాలా ఎక్కువ.  


No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML