What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Friday, 26 September 2014

విష్ణు సహస్రనామాలలో 22వ నామం శ్రీమాన్:

విష్ణు సహస్రనామాలలో 22వ నామం శ్రీమాన్:
౧. శ్రీమంతుడు, శ్రీ కలవాడు.
శ్రీ శబ్దానికి శోభ, కాంతి, లక్ష్మి, వైభవం, ఐశ్వరం అని అర్థం.
స్వామి నిత్యమూ పై లక్షణాలతో దీపిస్తూంటాడు. ఏ ’వపువు’ (రూపం) ధరించినా ఆ శ్రీ ప్రకాశిస్తూనే ఉంటుంది. లోకంలో ఇతరుల వద్ద వారి సుకృత ఫలంగా సంపద లభించినా అది శాశ్వతం కాదు. ఒక్క నారాయణుని వద్దనే వైభవాలు శాశ్వతం. కారణం – ఆ వైభవాలన్నీ ఆయన విభూతులే. ఆయన ప్రసాదం చేతనే లోకాలకు ప్రకాశమూ, సంపదలూ, పోషణ లభిస్తున్నాయి. తరగని ఐశ్వర్య నిధి ఆయన. ఎంత నరసింహ రూపమైనా సౌందర్య లావణ్యాది ’శ్రీ’లకు లోటులేని మనోహర రూపమే.
౨. అందుకే ఆయననే అందరూ ఆశ్రయిస్తారు. ఆశ్రయవాచకం ’శ్రీ’. ఆయనను ఆశ్రయించుకొని ఐశ్వర్యాలన్నీ ఉన్నాయి. అందుకే శ్రీమంతుడు, అంతే కాదు జగమంతా ఆయననే ఆశ్రయించుకొని ఉంది.
౩. ఏ రూపం ధరించినా ఆయనకు ’అనపగామిని’ ’అనపాయినీ’ (వీడకుండా అనుసరించే శక్తి) అయిన లక్ష్మి వెంటనే ఉంటుంది. ఆయన వక్షంపై కొలువుతీరి ఉన్నది ఆ తల్లి. ’లక్ష్మీనృసింహ’ అని కీర్తించుతాం కదా!
ఈ దివ్యనామం ఈ స్తుతిలో నాలుగు పర్యాయాలు ఆవృతమయ్యింది. స్వామి విభూతులు (వైభవాలు) ’శ్రీ’ శబ్దం ద్వారా వ్యక్తమవుతాయి. సూర్యుడు కిరణాలను ప్రసరించినట్లుగా, ఈ విభూతులను ప్రపంచానికి పంచేవాడు.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML