
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Saturday, 27 September 2014
నవరాత్రి పూజలు నైవేద్యాలు
నవరాత్రి పూజలు నైవేద్యాలు
మొదటి రోజు అమ్మవారు శైలపుత్రిగా అంటే శ్రీబాలా త్రిపురసుందరి దేవిగా అలంకారముగా అవతరిస్తుంది. నవరాత్రులలో మొదటి రోజు అమ్మ దుర్గాదేవికి సమర్పించుకొనే నైవేద్యం కట్టె పొంగలి మరియు రెండువ పద్ధతి నవరాత్రి దుర్గా దేవికి కట్టె పొంగలి నైవేద్యంగా పెడతారు. రెండవ రోజు అమ్మవారిని బ్రహ్మ చారిణి అనగా శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు తరువాత నైవేద్యం రూపంలో పులిహోర మరియు నిమ్మకాయ పులిహోర భక్తులు భక్తి శ్రద్ధలతో సమర్పించుకుంటారు. మూడవ రోజు అమ్మవారిని చంద్రఘంటా అనగా గాయత్రీ శ్రీదేవి రూపంముగా అలంకరిస్తారు నైవేద్యంగా కొబ్బరి అన్నం మరియు కొబ్బరి పాయసం సమర్పించుకుంటారు. ఈ ఉత్సవాలలో నాలుగువ రోజు అమ్మవారిని కూష్మాండ శ్రీ మహాలక్ష్మి దేవి రూపంముగా అలంకరిస్తారు ఆ రోజు నైవేద్యంగా మినప గారెలు లేదా మొక్కజొన్న గారెలు లేదా మసాలా మినప గారెలు మరియు పెసర గారెలు భక్తిశ్రద్ధలతో పెడతారు. ఐదవ రోజు దుర్గాదేవిని స్కంధమాత సరస్వతి దేవి అలంకరిస్తారు ఆరోజు అమ్మవారికి నైవేద్యంగా పెరుగన్నంను సమర్పించుకుంటారు. ఆరవ రోజు దుర్గా దేవిని కాత్యాయనీ శ్రీలలితాదేవి రూపముగా అలంకరిస్తారు ఆరోజు అమ్మవారికి నైవేద్యంగా కేసరిని ప్రసాదంగా పెడుతారు. ఏడవ రోజు అమ్మవారిని కాళరాత్రి శ్రీ దుర్గాదేవి రూపముగా అలంకరణ చేస్తారు కనకదుర్గ దేవికి నైవేద్యంగా శాకాన్నం లేదా కలగూర పులుసు ను ప్రసాదంగా పెడుతారు. ఎనిమిదవ రోజు అమ్మవారిని మహాగౌరి శ్రీ మహిషాసుర మర్దనీ దేవిగా అలంకరణ చేస్తారు నైవేద్యంగా రవ్వతో చక్రపొంగలి మరియు చక్కర పొంగల్ ని పెడుతారు. తొమ్మిదవ రోజు దుర్గాదేవిని సిద్ధిరాత్రి శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అలంకరిస్తారు ఆరోజు నైవేద్యంగా సేమ్య పాయసం లేదా క్యారెట్ పాయసం లేదా కొబ్బరి గసగసాల పాయసం లేదా అన్నం పరవాన్నం లేదా పెసరపప్పు పాయసం లేదా కొబ్బరి పాల పాయసంను భక్తులు ప్రసాదంగా పెడుతారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment