What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Friday, 26 September 2014

శరన్నవరాత్రి తొమ్మిదిరోజులు కూడా కుమారీపూజ చేస్తారు. అదేవిధంగా సువాసిన్యర్చన ప్రీతా అన్నట్లుగా సువాసినీ రూపంలో ఉన్నది.

శరన్నవరాత్రి తొమ్మిదిరోజులు కూడా కుమారీపూజ చేస్తారు. అదేవిధంగా సువాసిన్యర్చన ప్రీతా అన్నట్లుగా సువాసినీ రూపంలో ఉన్నది. అటువంటి అమ్మవారిని ఎన్నిరకాలుగా ఆరాధిస్తున్నాము అంటే కలశంలోనూ విగ్రహంలోనూ పుస్తకాలలోనూ అదేవిధంగా ప్రత్యక్షంగా సువాసిని, బాల ఇత్యాది రూపాలలో ఆరాధన చేస్తాం. అందుకు నిత్యం తొమ్మిదిరోజులూ కూడా కుమారీపూజ ఉన్నది. దీనినే బాలా పూజ అని కూడా అంటారు. కుమారి అని అంటేనే కన్య అనే అర్థంలో మనం వాడుతూ ఉంటాం. సందేహం లేదు కానీ మరొక అర్థమున్నది. “కుత్సితాన్ మారయతీతి కుమారీ” అని – కుత్సితులని నశింపజేయునది. కుత్సితులు అంటే లోకకంటకులైన అసురులు. వారిని సంహరించే శక్తి కనుక కుమారీ, కౌమారీ ఇది ఒక అర్థం. అదేవిధంగా మన హృదయంలో పుట్టే కుత్సితమైన అసుర బుద్ధులు మన ప్రగతికి అవరోధాలు. వాటిని తొలగించేది కుమారీ. శ్రీవిద్యా సంప్రదాయంలో బాలాత్రిపురసుందరీ అని ఒక ఆరాధన కనపడుతున్నది. కానీ కుమారీపూజ అన్నది ఏ సంప్రదాయంలోనైనా ఉన్నది. ఈ కుమారీ పూజని శ్రీవిద్యా సంప్రదాయంలో బాల అంటారు. రోజూ కుమారీ పూజ చేయమని చెప్పారు. అయితే కుమారీ పూజకు ఏ వయస్సులో ఉన్న స్త్రీమూర్తి సరిపోతున్నది అంటే ఏకవర్షా న కర్తవ్యా కన్యా పూజావిధౌ నృప! పరమజ్ఞాతు భోగానాం గంధాదీనాం చ బాలికా!! ఒక సంవత్సరం అమ్మాయిని మాత్రం పూజలో ఉంచరాదు. రెండవ ఏటనుంచి తొమ్మిదవ ఏట వరకు. ఆ వయస్సు ఉన్న వారిని మాత్రమే కుమారీ పూజలో నియోగించాలి. ప్రతిరోజూ ఒకే వయస్సు వాళ్ళు అని కానీ, పెంచుకుంటూ వెళ్ళాలని కాదు. ఈ నడిమి వయస్సులో ఉన్నవారిని ఈ తొమ్మిదిరోజులు కూడా అమ్మవారి స్వరూపంగా ఆరాధన చేయాలి. దీనిని ప్రత్యక్ష పూజ అంటారు. అయితే ఈ బాలాపూజ విధానంలో ఒక్కొక్కరోజు ఒక్కొక్క పేరు శాస్త్రం చెప్తున్నది. ఇందులో రెండు సంవత్సరాల బాలికను కుమారీ అనే పేరుతో పూజించాలి. మూడు సంవత్సరాల బాలను త్రిమూర్తి అని అంటారు. నాలుగు సంవత్సరాల బాలను కళ్యాణీ అని అంటారు. ఐదు సంవత్సరాల బాలను రోహిణి ఆరు సంవత్సరాల బాల కాళిక ఏడు సంవత్సరాల బాల చండిక ఎనిమిది సంవత్సరాల బాల శాంభవి తొమ్మిది సంవత్సరాల బాల దుర్గాదేవి అని చెప్పబడుతున్నది. పది సంవత్సరాల బాలను సుభద్ర అనే నామంతో పూజించవచ్చు. అని వివరించారు. అయితే ఈ ఆరాధన చేసేటప్పుడు ఆరోజు ఏ నామం చెప్పారో ఆ నామంతో చేయవచ్చు. ఈవిధంగా కుమారీ పూజా విధానంగా చెప్పబడుతోంది.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML