What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Friday, 26 September 2014

పానవట్టం మీద కూర్చోబెట్టిన శివలింగంగాకారంగా అయ్యప్ప శివరూపంగా కనిపిస్తూ ఉంటే, ఎడమ చేతి ఒయ్యారమూ ఒంపూ శ్రీ హరి మోహిని అవతారపు సౌందర్యాన్ని చూపిస్తుంది.

పానవట్టం మీద కూర్చోబెట్టిన శివలింగంగాకారంగా అయ్యప్ప శివరూపంగా కనిపిస్తూ ఉంటే, ఎడమ చేతి ఒయ్యారమూ ఒంపూ శ్రీ హరి మోహిని అవతారపు సౌందర్యాన్ని చూపిస్తుంది. శంకరునికి ఇష్టమైన భస్మం ఒంటినిండుగా కనిపిస్తూ హర రూపం ఉంటే, ముఖాన ఉండే తిరునామం హరి రూపాన్ని చూపిస్తూ ఉంటుంది. దేవునికి అనుగుణంగానే భక్తులు కూడా ఇలాగే ఉంటారు. మెడలో ఉండే రుద్రాక్షమాల శంకరునిది అయితే, అదే మెడలోని తులసిమాల శ్రీ హరికి ప్రీతిపాత్రమైనది. శంకరునికి ఇష్టమైన కార్తీక మాసంలో దీక్ష ప్రారంభం అయితే శ్రీ హరికి ఇష్టమైన మార్గశిర మాసాంతంలో దీక్ష ముగుస్తుంది. శంకరునికి ఇష్టమైన ఉత్తరాయణ పుణ్యకాలం మాల విసర్జనకాలమవుతోంది. శంకరునికిష్టమైన క్షీరాభిషేకం దీనిలో ఉంటే విష్ణువుకు ఇష్టమైన గణపతి హోమం ఇందులో దర్శనం ఇస్తుంది. తల మీద ధరించే ' మున్ ముడి" లో శంకరునికి సంబంధించిన ముడు నేత్రాలు ఉన్న కొబ్బారికాయ, నెయ్యి ఉంటే, "పిన్ ముడి" లో జీవించడానికి (స్తిథి కారకుడు విష్ణువు కద )...కావల్సిన ఆహరవస్తువులు ఉంటాయి. శంకరుని నిరాడంబర విధానమైన నేల పడక, తెల్లవారుఝామున స్నానం, చెప్పులు లేని కాలి నడక, భస్మధారణం వంటివన్ని కనిపిస్తూ ఉంటాయి. మెడలో ఉండే పుష్ప మాల శ్రీ హరి మెడలోని వనమాలని తలపిస్తుంది. ఇలాగ మనము బోళ్ళు విషియాలను పోల్చుకోవచ్చు.
ఇంకో విశేషం ఎమిటి అంటే, - స్వామి కుడిచేతిలోని మూడువ్రేళ్ళు సత్త్వరజస్తమోగుణాలకి సంకేతం. లోకాన్ని పాలించేవి ఈ మూడేనని -వీటిలో పెద్దదైనవేలు సత్వం, చూపుడు వేలుకి సంకేతమైన జీవాత్మని, బొటనివేలుకి సంకేతమైన పరమాత్మతో చేర్చి ఒకటిగా చేయవచ్చునని స్వామి చెప్పే సందేశం. ఇలాంటి స్వామి .....అయ్యప్ప కంఠం లో, శ్రీ హరి తన కౌస్తుభమణికి సంకేతంగా ఒక మణిని హారంలో ఉంచి, మణికంఠుడు అనే పేరుపెడితే, మృత్యుంజయుడైన సంకరుడు ఈ మణికంటుడికి దీర్ఘాయుష్యాన్ని ధారపోసాడు. తమ పుత్రుడికి వారిద్దరూ ఒసగిన మాల అది. ఇటు ఐశ్వర్యము( కంఠ మణిహారం )...అటు ఆయుష్యమూ ఉంటే ఇంకేం కావాలి మనకి.....స్వామియే శరణం అయ్యప్ప .... స్వామియే శరణం అయ్యప్ప !



No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML