శివశక్తిమయం ఈ విశ్వం. నటరాజు పరమేశ్వరుడు. ఆయన అభివ్యక్తి నాట్యం. అదే శక్తి. ఆ శక్తే పర్వతరాజపుత్రిగా అవతరించిన గౌరమ్మ. ఆ తల్లి విలాసాల శోభలే జగతి అంతా నిండి ఉన్నాయి. అవి చూసి పరవశిస్తున్నాడు ఈశ్వరుడు. శక్తి సహితుడైన ఈశ్వరుడే అనుగ్రహకారకుడు. అమ్మవారి అందాలకు ఆనందించే అయ్యవారి చూపులు జగతిలోని ఆపదలను తొలగించగలవు.
" జగత్త్రాతుం శంభోర్జయతి కరుణా కాచిదరుణా " అన్నారు ఆది శంకరులు. జగతిని రక్షించడానికి వ్యక్తమైన శివుని కరుణే అమ్మ. శక్తితో కలసిన ఆ కరుణామయ స్వరూపమే రుద్రుని అనుగ్రహ రూపం. జగతికి ఆపదల రోగాలను తొలగించే ఔషధ రూపం.
దిగంతాలలో వ్యాపించిన తన చిఛ్చక్తి విలాస శోభాలకు తానే పరవశించినవాడు, తానూ దిక్కుల్ని వ్యాపించినవాడే. ఆందుకే అది " దిగంబర వస్తువు". ఏ ఆవరణలూ లేని మాయాతీత పరబ్రహ్మ.
" క్వచిత్ వస్తుని" చాల గొప్ప పదం. ఒకానొక ( మాటకీ,మనసుకీ అందని అనిర్వచనీయ) వస్తువు " అది.
చైతన్య స్వరూపంగా అదే " దిక్కులలో వ్యాపించి ఉంది" కనుక దిగంబర.
అంబర శబ్దానికి వ్యాపించినది అని అర్ధం.
" దిక్కులలో వ్యాపించినదే దిగంబర". విశ్వవ్యాప్తంగా ఉన్న పరమేశ్వర చైతన్యం తన( చిచ్చక్తి) యందు తాను ఆనందించే ఆత్మారామం. ఆ ఆనంద వస్తువును గ్రహించినప్పు దు ఆపదలకు ఆనవాళేక్కడ?
పూర్ణానందానుభవమే. శివతాండవం. సర్వత్ర అదే దృశ్యమానమవుతోంది. అదే కృపాప్రసరణ!

No comments:
Post a Comment