What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Tuesday, 16 September 2014

జమ్మూ కాశ్మీర్ లోని సూర్య దేవాలయం:

జమ్మూ కాశ్మీర్ లోని సూర్య దేవాలయం:

ఇది 144 ఏళ్ల క్రితం (1868) జూన్ బుర్కీ అనే బ్రిటిష్ ఫోటోగ్రాఫర్ తీసిన ఛాయాచిత్రం. హెన్రీ హార్డీ కోల్ తన భారత పురావస్తు సర్వే నివేదిక 'ఇలస్ట్రేషన్స్ ఆఫ్ ఏన్షియంట్ బిల్డింగ్స్ ఇన్ కాశ్మీర్ (1869)' లో ఈ చిత్రాన్ని ప్రచురించారు. కోల్ వివరణ ప్రకారం...క్రీ.శ. 490-555మధ్య కాలంలో నిర్మితమైన సూర్యదేవాలయం ఇది. ఆలయ విస్తరణ క్రీ.శ.693-760మధ్యకాలంలో జరిగింది. భావాన్ కు సమీపాన ఇస్లామాబాద్ కు మూడు మైళ్ళ దూరంలో ఉన్న మార్తాండ్ అనే ప్రాంతంలో ఈ ఆలయం ఉంది. (ఇస్లామాబాద్ ప్రస్తుత పాకిస్తాన్ రాజధాని కాదు. కాశ్మీర్ లోని మరో పట్టణం). కాశ్మీర్ లోయకు అభిముఖంగా ఎట్టయినా పీఠభూమిపై సూర్య దేవాలయం ఉంది. కాశ్మీర్ లో తొలినాళ్ళ దేవాలయ నిర్మాణ శైలికి ఇది మచ్చు తునక. క్రీ.శ. 724-760నడుమ కాశ్మీర్ ను పాలించిన కర్కోట వంశీయుడు లలితాదిత్య ముక్తపిద ఆలయాన్ని బాగా విస్తరించి నిర్మాణం గావించాడు. ఇతని హయాంలో బౌద్ధ, హిందూ మతాలూ సమాదరణ పొందాయి. ఆలయం ఎట్టయినా ప్లాట్ ఫారంపై చతురస్రాకారపు మంటపంతో కూడి ఉంది. దీనిచుట్టూ 84 చిన్న చిన్న ఆలయాలు ఉండేవి. ప్రధాన ఆలయం పైకప్పు ధ్వంసమైనప్పటికీ గర్భాలయానికి వెళ్ళే ముఖద్వారం మాత్రం చెక్కు చెదరలేదు. గోడలలో కలిసిపోయే చతురస్రాకార స్తంభాలపై త్రికోణాకృతితో సమున్నతంగా ద్వారం నిలిచి ఉంది' అని పేర్కొనడమైనది.




No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML