What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Friday, 4 April 2014

రుద్రాక్షల పుట్టుక---


రుద్రాక్షల పుట్టుక---

*"శివపురాణం, దేవిభాగవతం, రుద్రాక్షోపనిషత్తు, రుద్రజాబాల్యుపనిషత్తు, లింగ పురాణం, రుద్రకారణ్యమహాత్యం, స్కంద పురాణం, పద్మపురాణం" ఇలా అనేక గ్రంథములలో రుద్రాక్షల గురించి చెప్పారు.
*దేవీభాగవతం రెండోస్కంద ప్రకారం త్రిపురాసురుడను రాక్షసుడు దేవతలను ఓడించి సర్వాధికారుడై విర్రవీగుతున్న సమయంలో ఏ ఆధారము లేని దేవతలు మహేశ్వరుడ్ని ప్రార్థించి రక్షించమణి వేడుకొన్నారు.
* శివుడు ముప్పై మూడు  లక్షల మానవసంవత్సరంల  కాలం పాటు తపస్సు చేసాడు అన్ని సంవత్సరాలు  పరమేశ్వరుడు కళ్ళుతెరిచే తపస్సు పూర్తి చేసి తదుపరి కళ్ళు మూసుకున్నారు.
*అప్పుడు ఆయన కన్నుల నుండి జారిపడ్డ కన్నీటి చుక్కల నుండి రుద్రాక్ష మొక్కలు మొలిచాయి.
*సూర్యుని నుండి పన్నెండు రకముల రుద్రాక్షలు, చంద్రుని నుండి పదహారు రకముల రుద్రాక్షలు, అగ్ని నుండి పది రకాల రుద్రాక్షలు ఆవిర్భవించాయట. సూర్యుని నుంచి ఆవిర్భవించిన రుద్రాక్షలు ఎర్రవిగాను, చంద్రుడి నుంచి వచ్చినవి తల్లవిగాను, అగ్ని నుండి వచ్చినవి నల్లగాగాను ఉన్నాయట.
*రుద్రాక్ష రుద్రుని అక్షి అనగా రుద్రుని కంటి నుండి అశ్రుబిందువుల వలన మొలచినవి కనుక రుద్రాక్షలనివాటికి పేరు వచ్చింది. రుద్రాక్ష వృక్షములు మొలచిన చోటును రుద్రాక్ష్యారణ్యము అందురు.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML