What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Tuesday, 16 September 2014

పూర్వం గౌడ దేశాన్ని నరసింహుడు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. అతని సేనాపతి పేరు - సరస భేరుడు.

పూర్వం గౌడ దేశాన్ని నరసింహుడు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. అతని సేనాపతి పేరు - సరస భేరుడు. కొంతకాలం తరువాత రాజును ఎలాగైనా చంపి, తానూ రాజును కావాలని ఆ సేనాపతికి దుర్బుద్ధి కలిగింది. కానీ ఆ కోరిక సఫలం కాకముందే విషూచికా వ్యాధితో మరణించాడు. మరణానంతరం సింధు దేశంలో గుర్రమై పుట్టాడు.
ఒక గుర్రాల వ్యాపారి ఆ గుర్రాన్ని మళ్ళీ ఆ గౌడ దేశపు రాజుకే అమ్మివేశాడు. రాజు ఒకనాడు ఆ గుర్రాన్ని ఎక్కి అరణ్యానికి వేటకు వెళ్ళాడు. దాహం తీర్చుకోవడానికి గుర్రాన్ని చెట్టుకు కట్టి, ప్రక్కనే ఒక పెద్దరాయి మీద కూర్చున్నాడు. అంతలో తాటి ఆకు ముక్క ఒకటి గాలికి ఎగిరివచ్చి, ఆ రాతి మీద పడింది. దానిమీద ఏదో వ్రాసి ఉన్నదని చూసి, చదవగా అది భగవద్గీత పదిహేనవ అధ్యాయంలోని శ్లోకార్థం.
దాన్ని రాజు పెద్దగా ఉచ్ఛరించగా విన్న గుర్రం ఆశ్వరూపాన్ని విడిచి, దివ్యరూపంతో స్వర్గానికి వెళ్ళిపోయింది. రాజు విస్మయంతో ముందుకు సాగగా ఒక ఋషి ఆశ్రమం కనిపించింది. రాజు వెంటనే ఆశ్రమంలోకి వెళ్లి, "మునీశ్వరా! ప్రణామాలు. హఠాత్తుగా నా ఆశ్వానికి విముక్తి కలగడానికి కారణం ఏమిటో సెలవీయ"మని అడిగాడు. "రాజా! నేను నిరంతరం భగవద్గీత పదిహేనవ అధ్యాయాన్ని పారాయణ చేస్తూ ఉంటాను. ఆవిధంగా పారాయణ చేసూ ఉండగా ఒక శ్లోకం, శ్లోకార్థం ఉన్న ఒక తాటియాకు ఆ గ్రంథం నుండి ఎగిరివచ్చి నీవద్ద పడింది. నువ్వు దానిని పఠించావు. ఆ అశ్వం ఆ శ్లోకాన్ని విన్నది. తద్వారా ముక్తిని పొందింది." అని చెప్పారు.
అథ పంచదశాధ్యాయ శ్లోకార్థం లిఖితం క్వచిత్!
తతోవాచయత శ్శ్రుత్వా నిరగాత్తురగో దివం!!
అటు పిమ్మట రాజు ఋషిపుంగవుని వద్ద భగవద్గీత పంచ దశాధ్యాయాన్ని భక్తితో నేర్చుకొని, సదా పఠనం చేస్తూ విశుద్ధ చిత్తుడై ముక్తిని పొందాడు. కాబట్టి, శ్రీమద్భగవద్గీత పదిహేనవ అధ్యాయ (పురుషోత్తమ ప్రాప్తి యోగం) పారాయణ ఫలితంగా ఎలాంటి జీవులైనా పాప విముక్తులై మోక్షాన్ని పొందగలవన్న మాట!

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML