What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Sunday, 21 July 2013

తెలుగు మాసములలోని శుక్ల పక్షంలో పదకొండవ రోజున వచ్చే రోజును "శుద్ధఏకాదశి" అంటారు.

తెలుగు మాసములలోని శుక్ల పక్షంలో పదకొండవ రోజున వచ్చే రోజును "శుద్ధఏకాదశి" అంటారు.

మొత్తం 24 ఏకాదశులు ఉన్నాయి.
అవి:
1.చైత్ర శుద్ధ ఏకాదశి
2.చైత్ర బహుళ ఏకాదశి

3.వైశాఖ శుద్ధ ఏకాదశి
4.వైశాఖ బహుళ ఏకాదశి

5.జేష్ఠ శుద్ధ ఏకాదశి
6.జేష్ఠ బహుళ ఏకాదశి

7.*ఆషాఢ శుద్ధ ఏకాదశి*
8.ఆషాఢ బహుళ ఏకాదశి

9.శ్రావణ శుద్ధ ఏకాదశి
10.శ్రావణ బహుళ ఏకాదశి

11.భాద్రపద శుద్ధ ఏకాదశి
12.భాద్రపద బహుళ ఏకాదశి

13.ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి
14.ఆశ్వయుజ బహుళ ఏకాదశి

15.కార్తీక శుద్ధ ఏకాదశి
16.కార్తీక బహుళ ఏకాదశి

17.మార్గశిర శుద్ధ ఏకాదశి
18.మార్గశిర బహుళ ఏకాదశి

19.పుష్య శుద్ధ ఏకాదశి
20.పుష్య బహుళ ఏకాదశి

21.మాఘ శుద్ధ ఏకాదశి
22.మాఘ బహుళ ఏకాదశి

23.ఫాల్గుణ శుద్ధ ఏకాదశి
24.ఫాల్గుణ బహుళ ఏకాదశి

ఈ 24 పర్వదినాలకు ప్రత్యేకమయిన సందర్భాలు లక్షణాలు ఉంటాయి.
ఈ రోజు తొలి ఏకాదశి కనుక ఈ రోజు గురించి తెలుసుకుందాం.
*తొలి ఏకాదశి.
ఆషాడ శుద్ధ మాసంలో వస్తుంది.
దక్షిణాయన ప్రారంభ కాలంలో రావటం కారణంగా ఈ ఏకాదశి ప్రాముక్యతను సంతరించుకుంది.
ఉత్తరాయణ కాలం లోని పండగల సంఖ్య కన్నా దక్షిణాయనం లోని పండగల సంఖ్య ఎక్కువ.
శరదృతు ఆరంభకాలం కనుక వర్షాల మూలంగా అనారోగ్యాలు వాటిల్లే అవకాశం ఉంది కనుక ఉపవాసాన్ని చెయ్యటం ద్వారా ఆరోగ్య రక్షణార్ధం యోగులు ప్రతి ఏకాదశి రోజున "ఉపవాసాన్ని" సూచించారు.

ఇదే రోజున విష్ణుమూర్తి పాలకడలిలో నిద్రకు ఉపక్రమించటం కారణంగా ఈ రోజుకు "శయనఏకాదశి" అని కూడా పేరు ఉంది.

పూర్వకాలంలో ఈ రోజును సంవత్సరాదిగా పరిగణించేవారు.

తొలి ఏకాదశిని చాతుర్మాస వ్రతం గా మన హిందువులం జరుపుకుంటే.
బౌద్ధులు "వాసో" మాసం మొదట్లో పూర్ణిమ రోజున చాతుర్మాస వ్రతం ద్వారా ఉపవాస దీక్షను బుద్దుడిని స్మరిస్తూ జరుపుకుంటారు.
క్రైస్తవంలో "లెంట్" అను పేరుతో నలుబై రోజుల ఉపవాస దీక్షను జరుపుకుంటారు.
ఇంకా అనేక మతస్తులు అనేక పేర్లతో తమ తమ దైవారాదన లలో ఈ రోజును జరుపుకుంటూ ఉంటారు.

శరదృతువు యమ దంష్ట్రిక (యముడి కోర).
ఉత్తరాయణం కన్నా దక్షిణాయనంలో పండుగలూ పబ్బాలూ ఎక్కువ.
"లంఖణం పరమ ఔషధం".అనే ఉపవాస దీక్షకు నాంది "తొలిఏకాదశి

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML