విష్ణు సహస్రనామాలలో పందొమ్మిదవ నామం 'యోగవిదాం నేతా':
౧. యోగము నెరిగిన వారికి నేత (నడిపించే నాయకుడు) యోగమును విచారించే వారు, తెలిసిన వారు, పొందిన వారు - యోగవిదులు. వారికి నేత - అనగా వారి యోగ క్షేమములను నిర్వహించువాడు. అనన్యాశ్చింతయంతోమాం ఎజనః పర్యుపాసతేతేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం!! అని గీతలో భగవానుని అభయ వాక్యం. ఇతర చింతలు విడిచి, సమగ్రంగా ఉపాసించే 'నిత్యాభియుక్తులు' - యోగవిదులు. 'నిత్యమూ అన్ని విధముల (పరిపూర్ణంగా) కలిసిన వారు' నిత్యాభియుక్తులు. మనో బుద్ధీంద్రియాలన్నీ పరమాత్మకు సంపూర్ణంగా అర్పించిన వారు అని అర్థం. ఇది జ్ఞాన భక్తి యోగ మార్గాలలో ఏ ఉపాయంతో నైనా కావచ్చు. కావలసినది తదేక చింతన - సమగ్రోపాసన. కరములు కంజాక్షుని సేవలో, వాక్కు శ్రీనాథుని స్తుతిలో, చూపు సురరక్షకుని దర్శనంలో, శిరస్సు శేషశాయికి మ్రొక్కడంలో, వీనులు విష్ణుకథాకర్ణనంలో, మనసు మధువైరి భావనలో, బుద్ధి పురుషోత్తమునకు అర్పనలో - ఇలా సర్వమూ విష్ణుమయం కావడమే 'యోగవిదత్వం'. అటువంటి వానికి ఈ జగమంతా నారాయణమయంగా (యోగంగా) కనపడుతుంది. 'కలడంభోది కలండు గాలి కలడాకాశంబునన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్' అంటూ, 'ఇందుగలడందులేదని సందేహము లేక' నిరంతర నారాయణానుభూతిలో నున్న వానికి రక్షకుడు, నిర్వాహకుడు ఆయనే. ఇంద్రియాలు, విషయాలే ప్రపంచమనుకునే వారి కర్మలో స్వామి జోక్యం చేసుకోడు. 'సర్వమున్నతని దివ్యకళామయమంచు' అన్న యోగంలో ఉన్న వాని విషయంలో ఎక్కడైనా సరే తానే నిర్వహిస్తాడు. నీటిలో తోసినా, నేలపై ఉంచినా, నిప్పులో పడేసినా - అక్కడ విష్ణువే ఉన్నాడన్న యోగవేత్తకు, ఆ అనుభవశాలికి నీటిలో, నేలపై, నిప్పులో విష్ణువే రక్షకుడు. ఇదే విష్ణు జ్ఞానియైన భాగవత యోగి ప్రహ్లాదుని కథలో మనకు గోచరించే 'యోగవిదాం నేత' యొక్క లక్షణం. ప్రహ్లాదాదులు నిత్యాభియుక్తులు. వారి యోగాన్ని క్షేమంగా కాపాడి కైవల్యాన్ని ఘటింపజేసే బాధ్యతా ఆయనే నిర్వహిస్తాడు. తండ్రి చేయి పట్టుకొన్న పిల్లవాడ్ని తండ్రి నడిపించినట్లు ఆయన నడిపిస్తాడు. యోగే యోగే తదన్తరం వాజే వాజే హవామహే! న ఘానో యోగ ఆభువత్ సరాయే స పురంధ్యాం!! - మొదలైన ఋగ్వేద మంత్రాలు కూడా యోగస్వరూపుడైన, యోగక్షేమ నిర్వాహకుడైన పరమాత్మను స్తుతించాయి,
౨. దేనిని ఏ శక్తితో కలపాలో తెలిసి ప్రకృతి శక్తులను పాలించే దేవతలు యోగవేత్తలు. నిజానికి ఆ దేవతలకు దేవత్వ శక్తినిచ్చిన నేత కనుక - యోగవేత్తలకు పాలకుడు. యోగావేత్తలకు మాత్రమేనా స్వామి నాయకుడు? నిజానికి అందరికీ ఆయనే ప్రభువు. యోగులు ఆ ప్రభుత్వాన్ని గుర్తిస్తారు. తదితరులు గుర్తించరు. గుర్తించకున్నా గుర్తించినా ప్రభుత్వం ఆగాడు. ఈ ప్రకృతికీ, జీవులకీ ఈశ్వరుడు ఆయనే.

No comments:
Post a Comment