
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Tuesday, 16 September 2014
అమావాస్య నాడు ముగ్గులు వేయకండి
అమావాస్య నాడు ముగ్గులు వేయకండి
అమావాస్య తిథి రోజున ఇంటి ముందు ముగ్గులు వేయకూడదని పండితులు అంటున్నారు. అమావాస్యకు ముందురోజున పితృదేవతలు మన గృహానికి వస్తారని, ఆ సమయంలో పితృదేవతలకు అర్ఘ్యమివ్వడం వంటి కార్యాలను చేయడం ద్వారా వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు.
అదేవిధంగా.. అమావాస్య రోజున ఇంటి ముందు చెత్తను శుభ్రం చేసి, నీటితో కల్లాపు చల్లడం వరకే చేయాలి. ఆ తర్వాత ఇంటి ముందు ముగ్గులతో అలంకరిస్తే పితృదేవతలు వాకిలితోనే ఆగిపోతారని పండితులు అంటున్నారు.
అందుచేత అమావాస్య నాడు ఇంటికొస్తారని విశ్వసించే పితృదేవతలను మనసారా ప్రార్థించి, దేవతామూర్తులకు ఇచ్చే నైవేద్యాలు, కర్పూర హారతులివ్వాలని పురోహితులు సూచిస్తున్నారు.
పితృదేవతలకు ప్రీతికరమైన రోజైన అమావాస్య నాడు దేవతలు స్మరించినా ఫలితం ఉండదని పండితులు చెబుతున్నారు. ఆ రోజున దేవతలకు సమానంగా పితృదేవతలను కొలిచే వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment