ప్రతినెల కృష్ణ పక్షం ఆఖరిరోజు అమావాస్య. మహాలయ అమావాస్య ఏడాదికొకసారి వస్తుంది. ఆ రోజు పితృదేవతలకు తర్పణం చేస్తే వాళ్ళకు మోక్షం కలుగుతుందని శాస్త్ర వాక్యం. కాబట్టి అమావాస్య కూడా మంచి దినమే. దక్షిణాదిలో సౌరపంచాంగం ప్రకారం దీన్ని ఒక పవిత్ర దినంగానే పరిగణిస్తారు. కాలప్రభావం వల్ల కొన్ని అపోహలు ఏర్పడి అమావాస్యకు తీరని అన్యాయం చేస్తున్నాయనే చెప్పాలి. చీకటి అంటే భయపడే మనిషి తత్వానికి ఇదొక నిదర్శనంగా చెప్పవచ్చు. ఒకప్పుడు ఉన్నదంగా అజ్ఞానపు చీకటేనని, విజ్ఞానపుంజం ఆ చీకట్లో నుంచే బయలుదేరిందని వేదం చెబుతోంది. మరి కాస్త లోతుగా పరిశీలిస్తే, అమావాస్యకు ఉన్న ప్రాధాన్యం ఏమిటో తెలుస్తుంది.
అ+మ+వాస= అ అంటే అర్కుడు లేక సూర్యుడు. మ అంటే చంద్రుడు. అంటే, సూర్యచంద్రులు అమావాస్య రోజు చేరువై ఒకేచోట నివసించే రోజు కాబట్టి అమావాస్య అన్న పేరు సార్ధకం అయింది. కొంతమంది ఈ అపురూప సంఘటనను స్వార్థం కోసం వాడుకోవచ్చు. మంత్రతంత్రాలు ఉపయోగించి కొన్ని క్షుద్రశక్తుల్ని వశీకరణం చేసుకోవడానికి యత్నిస్తారని అంటారు. అంత మాత్రాన అమావాస్యకు దోషం ఆపాదించటం తగదు. లయం అంటే ఆలింగనం, కలిసిపోవటం, విశ్రమించటం, కరిగిపోవడం. పరమాత్మ జీవాత్మల సంయోగానికి, సంగమానికి అది సంకేతం. అమావాస్య తరువాత శుక్లపక్ష పాడ్యమినుంచి చంద్రుడు రోజురోజుకు కొత్త కళలను పుంజుకుని పౌర్ణమిరోజు షోడశ కళాపూర్ణుడవుతాడు. చైత్రమాసంలో శుక్లపాడ్యమిరోజే నూతన సంవత్సరం మొదలు కావటమూ శుభసూచకమే. ఎటుచూసినా, అమావాస్యకు అనవసరమైన ఒక భయానక ముద్ర పడటానికి ఇదివరకు చెప్పుకున్న కారణాలు తప్ప, వేరే ఎలాంటి వంక పెట్టనవసరం లేదనిపిస్తుంది.
ఆధ్యాత్మిక దృష్టికోణం నుంచి పరిశీలించినప్పుడు ఒక సత్యం అంగీరించక తప్పదు. సూర్యుడు అంటే ఆత్మ. సూర్యుడి వెలుగు ఆత్మజ్ఞానానికి చిహ్నం. చంద్రుడు మనసుకు సంకేతం. వెన్నెల రోజుల్లో మనోచాంచల్యం మరింత విజృంభిస్తుందని మనోధర్మశాస్త్రం చెబుతోంది. ఆంగ్లంలో ’ల్యూనటికి’ అన్న పదం చంద్రుడి (లూనార్) వల్లే వచ్చింది. గాడనిద్రలో ఆదమరచి మనిషి నిద్రపోతున్నాడంటే దానికి కారణం చంచమైన మనసు, స్థిరమైన ఆత్మస్థానంలో చేరుకోవటమే. ఈ కయిక సుస్థిరమైనప్పుడు ఆ వ్యక్తి స్థితప్రజ్ఞుడవుతాడు. యోగి ధ్యానావస్థలో సమాధి స్థితి చేరుకున్నప్పుడు మన్సు ఆత్మరతిలో నిరతిశయానందం పొందుతుంది. సుషుప్తిలో తాత్కాలికమైన ఈ అనుభూతి, ధ్యానావస్థలో యోగికి శాశ్వతంగా దక్కుతుంది. పితృదేవతలను మహాలయ అమావాస్యనాడు నిత్యముక్తుల్ని చేయటానికి తర్పణం వదలటం ఇందుకోసమే. సూక్ష్మ శరీరం అంటే మనసే. మనోలయమే మహాలయం.

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment