సూర్య భగవానుడి ప్రసిద్ధ ఆలయం .....అరసవల్లి
సూర్య భగవానుడి ప్రసిద్ధ ఆలయం .....అరసవల్లి
శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయమైన అరసవల్లి దేవస్థానం
ప్రాంగణం.అలాగే ఉత్తరాయణ, దక్షిణాయన మార్పుల్లో భాగంగా ప్రతిఏటా మార్చి 9,
10, 11, 12 తారీఖుల్లోనూ, అక్టోబర్ 1, 2, 3, 4 తేదీల్లోనూ, స్వామివారి,
ధ్రువమూర్తిపై ఆదిత్యునిని తొలికిరణాలు తాకుతాయి. స్వామి పాదాల మీదుగా
మొదలై శిరోభాగం వరకూ సూర్యకిరణాలు ప్రసరించే అద్భుత, అపురూపమైన దృశ్యాన్ని
తిలకిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని ప్రతీతి.
ఇకపోతే... అరసవల్లి
క్షేత్రాన్ని ఆరోగ్య క్షేత్రంగానూ స్థానికులు పిలుస్తుంటారు. ప్రత్యేకించి
బొల్లి, కంటి వ్యాధులు, కుష్టు, వ్యాధులతో పాటు ఇతర మానసిక, శారీరక రోగాల
నుంచి విముక్తి కోసం బాధిత భక్తులు ఇక్కడికొచ్చి స్వామి వారిని
దర్శించుకుంటుంటారని ఆలయ నిర్వాహకులు పేర్కొంటున్నారు
శ్రీకాకుళం
జిల్లాలో శ్రీకాకుళం మండలంలో అరస వల్లి అనే గ్రామంలో ఉంది. శ్రీకాకుళం
పట్టణానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో గల ఈ గ్రామం శ్రీ సూర్యనారాయణ
స్వామి దేవస్థానము ద్వారా బహుళ ప్రసిద్ది చెంది ఉన్నది.
ఉషోదయ
కిరణాలతో సమస్త జీవ కోటినీ నవ చైతన్యంతో ఉంచుతున్న ఆ సూర్యభగవానుడికి నిత్య
పూజలు జరుగుతున్న ఆలయం అరస వల్లి. ఆ ఆలయంలో భాస్కరుణ్ణి పూజించిన వారు
అన్ని కష్టాలూ తొలగి హర్షంతో వెళతారని కాబట్టి ఒకప్పుడు ఈ ఊరిని హర్షవల్లి
అనే వారనీ అదే క్రమేణా అరసవల్లిగా మారిందని ప్రతీతి. మహాభాస్కర క్షేత్రంగా
పిలుస్తున్న ఆ ఆలయానికి యెంతో ఘనమైన చరిత్ర ఉందని స్ధల పురాణం చెబుతోంది.
ఆలయం తొలత దేవేంద్రునిచే నిర్మితమైందని పురాణ ప్రవచనం. గంగవంశరాజు గుణశర్మ
వారసుడైన కళింగ రాజు దేవేంద్రవర్మ క్రీ.శ. 673 సంవత్సరంలో ఈ దేవాలయాన్ని
నిర్మించారని లభించిన శాసనాల ద్వారా తెలుస్తుంది.
16వ శతాబ్దంలో ఈ ప్రాంతానికి నిజాం నవాబు సుబేదార్ గా వచ్చిన షేర్ మహమ్మద్
ఖాన్ తానే ఈ ఆలయాన్ని ధ్వంసం చేసినట్లు ఒక శాసనంలో చెప్పుకున్నారు. ఆయన
వద్ద ఉద్యోగిగా ఉన్న సీతారామస్వామి అనే పండితుడు మహమ్మద్ ఖాన్ దండయాత్ర
గురించి తెలుసుకుని, ఆలయంలో మూలవిరాట్ ను ఒక బావిలో పడేశారట. క్రీ.శ.1778
లో ఎలమంచిలి పుల్లాజీ అనే ఆయన ఆ బావిలో మూలవిరాట్ ను కనుగుని బయటకి తీసి
ధ్వంసమైన ఆలయాన్ని పునర్నిర్మించి, విగ్రహ ప్రతిష్ట చేసారు. ఆ తర్వాత
జిల్లాలోని ఆలుదు గ్రామస్ధులైన వరుదు బాబ్జీ దంపతులు ఆలయ వాస్తు నిర్మాణం
దెబ్బతినకుండా గర్భగుడిపై విమానాన్ని(గోపురం) పడ గొట్టి దక్షిణాది పద్ధతిన
కాకుండా ఓఢ్ర (ఒరిస్సా) సంప్రదాయంలో నిర్మించారు.
శ్రీ ఉషా,
పద్మినీ, చాయాదేవి, సమేతంగా ఇక్కడ కొలువైన సూర్య నారాయణుడు సకల జీవులకూ
సంక్షేమాన్ని, ఆయురారోగ్యాలనూ, ప్రసాదిస్తారని భక్తుల నమ్మిక. స్వామి రెండు
చేతులూ అభయ ముద్రలోనే ఉంటాయి. నడుముకు చురిక(కత్తి) ఉంటుంది. ఇక ఆయన
రథానికి సారధి అనూరుడు(అంటే తొడలు లేని వాడు అని అర్ధం) ఈ అనూరుడు
గరుత్మంతుడికి అన్న. ఈయనకే అరుణుడనే మరో పేరుంది). స్వామి విగ్రహానికి ఇరు
పక్కలా చత్రచామరాలతో సేవచేస్తున్న సనకసనందులు ఉంటారు.
మాములు
రోజులతో పోలిస్తే మాఘ, వైశాఖ , కార్తీక మాసాల ఆదివారాల్లో ఈ క్షేత్రానికి
వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అందునా రథ సప్తమి నాడు ఆ సంఖ్య
లక్షల్లోకి చేరుకుంటుంది.
అలాగే ఉత్తరాయణ , దక్షిణాయన మార్పుల్లో
భాగంగా ఏటా మార్చి 9, 10,11,12 తారీఖుల్లోనూ, అక్టో్బరు 1,2,3,4
తేదీల్లోనూ, స్వామివారి, ధ్రువమూర్తిపై ఆదిత్యుని తొలికిరణాలు ప్రసరించే
దృశ్యం చూడటానికి అంతే భారిగా భక్తులు తరలి వస్తారు. స్వామి పాదాల మీదుగా
మొదలై శరోభాగం వరకూ సూర్యకిరణాలు ప్రసరించే దృశ్యం అద్భుతం, అపురూపం అంటారు
భక్తులు.
అరసవల్లి క్షేత్రాన్ని ఆరోగ్య క్షేత్రంగా పిలుస్తారు
స్ధానికులు. ప్రత్యేకించి కంటి వ్యాదులు , బొల్లి, కుష్టు, వ్యాధులతో పాటూ
ఇతర మానసిక, శారీరక రోగాల నుంచి విముక్తి కోసం బాధిత భక్తులు ఇక్కడికొచ్చి
స్వామి వారిని కొలుస్తారు.
No comments:
Post a Comment