ఒకప్పుడు దక్షుడు బృహస్పతియాగం చేసినప్పుడు అందరినీ ఆహ్వానించాడు గాని కూతురినీ, అల్లుడినీ పిలవలేదు, ఎందుకంటే దక్షుని కుమార్తె సతీదేవి (దాక్షాయణి) తండ్రి మాటకు విరుద్ధంగా శివుడిని పెళ్ళాడింది. పుట్టింటివారు ప్రత్యేకంగా పిలవాలేమిటి? అని సతీదేవి, శివుడు వారించినా వినకుండా, ప్రమధగణాలను వెంటబెట్టుకొని యాగానికివెళ్ళింది గాని, అక్కడ అవమానానికి గురయ్యింది. ముఖ్యంగా శివనింద సహించలేక ఆమె యోగాగ్నిలో భస్మమైంది. ఆగ్రహించిన శివుడు తన గణాలతో యాగశాలను ధ్వంసం చేశాడు.
కాని సతీ వియోగదుఃఖం తీరని శివుడు ఆమె మృతశరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి తన జగద్రక్షణాకార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్ధనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్రసాధకులకు ఆరాధనా స్థలాలు అయినాయి. ప్రతి శక్తి పీఠంలోను దాక్షాయణీ మాత భైరవుని(శివుని)తోడుగా దర్శనమిస్తుంది.
18 అనీ, 51 అనీ, 52 అనీ, 108 అనీ వేర్వేరు లెక్కలున్నాయి. అయితే 18 ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలు అంటారు.
హిమాలయాల ప్రాంతంలో వెలసిన విశేషమైన శక్తి కల్గిన అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా పిలవబడుతున్నదే జ్వాలాముఖీ క్షేత్రం. ఇక్కడ అమ్మవారు జ్వాల రూపంలో ఉండంటం ప్రత్యేకత.. ఇక్కడ అమ్మవారి తొమ్మిది అవతారాలు కూడా తొమ్మిది జ్వాలలుగా నిరంతరం వెలుగుతూ భక్తులను సంభ్రమాశ్చర్యాలను ముంచెత్తుతాయి..
గర్భగుడిలో ప్రవేశించగానే అయ్యవార్లు వెలుతురు కనపడకుండా అన్ని తలుపులు మూసి అమ్మవారి జ్వాలా రూప దర్శన భాగ్యాన్నిమనకు కల్పిస్తారు... ...
అమ్మవారు నిరంతరం వెలుగుతూ ఉండడం.. మరియు ఇలాంటి ఆలయం ప్రపంచంలో మరే ఇతర ప్రదేశంలోనూ కనపడదు..
కురుక్షేత్ర యుద్ధానంతరం ఈ ఆలయాన్ని పాండవులు దర్శించుకున్నారని మహాభారతంలో పేర్కొనబడింది..
ఇక్కడి జ్వాలలో మహత్యమేమిటంటే జ్వాలవేడికి చుట్టూ ఉన్న నూనె ఉడుకుతున్నట్లుగా మనకు క్లియర్ గా కనపడుతూఉంటుంది.. ఆ నూనెను మన మీద చల్లినప్పుడు మంచుకన్నా చల్లగా అనిపిస్తుంది....
కొంతమంది అక్కడ జ్వలించేది సహజవాయువనీ.. ఆ ఆలయం సహజవాయు నిక్షేపం మీద ఉందని చెప్తూ ఉంటారు.. కానీ అన్నివేల ఏళ్ళ క్రితం దీనిని కనుక్కోవడం.. మరియు అక్కడ ఆలయం నిర్మించడం అద్భుతమే కదా!


No comments:
Post a Comment