What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Tuesday, 16 September 2014

సుదర్శన స్తుతి:

సుదర్శన స్తుతి:

శంఖం చక్రం చ చాపం పరశుమసిమిషుం శూలపాశాంకుశాగ్నీన్
బిభ్రాణం వజ్రఖేటౌహలముసలగదా కున్తమత్యుగ్ర దంష్ట్రం
జ్వాలాకేశం త్రినేత్రం జ్వలదనలనిభం హారకేయూరభూషం
ధ్యాయేత్ షట్కోణ సంస్థం సకలరిపుజనప్రాణ సంహార చక్రమ్!!

భగవంతుని ఆయుధాలు కేవలం ఉపకరణాలు మాత్రమే కావు. అవీ దేవతా స్వరూపాలే. అదేవిధంగా నారాయణుని ఆయుధమైన సుదర్శన చక్రానికి అధిష్ఠానమైన సుదర్శన దేవతా స్వరూపం ఈ శ్లోకంలో ఆవిష్కృతమయ్యింది.
"షట్కోణంలోనున్న చక్రదేవుడు - శంఖం, చక్రం, ధనుర్బాణాలు, గొడ్డలి, కత్తి, శూలం, పాశం, అంకుశం, అగ్ని, వజ్రం, ఖేటం, నాగలి, ముసలం, గద, కున్తం....అనే ఆయుధాలు ధరించి ఉన్నాడు. అత్యుగ్రమైన దంష్ట్రలతో, జ్వాలామయమైన కేశాలతో, మూడు కన్నులతో, అగ్ని సదృశతేజంతో, హారకేయూరాద్యలంకారాలతో ప్రకాశిస్తున్నాడు, సకల శత్రు సంహారకమైన ఈ సుదర్శన దేవుని ధ్యానించాలి."
ఈ దేవతా మూర్తుల ఉపాసన, మంత్ర, యంత్రాదులు కూడా శాస్త్రాలలో చెప్పబడ్డాయి, ధ్యానించి, స్తోత్రాదులతో నమస్కరించినా ఈ దేవతలు రక్షించి అనుగ్రహిస్తారు.




No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML