ద్వాదిశ ఆదిత్యులు, అష్టవసువులు, ఏకాదశరుద్రులు, అశ్వినీ దేవతలు, మరుత్తుల పేర్లు:
ద్వాదశ ఆదిత్యులు 12 మంది. వీరు అదితి యందు కశ్యప ప్రజాపతివల్ల కలిగిన కుమారులు. వాళ్ల పేర్లు:
(1) ధాత, (2) మిత్రుడు, (3) అర్యముడు, (4) శక్రుడు, (5) వరుణుడు, (6) అంశుడు, (7) భగుడు, (8) వివస్వంతుడు, (9) పూషుడు, (10) సవిత, (11) త్వష్ట, (12) విష్ణువు.("ఆదిత్యానా మహం విష్ణుః" అని గీతలో కృష్ణ భగవానుడు పేర్కొన్నది). ఈ ద్వాదశాద్త్యులలోని పండ్రెడవవాడైన విష్ణువునే! (పేర్ల క్రమాల్లో భేదాలూండొచ్చు)
అష్టవసువులు - వీరిపేర్లు - (1) అపుడు, (2) ధ్రువుడు, (3) సోముడు, (4) ధరుడు, (5) అనిలుడు, (6) ప్రత్యూషుడు, (7) అనలుడు, (8) ప్రభాసుడు.
వీరందరూ తమభార్యలతో వశిష్ఠాశ్రమానికి వస్తారు. అందులో ప్రభానుని భార్య వసిష్టునివద్ద ఉన్న 'నందిని' అనే గోవును తన పరిచారికకు కాగాలని చెప్పగా, వీళ్లు దొంగిలిస్తారు. విశిష్ఠుడు కోపించి, వీళ్లను మనుష్యులుగా జన్మించండని శపిస్తాడు. ప్రభాసుడే భీష్మునిగా జన్మించి చాలాకాలం జీవించాడు. (పేర్ల క్రమాల్లో భేదాలూండొచ్చు)
ఏకాదశరుద్రులు 11 మంది. వీరు బ్రహ్మమానస పుత్రులు. వారి పేర్లు - (1) అజుడు, (2) ఏకపాదుడు, (3) అహిరుబధ్న్యుడు, (4) హరుడు, (5) శంభుడు, (6) త్ర్యంబకుడు, (7) అపరాజితుడు, (8) ఈశానుడు, (9) త్రిభువనుడు, (10) త్వష్ట, (11) రుద్రుడు. వీరిని దుద్రుని మానస పుత్రులుగా చెప్తారు. (పేర్ల క్రమాల్లో భేదాలూండొచ్చు)
అశ్వినీ దేవతలు - వీరు ఇద్దరు. వీరు వైద్యులు. వీరి అంశలతోనే నకుస-సహదేవులు జన్మించారు. చ్యవన మహర్షి వీరికి సోమరసం త్రాగే అర్హత కల్హించాడు. కనుక వీరు మరణం లేనివాళ్లయ్యారు. వారు: (1) నాసత్యుడు, (2) దస్రుడు.
మరుత్తులు - 49 మంది. దితి-కశ్యప కుమారులు. దితి కుమారుల్ని ఇంద్రుడు చంపుతూ వచ్చాడు. దితి బాధపడి, ఇంద్రుణ్ణి జయించే కుంరుణ్ణీ ప్రసాదించమని కశ్యపుణ్ణి ప్రార్థించింది. అంత దితి గర్భవతి కాగా, తనను చంపే పుత్రుడు పుట్టానున్నాడని తెలిసి, ఇంద్రుడు సూక్ష్మరూపంలో ఆమె గర్భంలో ప్రవేశించి, ఆ పిండాన్ని ఏడు ముక్కలు చేశాడు. ఇలా ఆ పండం మొత్తం 49 ముక్కలయింది. దితి మేల్కొని, అలా చంపవద్దనీ, ఈ బిడ్డలు నీకు మిత్రులే అవుతారని చెప్పి, ప్రార్థించింది. ఆ పండంనుండి ఏర్పడిన 49 మంది బిడ్డలు ఎంతకూ మరణించక పోవడంతో వారూ దేవతలే అని చెప్పి, వాళ్ళకు మరుత్తులు (గాలి) అని పేరు పెట్టారు. వారే మరుద్గణం. గాలికి, తుఫాన్లకి ప్రతినిధులు.
ఇక మరుత్తుల పేర్లు - (1) ఏకజ్యోతి, (2) ద్విజ్యోతి, (3) త్రిజ్యోతి, (4) జ్యోతి, (5) ఏకశక్రుడు, (6) ద్విశక్రుడు, (7) త్రిశక్రుడు, (8) మహాబలుడు, (9) ఇంద్రుడు, (10) గత్యద్రుశ్యుడు, (11) పతిసక్రుత్పరుడు, (12)మిత్రుడు, (13) సమ్మితుడు, (14) సుమితుడు, (15) మహాబలుడు, (16) ఋతజిత్తు, (17) సత్యజిట్టు, (18) సుషేణుడు, (19) ఫేనజిత్తు, (20) అంతిమిత్రుడు, (21) అనమిత్రుడు, (22) పురుమిత్రుడు, (23) అపరాజితుడు, (24) ఋతుడు, (25) ఋతవాహుడు, (26) ధర్త, (27) ధరుణుడు, (28) ధ్రువుడు, (29) విదారణుడు, (30) దేవదేవుడు, (31) ఈద్రుక్షుడు, (32) అద్రుక్షుడు, (33) వ్రతిసుడు, (34) ప్రసద్రుక్షుడు, (35) సభరుడు, (36) మహాయశస్కుడు, (37) ధాత, (38) దుర్గోధితి, (39) భీముడు, (40) అభియుక్తుడు, (41) అపాత్తు, (42) సహుడు, (43) ఘతి, (44) ఘవువు, (45) అనాయ్యుడు, (46) వాసుడు, (47) కాముడు, (48) జయుడు, (49) విరాట్టు. (శబ్దకల్పద్రువము)

మంచి విషయాల్ని తెలియజేశారు....God bless you..
ReplyDelete