గోరుపై తెల్లచుక్క ఎందుకు?
మనం ఆరోగ్యంగా ఉన్నామని తెలియజేప్పే సంకేతాల్లో గోళ్లు ఒకటి. గులాబి
రంగులో మెరిసిపోయే గోళ్లు మనం ఆరోగ్యంగా ఉన్నామని చెబుతాయి. శరీరంలో రక్తం,
రక్తసరఫరా సమృద్ధిగా ఉందని ఈ గోళ్లు సూచిస్తాయి. ఇలాంటి గోరుపై
ప్రత్యక్షమయ్యే తెల్లని గీతలు, చుక్కలు దేనికి సూచనో అర్థం కాక బుర్ర
బద్దలు కొట్టుకుంటాం. శరీరంలో పోషకాలు తక్కువైతే ముఖ్యంగా కాల్షియం, జింక్
లాంటి సూక్ష్మపోషకాలు తగిన మోతాదులో లేకుంటే ఇలాంటి చుక్కలు కనిపిస్తాయని
అనుకుంటాం. చాలామంది ఒకసారి డాక్టర్‌ని కలవాల్సి వస్తుందేమోనని కూడా సలహా
ఇస్తుంటారు. నిజానికి ఈ విషయంలో డాక్టర్‌ను కలవాల్సినంత భయపడే అంశం ఏమీ
లేదు. వైద్య పరిభాషలో ఇలా ఏర్పడే చుక్కల్ని పంక్చేట్ ల్యుకోనికియాగా
వ్యవహరిస్తారు. పేరు సంక్లిష్టంగా ఉంది గానీ దీనికి కారణం మాత్రం చాలా
చిన్నదే. చర్మంపై ఏదైనా గాయం అంటే కోసుకుపోవడమో, గీరుకుపోవడమో జరిగితే
కొద్ది రోజుల తరువాత అంతమేరా గీత లాగా ఏర్పడడం గమనిస్తాం.
అదేవిధంగా గోళ్ల విషయంలో కూడా జరుగుతుంది. ఏ గోడకు కొట్టుకునో, మరేదన్నా
గీరుకునో.. ఏదో ఒకరకంగా గోరుకు గాయం అయిన సందర్భంలో కొద్దిరోజుల తరువాత
ఇలాంటి గీతలు, చుక్కలు కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో అలర్జీలు, చిన్న
చిన్న ఫంగల్ ఇన్‌ఫెక్షన్ వల్ల కూడా ఇలాంటివి రావచ్చు. ముఖ్యంగా గోళ్లరంగు,
నెయిల్ పాలిష్ రిమూవర్ లాంటివి వాడినప్పుడు గోరు ఉత్పత్తి చేసే పదార్థాలు ఈ
చుక్కలు ఏర్పడేందుకు దోహదం చేస్తాయి. కొన్ని రకాల మందులు పడకపోయినా
తెల్లచుక్కలు కనిపిస్తాయి. ఈ తెల్లచుక్కలు సాధారణంగా 8 వారాల్లో
కనుమరుగవుతాయి. అలా కాకుండా ఎక్కువ రోజులుంటే మాత్రం సమస్యే. ఇవి ఒకవూటెండు
గోళ్లపై కనిపిస్తే సమస్య లేదు. కానీ అన్ని గోళ్లపై కనిపిస్తే మాత్రం
డాక్టర్‌ను కలవాల్సిందే. డయాబెటిస్, రక్తహీనత, సిర్రోసిస్, గుండె, కిడ్నీ
సంబంధిత సమస్యలున్నప్పుడు ఇలాంటివి అన్ని గోళ్లపై కనిపించే అవకాశం ఉంటుంది.
కాల్షియం తక్కువ కావడం వల్ల ఇవి ఏర్పడతాయన్నది మాత్రం అపోహే. హోర్మోన్‌లలో
తేడాల వల్ల జింక్ లోపం మాత్రం ఇందుకు కారణం కావచ్చు. వైరల్ ఇన్‌ఫెక్షన్లు,
డీహైవూడేషన్ వల్ల కూడా తెల్లచుక్కలు ఏర్పడతాయి. తెల్లచుక్కలేర్పడకుండా
ఉండాలంటే టాలిన్, ఫార్మాల్డిహైడ్ ఉన్న నెయిల్ పాలిష్ రిమూవర్స్ వాడకూడదు.
కృత్రిమ గోళ్లను పెట్టుకోవద్దు. ఒకవేళ మందుల వల్ల ఇవి వస్తున్నాయన్న
అనుమానం కలిగితే డాక్టర్ సూచన తీసుకోవాలి. జింక్ ఎక్కువగా ఉండే బఠాని,
గుమ్మడి, ఆకుకూరల్లాంటివి ఎక్కువగా తీసుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి.
ఆహారంలో విటమిన్లు, ఇతర పోషకాలు తక్కువ కాకుండా చూసుకోవాలి.
No comments:
Post a Comment