శ్రీ రామాయణము
విభీషణుడు సీత నిచ్చెయ్యమని హితవు చెప్పుట-శ్రీ రామాయణం
రాక్షస ప్రముఖులు రావణుని ప్రతాపం పొగడడం
అక్కడ వుండిన రాక్షస ప్రముఖు లందరూ సహజంగా తెలివితక్కువ వాళ్ళు. దీనికి సాయం వాళ్ళకి శత్రువుల బలాబలాలు తెలియవు. అయినా, రావణుణ్ణి పొగడడం ప్రారంభించారు.
" రాజేంద్రా! మనసేనలన్నీ చాలా సమర్థం అయివుంది గదా! నీకీ కంగారెందుకూ? నువ్వు పాతాళంలో వున్న భోగవతీ నగరం మీద దండెత్తి వెళ్ళి నాగులను జయించి వచ్చావు. కైలాసశిఖరాన నివసిస్తూ మహేశ్వరునకు పరమమిత్రుడయి వుండిన యక్షరాజు కుబేరుణ్ణి కూడా నువ్వు నిర్జించావు. నువ్వు యక్షులను చాలామందిని క్షోభపెట్టావు. కుబేరుని పుష్పక విమానం పట్టుకువచ్చావు. దానవేంద్రుడయిన మయుడు నీకు జడిసి, నీతో స్నేహంగా వుండడమే శ్రేయస్కరం అని గుర్తించి తన కూతుర్ని నీకిచ్చి పెళ్ళిచేశాడు. నీ చెల్లె లయిన కుంభీనసికి భర్త అయిన మధుడు మహావీరుడు. దురాసదుడు. అతన్ని జయించి నువ్వు, లోపు చేసుకున్నావు. కాలకేయులు మరణం లేనివారు. మహాబలపరాక్రమవంతులు. శూరులు. బ్రహ్మ వల్ల గొప్పవరాలెన్నో పొందివుండినవారు. వాళ్ళు కూడా ఒక్క సంవత్సరం నీతో ఘోరాతిఘోరంగా యుద్ధం చేసి చివరికి నీకు లొంగిపోయారు. వాల్లవల్ల నువ్వు ఎన్నో మాయలు తెలుసుకున్నావు. శూరులూ, బలవంతులూ అయిన వరుణపుత్రులు చతురంగ బల సమేతులయ్యుండిన్నీ నీకు లొంగిపోయారు. కొద్దిపాటి యుద్ధానికే నిన్ను చూసి లోకాలన్నీ గజగజలాడిపోతాయి. భూమండలంలో మహేంద్రునితో సమానులైన క్షత్రియవీరు లెందరో వున్నారు. వారందరూ నీకు లొంగిపోయారు. వారిలో రాముడు ఎవరికీ సాటిరాడు. వాల్లనందరినీ జయించేసిన నీకు రాముడంటే యేపాటి? మహారాజా! నువ్వు నిశ్చితంగా కూచో, నీకు శ్రమే కాదు, ఆందోళన కూడా వద్దు. ఇంద్రజిత్తు ఒక్కడే వానరులను నాశనం చేసేస్తాడు. ఆ ఇంద్రజిత్తుని పంపు, వానరసైన్యం అంతా నాశనం చేసి నిమిషంలో రాముణ్ణి జయించేస్తాడు. రాజేంద్రా! క్షుద్రుడైన హనుమంతుడు చేసినదానికి ప్రాకృతుని లాగ ఎందుకు బెంగ పెట్టుకుంటావూ? నువ్వు రాముణ్ణి వంధించేస్తావు, కంగారుపడకు."
రాక్షస సేనాపతులు తమ ప్రతాపాలు చెప్పుకొనుట
అప్పుడు మహాశూరుడు, సేనాధిపతీ అయిన నల్లని ప్రహస్తుడు లేచి చేతులు కట్టుకొని "మహాప్రభూ! దేవతలూ, దానవులూ, గంధర్వులూ, పిశాచాలూ, నాగులూ యుద్ధరంగంలో నిన్నెదిరించి నిలువలేరు. ఇక వానరులా నిలిచేవారు? అయితే, మన మందరము మనల నెవరూ యెదిరించలేరని నిశ్చయించుకొని, నమ్మి అశ్రద్ధగా వున్నాము. అంచేత హనుమంతుని చేతిలో మనం మోసపోయాము. అంతేగాని, నేను బతికివుండగా నాయెదుటపడి ఆ హనుమంతుడు బతికివెళ్ళలేడు. కనుక, నాకు సెలవు దయచెయ్యి. సముద్రపర్యంతమైన యీ భూమండలంలో అరణ్యాలలోనూ పర్వతాలమీదా కూడా కోతిపురుగయినా లేకుండా చేసివస్తాను. వానరుల బారి పడకుండా లంకానగరానికిన్నీ నేను రక్షణ లేర్పాటు చేస్తాను. కనుక, నువ్వు చేసిన అపరాధం వల్ల కించిత్తూ దుఃఖం కలగదు" అని చెప్పాడు.
దీనిమీద, దుర్ముఖు డనే రాక్షస ప్రముఖుడు క్రోధ పరవశుడై, మహాప్రభూ! మన కిలాంటి అవమానం చేసిన హనుమంతుణ్ణి క్షమించడానికి వీలులేదు. హనుమంతుడు చేసిన పని తీరని అవమానం; సందేహం లేదు. నేను ఆ కోతిమూకలను ఎక్కడ దాగినా నాశనం చేసేస్తాను" అన్నాడు. అప్పుడు మహాబలుడైన వజ్రదంష్ట్రుడు మండిపడుతూ నే నిదేవెళ్ళి వానర సేననీ పరిఘతో పచ్చడిచేసి సుగ్రీవుణ్ణీ లక్ష్మణుణ్ణీ చివరికి రాముణ్ణీ కూడా నేనొక్కణ్ణే చంపేసివస్తాను. ఇందంతా విని కుంభకర్ణుని కొడుకైన నికుంభుడు మిక్కిలీ క్రుద్ధుడై "మీరందరూ మహారాజు సన్నిధానంలో సుఖంగా వుండండి. నేనొక్కణ్ణే రాముణ్ణీ, లక్ష్మణుణ్ణీ, సుగ్రీవుణ్ణీ, వానరసేన నంతనీ నాశనం చేసేసివస్తాను" అంటూ పరవళ్ళు తొక్కాడు. ఇలాగ తమ ప్రతాపాలు రావణునకు విన్నవించుకున్నారు.
విభీషణుడు సీత నిచ్చెయ్యమని హితవు చెప్పుట
అది చూసి విభీషణుడు వారి నందరినీ మెల్లిగా వారించి, కూచోబెట్టి, రావణునితో చేతులు జోడించుకొని యిలా చెప్పాడు.
"నాయనా! సామంతోనూ, దానంతోనూ, భేదంతోనూ సాధ్యం కాని పనులే దండం అవలంబించి సాధించుకోవా లని పెద్దలు చెబుతారు. ప్రమత్తులై వుండినవారిమీదా, దైవవంచితుల మీదా, శత్రువులను ఎదిరించివున్న వాల్ళమీదా మాత్రమే దండోపాయం అవలంబించాలి. అప్పుడయినా ఆ వుపాయం బాగా ఆలోచించి యథావిధిగా ప్రయోగించాలి. రాక్షసవీరులారా రాముడిప్పుడలాంటి స్థితిలో లేడే? అతను చాలా బలవంతుడై, విజిగీషువున్నూ అయివున్నాడే? రోషం విడిచి కార్యాకార్యాలూ, సాధ్యాసాధ్యాలూ బాగా తెలుసుకో గలిగిన్నీ వున్నాడే? అతనితో కయ్యం పెట్టుకోవాలని యెందుకు చూస్తారూ? ఘోరమైన సంద్రం దాటివచ్చి హనుమంతుడింతపని చేశాడు. మీ రిది ఆలోచించారా? శత్రుబలం చాలా ఎక్కువుగా వుంది. వాళ్లలో ప్రతీవాడూ చాలా అసాధ్యుడు. కనక, మీరు తొందర పడకూడదు. ఇంతేకాదు, రాముడు జనస్థానంలో తన కపకకారం చేశాడని రావణుడు అతని భార్య నెత్తుకు వచ్చాడు. ఖరుడు చాలా తొందరపడ్డాడు. మీదిమీదికి వచ్చాడు. అంచేతనే రాముడు అతణ్ణి సంహరించాడు. ఆత్మరక్షణ చేసుకోవడానికి ప్రతీవాడికీ అధికారం వుంది. పరస్త్రీలను చెరపట్టడం అపకీర్తికరం. అది ఆయువు కుంగదీస్తుంది. చాలా ఘోరమైనది. పాపాలకు పుట్టినిల్లు. ఇందువల్ల, సీతవల్ల మనకు చాలా ఆపతు సంభవిస్తుంది. కనుక, ఆమె నిచ్చివెయ్యడం చాలా అగత్యం. రాముడు మహాపరాక్రమ శాలి. ధర్మప్రవర్తకుడు. అతనితో వైరం పెట్టుకోడం మనకి మంచిది కాదు. కనుక, సీత నిచ్చేయండి.
సంహించశక్యం కాని వానరసేన ముంచుకువచ్చి లంకముట్టడిం చకముందే సీత నిచ్చేయండి. మనమే స్వయంగా సీత నిచ్చెయ్యకపోతే లంక బుగ్గి అయిపోతుంది. రాక్షసులు మసి అయిపోతారు. మహారాజా! నువ్వు నా కాత్మబంధుడవు. పెద్దవాడవు. నిన్ను వేడుకుంటున్నాను. నా మాట విను. నేను చెప్పేది మనకి చాలా శ్రేయస్కరం. కనుక, సీతనిచ్చెయ్యి. రాముడు శరత్కాలసూర్యకిరణసమాలయిన బాణాలతో నిన్ను కొట్టకముందే సీత నిచ్చెయ్యి. కోపం వద్దు. అది సుఖమూ ధర్మమూ నాశనం చేస్తుంది. ధర్మం అవలంబించు. అది కీర్తి, సంతోషమూ కలిగిస్తుంది. నువ్వనుగ్రహిస్తే మన మందరమూ బతికిపోతాం. కనుక, సీతనిచ్చెయ్యి. విభీషణుడిలా చెప్పగా అంతావిని రావణుడు వారి నందరినీ విడిచి లోపలికి వెళ్ళిపోయాడు.

No comments:
Post a Comment