What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Wednesday, 9 April 2014

పోషక, ఔషధ పరిమాళాల జామ

పోషక, ఔషధ పరిమాళాల జామ

పెరటిలో పెంచుకోదగిన ఫల జాతులలో జామ చెట్టు ప్రత్యేకమైంది. కేవలం పండును మాత్రమే కాదు.. ఆ పండును ముక్కుతో పొడిచి తినే రామచిలుకల దృశ్యం కూడా జ్ఞాపకమే..కానీ జామ పండ్లను చిన్న చూపు చూసే వారు కూడా వున్నారు. పోషక విలువలో ఆపి
ల్‌తో సరితూగే జామను చెట్టు బెరడు డికాక్షన్‌ సూక్ష్మజీవులను నశింపజేస్తుంది. 2,3 ఆకులను నమిలితే దంతాలు శుభ్రపడతాయి. దృఢత్వం కూడా చేకూరుతుంది. 5,6 ఆకులను నీటిలో మరగకాచి డికాక్షన్‌ వాడి తే దగ్గు, జలుబు పోతుంది. ఆకుల నుండి లభించే తైలం యాంటి ఆక్సిడెంట్ల చర్యలను వేగవంతం చేస్తాయి. ఆకులతో తయారైన మందులు డయేరియా, డిసెంట్రీలకు మంచి ఫలితాన్నిస్తాయి.
బాగా మాగిన పండును రోజూ తీసుకుంటే రక్తపోటు నియం త్రణలో వుంటుంది. ఎసిడిటికి కూడా రోజుకో పండును వాడితే మంచిది. పచ్చి కూరగాయ ముక్కలతో పాటు జామకాయ ముక్క లను కలిపి వాడితే ఊపిరితిత్తుల వ్యవస్థ సక్రమంగా పనిచేయడా నికి దోహదం చేస్తుంది.
ఇందులోని కెరొటినాయిడ్స్‌, ఐసోఫావో నాయిడ్స్‌, పాలిఫినాల్స్‌ మెదడు కణాలు చురుకుగా పనిచేయడానికి తోడ్పడతాయి.
కాలిన గాయాలకు గుజ్జును రాస్తే తొందరగా ఉపశమనం దొరుకుతుంది. డైటింగ్‌ చేసేవారికి జామపండు బలవర్ధక ఆహారం.
లేత పసుపు, తెలుపు, లేత ఆకుపచ్చ రంగులలో గుండ్రంగా లేదా అండాకారంలో వుండే జామపండ్లు సువాసన కూడా కలిగి వుంటాయి. ఈ సువాసన వల్లే ఇంటిలో ఎక్కడ వున్నా ఇట్టే పట్టే యవచ్చు. ఏ మాత్రం అవకాశం వున్నా ఈ చెట్లను పెంచి తాజా ఫలాలను పొందవచ్చు. జామ పండును నాలుగు భాగాలు చేసి చిటికెడు ఉప్పు, కారం లేక మిరియాల పొడిని చల్లి తింటే చాలా బాగుంటుంది. జామ్‌, జెల్లీ, సలాడ్స్‌, కెండిల్స్‌ వగైరాలలో వీటిని వాడుతూ వుండటం తెలిసిందే.
పోషకాల రీత్యా, ఔషధ గుణాల రీత్యా ఇంతటి విశేషాలున్న జామ పండును ఉపేక్షించక ఆహారంగా తీసుకుంటే ఎంతో మేలుకలుగుతుంది.
శక్తి... 112 కెలరీలు.
పీచు పదార్థాం 8.9గ్రా
పిండి పదార్థం 23.6గ్రా
మాంసకృత్తులు 4.2గ్రా
కొవ్వు పదార్థం 1.6 గ్రా
పొటాషియం 688మి.గ్రా
భాస్వరం 66 మి.గ్రా
సున్నం 30 మి.గ్రా
వైటమిన్‌ ‘ఎ’(రెటినాల్‌) 1030 మైక్రోగ్రా
వైటమిన్‌ ‘సి’(ఆస్కార్బిక్‌ ఆమ్లము)377 మిగ్రా
ఫోలిక్‌ ఆమ్లము 81 మిగ్రా
– కె.భార్గవి

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML