మహా పుణ్యమిచ్చే కార్తీక స్నానం వశిష్టుడు జనకుడితో కార్తీక మాస స్నాన మహాత్య్మాన్ని వివరిస్తూ ఇలా చెప్పాడు ఃజన మహరాజా! కార్తీక మాసంలో చిన్న దానం చేసినా, అది గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. సకల ఐశ్వర్యాలను కలుగజేస్తుంది. అంతేకాక, మరణానంతరం శివసాన్నిధ్యాన్ని ప్రసాదిస్తుంది. అయితే కొందరు అస్థిరాలైన భోగభాగాలను విడువలేక, కార్తీక స్నానాలు చేయక, అవినీతిపరులై, భ్రష్టులై సంచరించి క్షుద్రజన్మలెత్తుతారు. దానధర్మాలు చేయలేకపోయినా, కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజున
తప్పనిసరిగా స్నాన, దాన, జపతపాదులు చేయాలి. ఆ రోజు స్నానం చేయనివారు ఛండాలాది జన్మలెత్తి, చివరకు బ్రహ్మరాక్షసిగా పుడతారు. దీని గురించి నాకు తెలిసిన ఒక ఇతిహాసాన్ని వినిపిస్తాను. సవివరంగా వినుః అంటూ ఇలా చెప్పసాగాడు.
బ్రహ్మరాక్షసులకు ముక్తి దక్షిణ భారత దేశంలోని ఒక గ్రామంలో తత్వనిష్ఠుడనే మహావిద్వాంసుడు, తపోశక్తిసంపన్నుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన తీర్థయాత్రలు చేయాలని సంకల్పించి అఖండ గోదావరికి వెళ్లాడు. ఆ తీర్థ సమీపంలో ఒక మహావృట వృక్షంపై భయంకర ముఖంతో, పొడవైన జుట్టు, బలిష్టమైన కోరలు, న్లలని బాన పొట్టతో అతి భయంకరంగా కనిపించే మూడు బ్రహ్మరాక్షసులున్నాయి. ఆ మార్గం మీదుగా వెళ్లే బాటసారులను బెదిరించి భక్షిస్తుండేవి. తీర్థయాత్రలో ఉన్న ఆ బ్రాహ్మణుడు గోదావరిలో పితృదేవతలకు పిండ ప్రదానం చేయడానికి సన్నద్ధమవుతుండగా, ఆ బ్రహ్మరాక్షసులు అతడిని చంపేందుకు యత్నిం చాయి. ఆ బ్రాహ్మణుడు భీతి చెంది, భయంతో నారాయణ స్తోత్రం పఠించాడు. నారాయణ మంత్రంతో
కూడిన ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయమైంది. ఃమహానుభావా, మీ నోటినుంచి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతిని విని మాకు జ్ఞానోదయమైంది. మమ్మల్ని రక్షించండిః అని ప్రాథేయపడ్డాయి. అప్పుడా బ్రాహ్మణుడు కొంత ధైర్యం తెచ్చుకుని వాటి కథను అడిగాడు. వాటిలో ఒక బ్రహ్మరాక్షసి ఇలా చెప్పసాగింది. ఃనాది ద్రావిడ దేశం. నేను బ్రాహ్మణుడిని. మహాపండితననే గర్వంతో ఉండేవాడిని. న్యాయాన్యాయ విచక్షణ మాని పశువు వలె ప్రవర్తించాను. దుర్వ్యసనాలకు లోనై భార్య, పుత్రులను సుఖ పెట్టక, పండితులను అవమానపరుస్తూ లోకకంటకుడిగా ఉండేవాడిని. ఒకసారి ఒక బ్రాహ్మణుడు కార్తీక మాస వ్రతాన్ని ఆచరిస్తూ, భూత తృప్తి కోసం బ్రాహ్మణ సమారాధన చేయాలనే ఉద్దేశ్యంతో పదార్థ సంపాదన నిమిత్తం నగరానికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చాడు. అయితే నేను ఆ పండితుడిని దూషించాను. అతడిని కొట్టి, అతి వద్ద ధనం, ఇతర వస్తువులు తీసుకుని ఇంటినుంచి గెంటేసాను. దీనితో ఆ బ్రాహ్మణుడు నన్ను రాక్షసుడివై నరమాంస భక్షణ చేయమని శపించాడు. నేను భీతి చెంది క్షమించమని అతడి కాళ్లపై పడ్డాను. అప్పుడతడు గోదావరీ తీరంలోని వటవృక్షంపై నివసించమని, కాలక్రమంలో ఒక బ్రాహ్మణుడి వల్ల పునర్జన్మ జ్ఞానం పొందుతాననీ, ఆ బ్రాహ్మణుడే నన్ను కాపాడుతాడని ఆయన శాపవిమోచనం చెప్పి వెళ్లిపోయాడుః అన్నాడు.
రెండవ రాక్షసుడు తన కథ చెబుతూ ఃనేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే. నీచుల సహవాసంతో తల్లిదండ్రులను బాధించాను. వారికి తిండి పెట్టకుండా మాడ్చి, అన్నమో రామచంద్రా అనేలా చేశాను. వారు ఆకలితో అలమటిస్తుంటే, నేను నా భార్యపిల్లలతో వారి ఎదుటే పంచభక్యపరమాన్నాలు తిన్నాను. ఎలాంటి దానధర్మాలు చేయకపోగా, నా బంధువులను కూడా హింసించి, వారి ధనాన్ని అపహరించి, రాక్షసుడిగా ప్రవర్తించాను. అదే నా రాక్షస జన్మకు కారణంః అన్నాడు. తరువాత మూడవ రాక్షసుడు తన కథను చెప్పాడు. ఃనేను సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను. విష్ణ్వాలయంలో అర్చకుడిగా పని చేసేవాడిని. స్నానం కూడా చేయకుండా, కట్టుబట్టలతో దేవాలయంలో తిరిగేవాడిని. భక్తుల కానులను తీసుకుని నా ఉంచుకున్న మహిళకు ఇచ్చేవాడిని. మద్యమాంసాలను సేవించి పాపాలను మూటకట్టుకున్నాను. అందుకే ఈ రూపాన్ని మూటకట్టుకున్నానుః అనాడు. అప్పుడు తపోనిష్టుడగు ఆ బ్రాహ్మణుడు ఆ రాక్షసులతో ఇలా అన్నాడు ఃమీరు భయపడకండి. పూర్వ జన్మలో చేసిన ఘోర అపచారాల వల్ల మీకీ రూపాలు కలిగాయి. నాతో రండి. మీకు విముక్తి కలిగిస్తానఃని అన్నాడు. వారిని తనతో తీసుకు వెళ్లాడు. ఆ ముగ్గురితో చేతన విముక్తి సంకల్పం చెప్పుకొని తానే స్వయంగా గోదావరిలో స్నానమాచరించి, స్నాన పుణ్యఫలాన్ని ఆ ముగ్గురు బ్రహ్మ రాక్షసులకు ధారపోసాడు. దానితో వారు రాక్షస రూపాన్ని వదలి, దివ్యమైన రూపాలను ధరించారు. శాపవిమోచనం కావడంతో ఆ ముగ్గురూ వైకుంఠానికి వెళ్లారు.ః అని వశిష్టుడు చెప్పాడు. ఃరాజా కేవలం గోదావరి నదిలో స్నానమాచరించిన ఫలితం వారికి శాపవిముక్తి కలిగించింది. ఈ కార్తీక మాసంలో నదీస్నానం ఎంతో ఫలితాన్నిస్తుంది. ఎంతటి కష్టాలెదురైనా ఆ ఈ మాసంలో స్నానమాచరించాలిః అన్నాడు.
కార్తీక మాసంలో చేసే స్నానాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. కార్తీక స్నానం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. శరీరం నవ రంధ్రాల ద్వారా... వ్యర్థాలన్నీ బయటకు వెళతాయి. నదీస్నానంతో రంధ్రాలన్నీ శుభ్రపడతాయి. కార్తీకపుణ్యస్నానంతో తేజస్సు వస్తుంది.
చల్లటి నీళ్ళు తలారా పోసుకుంటే శరీరానికి కావాల్సిన ఉత్సాహం వస్తుంది. మహాదేవుడి పూజకు ఎంతో సానుకూలమవుతుంది. పరమేశ్వరుని ఆరాధనకు తెల్లవారు జామున స్నానం చేయాల్సిందే. లేకుంటే పూజా మందిరంలో ప్రవేశించకూడదని పెద్దలు..పండితులు చెబుతారు. ప్రతి రోజూ నియమానుసారం స్నానం చేస్తే..ఆయుష్షు పెరుగుతుందనేది నమ్మకం. మన చెంతనే ఉన్న నదీమ తల్లి ఒడిలో కార్తీక స్నానం చేస్తే ఎంతో మేలు జరుగుతుంది.
______________________
కార్తీక మాస నదీ స్నానానికి ఒక విశేషముంది. ఆ విశేషాలతో పాటు, వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలను కూడా తెలుసుకోవాల్సి ఉంది. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త చాగంటి కోటేశ్వర రావు శర్మ ఈ విశేషాలను వివరిస్తున్నారు.
కార్తీక మాసంలో నదీ స్నానం చేసి తీరాలి. నదీ స్నానం అన్నప్పుడు ఒక మాట గుర్తు పెట్టుకోవాలి. కార్తీక మాసంలో నదీ స్నానం చెయ్యడమంటే పక్కన ఉన్న నదిని వదిలిపెట్టి ఒక్కడో ఉన్న మరో నదిలో స్నానానికి వెళ్ళకూడదు. ఉదాహరణకు, కార్తీక మాసంలో గంగా స్నానం చేయాలనుకుంటే, ముందు దగ్గరగా ఉన్న నదీ స్నానం చేయాలి. ఆ తర్వాతే గంగా స్నానం చేయాలి. ఎందుకంటే మనకు అన్నం పెట్టేది పక్కన ఉండే నదే! ఎప్పుడైనా ప్రవహించే నదిని గమనిస్తే- అది రకరకాల శబ్దాలు చేస్తూ, సూక్ష్మంగా తిరుగుతూ రాళ్ళకి గుద్దుకుంటూ, పైనుంచి పడుతూ, పైకి ఎక్కుతూ వెడుతుంది. ఆ సమయంలో అది చేసే ధ్వనులు చిత్రవిచిత్రంగా ఉంటాయి. అలా వెళ్లిపోయే నది నీరు చంద్రుడి శక్తిని పుచ్చుకుంటుంది.
శాస్త్రాల ప్రకారం ఈ లోకాన్ని అమ్మవారే ఉద్ధరిస్తూ ఉంటుంది. ప్రమాదాలు ఎక్కడున్నాయో ముందే హెచ్చరిస్తుంది. ఆవిడ కార్తీక మాసంలో చంద్రకిరణ రూపంలోనూ, ఉసిరి చెట్టు రూపంలోనూ ఈ ప్రపంచాన్ని ఆదుకుంటూ ఉంటుంది. అందుకే కార్తీక మాసంలో ఉసిరికాయ పచ్చడి తినడం, వనభోజనానికి వెళ్ళి ఉసిరి చెట్టు కింద కూర్చోవటం మంచిదంటారు. కార్తీక మాసంలో చంద్ర కిరణాల రూపంలో ఉన్న అమ్మవారు నీటిని అమృతధారగా మారుస్తుంది. అందువల్ల అభిముఖంగా నదిలో నిలబడి పరమేశ్వరునికి నమస్కారం చేసి మజ్జనం చేయాలి. మజ్జనం అంటే మూడుమార్లు తల ముంచి పైకి లేవాలి. అలా స్నానం చేస్తే శరీరానికంతా చంద్ర కిరణాల వల్ల అమృత స్పర్శ కలుగుతుంది. చంద్ర కిరణాల వల్ల ఓషధీశక్తి శరీరంలో ప్రవేశిస్తుంది. అంటే శరీరానికి అనారోగ్యాలు కలగకుండా కాపాడుతుందన్న మాట.
అంతేకాక, చంద్రస్పర్శ కలిగిన తరువాత మనసు సాత్వికమై, పరమేశ్వరారాధనలో సాత్వికమైన బుద్ధితో తేజోవంతమై నిలబడుతుంది. మనసంటే చంద్రుడే. మనసు మీద చంద్ర ప్రభావమే ఉంటుంది. ఈ రెండు సాధనాలను ఏకకాలంలో పొందడానికి కార్త్తీక మాసంలో నదీ స్నానం ఉపయోగపడుతుంది. ఈ నదీ స్నానం చేయటానికి కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి. నదీ స్నానం చేసేటప్పుడు ఒంటి మీద బట్టతో స్నానం చెయ్యాలి. నదీ స్నానం చేసేటప్పుడు సంకల్పం లేని స్నానం చెయ్యకూడదు. "నేను ఫలానా చోట ఉండి పూజ చేస్తున్నాను, ఆ విషయం ఈశ్వరుడికి తెలియదా? నేను ఎక్కడ ఉండి స్నానం చేస్తున్నానో తెలుసుకోలేనివాడికి నేను పూజ చేయడమేంటి? వాడు సర్వజ్ఞుడేంటి? '' అని కొందరు అనుకోవచ్చు. అందుకే సంకల్పం చెప్పేటప్పుడు ఏ పేరెత్తితే పాపనాశనం అవుతుందో పరమేశ్వరుడు దానినే పలికిస్తాడు. అందుకే -"గంగా కావేరీ యోః మధ్య దేశస్థే, గంగా గోదావరీ యోః మధ్య దేశస్థే '' అని సంకల్పం చెప్పిస్తారు. ఎందుకంటే ఆ నదుల పేరెత్తితే చాలు పాపాలు నశిస్తాయి. అంత గొప్పదైన నదికి అభిముఖంగా నిలబడి సంకల్పంతో నదీ స్నానం చేస్తే, అది తప్పకుండా రక్షిస్తుంది. అయితే స్నానం చేసి వెళ్లిపోతే సరిపోదు. బయటకు వచ్చిన తర్వాత పుణ్య కర్మాచరణ చెయ్యాలి. అంటే దానమో, ధర్మమో ఏదో ఒకటి తప్పనిసరిగా చెయ్యాలి.
అమ్మవారి రూపాలు
ఈ జగత్తును రక్షించే అమ్మవారు ప్రకృతిలో ఒకోసారి ఒకో రూపంలో కనిపిస్తూ ఉంటుంది. చైత్రమాసం వచ్చేటప్పటికి వేప పువ్వు రూపంలో, కార్తీక మాసం వచ్చేటప్పటికి ఉసిరికాయ రూపంలో, ఆషాడ మాసంలో గడ్డిపరక రూపంలో అందరినీ రక్షిస్తూ ఉంటుంది. అందుకే ఆషాఢ మాసంలో కుక్కలు లేత పచ్చిగడ్డిని కొరుక్కుతింటాయి. దీని వల్ల వాటి కడుపులో అనారోగ్యాన్ని కలిగించే పదార్థాలు బయటకు వచ్చేస్తాయి.

No comments:
Post a Comment