What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Friday, 26 September 2014

ఈ ప్రపంచం యావత్తూ దేవి స్వరూపం. అయితే మాయా శక్తి ప్రభావము చేత జీవులు అనేక ప్రారబ్ధ కర్మల ప్రభావం చేత దుష్ఫలితాలను అనుభవిస్తు ఉంటారు

ఈ ప్రపంచం యావత్తూ దేవి స్వరూపం. అయితే మాయా శక్తి ప్రభావము చేత జీవులు అనేక ప్రారబ్ధ కర్మల ప్రభావం చేత దుష్ఫలితాలను అనుభవిస్తు ఉంటారు. అట్టివారికి ఉపసమనం కలిగించటం కోసం ఆ దేవి స్వయముగా కొన్ని పూజలూ , వ్రతాలు ఉపదేశించింది. వాటిల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగినది "దేవి నవరాత్రి ఉత్సవాలు" . ఇవి ప్రతి సంవత్సరం రెండు సార్లు వస్తు ఉంటాయి.
మొదటది "వసంత నవరాత్రోత్సవాలు ". ఇవి చైత్ర మాసం ప్రారంభ దినమైన చైత్ర శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు జరుపుకుంటారు .
వసంత ఋతువుతో ప్రారంభమయ్యే వీటిని " వసంత నవరాత్రోత్సవాలు" అని అంటారు.
రెండవది శరదృతువు ప్రారంభమయ్యే ఆశ్వయుజ మాసం మొదటి రోజైన ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకూ తొమ్మిది రోజులు జరుపుకుంటారు. వీటిని " శరన్నవరాత్రి ఉత్సవాలు " అని అంటారు. ఈ తొమ్మిది రోజుల్లోనే దేవి మహిషాసురాది అసుర సమ్హారం చేసి ఈ లోకానికి శాంతిని ప్రసాదించింది. కనుక దీన్ని "దేవి నవరాత్రులు " అని కుడా అంటారు. అనంతరం వచ్చే దశమిని దేవి "అసురసక్తుల పై సాధించిన విజయలకి చిహ్నంగా ' విజయదశమి ' " అని పిలుస్తారు .
దేవి నవరాత్రులను నియమ నిష్టలతో జరిపేవారు ఆ దేవి విశేష కృపని పొంది , సత్ఫలితాలను పొందుతారు. కనుక ఈ ఉత్సవాలను చేసెవారు కొన్ని నియమాలను పాటించాలి.
ఈ తొమ్మిది రోజులు పూజలకీ ,నైవేద్యాలకు కావల్సిన సంబరాలు, పూజా సామాగ్రులన్ని ఒక రోజు ముందే సిద్ధం చేసుకోవాలి .
ముందుగా ఎత్తుపల్లాలు లేని సమతల ప్రదేశములో పూజా మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి . మండపాన్నిగోమయం తో అలికి , మండపం మధ్యలో నలుచదరపు వేదిక ఏర్పాటు చేయ్యాలి . ఆ వేదిక పైన పీఠం స్థాపించాలి . వేదిక చుట్టు తోరణాలతో అలంకరించాలి . బ్రాహ్మణులనూ, బంధుమిత్రులను ఆహ్వానించాలి .
ఇక పాడ్యమి నాడు వేకువఝామునే లేచి స్నాన సంధ్యాదులు ముగించుకోవాలి. ఈ తొమ్మిది రోజులూ తొమ్మిది మందితో కాని , లేదా అయిదుగురి తో కాని లేద ఒక్కరితోనైనా దేవి జపం జరిపించాలి. దేవి మంత్ర నామ పారాయణ చేయించాలి .
ఇక వేదిక మీద సిమ్హాసనం పెట్టి , దానిపై తెల్లటి కొత్త వస్త్రం పరచి , దానిపై అమ్మవారి ప్రతిమను ప్రతిష్టించాలి . అనంతరం కలశస్థాపన చెయ్యాలి . అనంతరం ధ్యాన ఆవహనాది షోడశపూజా విధానాలతో , వివిధ పుష్పాలతో , పరిమళ ద్రవ్యాలతో అమ్మవారిని అర్చించాలి . అనంతరం నారికేళ ,కదళిఫలాదులతో , భక్ష్య భోజ్యాలతో నివేదన చెయ్యాలి .
ఇలాగ తొమ్మిది రోజులూ నియమ నిష్టలతో అమ్మవారిని పూజించాలి. ఈ తొమ్మిది రోజులూ "ఏక భుక్తం " అంటే ఒంటి పూట భోజనం , అది దేవికి నివేదించిన ప్రసాదం మాత్రమే భుజించాలి . కఠిన బ్రహ్మ చర్యాన్ని పాటించాలి. కటిక నేల మీద మాత్రమే శయనించాలి . ప్రతినిత్యం చన్నిటి స్నానం చెయ్యాలి. ప్రతి రోజు "దేవి భాగవత" పురాణ పారయణం ఆచరించాలి. పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూజానంతరం భోజనం చెయ్యాలి .
ఇక పదవనాడు అమ్మవారిని యధా ప్రకారం పూజించాలి. నవకాయ పిండివంతలతో నైవెద్యం పెట్టి , శక్తి మేర అన్ని సంతర్పణ చెయ్యాలి.
ఇలాగ క్రమ పద్ధతిలో అమ్మవారిని తొమ్మిది రోజుల పాటు పూజించిన వారికి ఆ దేవి విశేష అనుగ్రహాన్ని పొందుతారు.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML