What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Monday, 22 July 2013

నాలుగు ముఖాలు ఉండటం బ్రహ్మ రూపం! నాలుగు చేతులు ఉండటం విష్ణు లక్షణం!నొసట కన్ను ఉండటం శివుడి లక్షణం! ఒకే ముఖం ఉండి కూడా ఆయన బ్రహ్మ, రెండే చేతులు ఉండి కూడా ఆయన విష్ణువు! నొసట కన్ను లేకపోయినా ఆయనే శివ స్వరూపం!

నాలుగు ముఖాలు ఉండటం బ్రహ్మ రూపం! నాలుగు చేతులు ఉండటం విష్ణు లక్షణం!నొసట కన్ను ఉండటం శివుడి లక్షణం!
ఒకే ముఖం ఉండి కూడా ఆయన బ్రహ్మ, రెండే చేతులు ఉండి కూడా ఆయన విష్ణువు! నొసట కన్ను లేకపోయినా ఆయనే శివ స్వరూపం!
అయన త్రిమూర్తుల లక్షణాలు పుణికి పుచ్చుకున్నాడు! అందుకే అయన భగవానుడు, వ్యాస భగవానుడు, బాదరాయణుడు, కృష్ణ ద్వైపాయనుడు...
వ్యాసుడు భారతీయ సంస్కృతిని రూపుదిద్దాడు! వేదాలని 4గా విభజించాడు! పంచమ వేదంగా ''మహాభారతాన్ని'' అందించాడు! బాగావతాది పురాణాలూ లోకానికి అందించాడు!
తన శిష్యులైన పైలుడికి ఋగ్వేదాన్ని, వైశంపాయునికి యజుర్వేదాన్ని, జైమినికి సామవేదాన్ని, సుమంతునికి అధర్వణ వేదాన్ని,అప్పగించి లోకంలో విస్తరిమ్పచేశాడు! వ్యాసుడు పరిపూర్ణ తత్వ జ్ఞానం తో బ్రహ్మ సూత్రాలని రచించాడు! '' మనుషుల్లో నేను వ్యాసుడిని అంటాడు గీతలో కృష్ణుడు! వ్యాసుడు వ్వైరాగ్యం అంటే భాద్యతలని వదిలేయడం కాదని దేనిమీదా వ్యామోహం పెంచుకోకుండా భాద్యతలని పరిపూర్ణంగా నిర్వహించదమనె సందేశాన్ని మహభారతం రూపంలో మనకి మనకి అందించాడు! వ్యాసుడి జనన తిధి '' ఆషాడ పూర్ణిమ'' అని బ్రహ్మాండ పురాణం చెబుతుంది!పూర్ణిమ అంటే సమగ్రత! వ్యాసపూర్ణిమ భారతీయ సాంప్రదాయాలలో గురుపూర్ణిమ! గురువు జ్ఞానప్రదాత! జ్ఞానం బ్రహ్మ స్వరూపం! అందుకే గురువు బ్రహ్మ, విష్ణు, పరమేశ్వర స్వరూపుడన్నాడు! ఈ దేశంలో ఎందరో మహాత్ములైన గురువులు, మహానుభావులు,ఉన్నారు!వారందరికి గురుస్తానీయుడు ''వేదవ్యాసుడు''.. విష్ణుమూర్తి మానస పుత్రుడైన అపాంతరతముడే ఈ వ్యాసుడిగా అవతరించాడు..
ఓయి వ్యసా! ఓయి విశాలబుద్దా! ఓయి వికసించిన అరవింధాలవలె దీర్ఘనేత్రాలు గలవాడ! భారతమనే తైలంలో ప్రపూర్ణమైన జ్ఞానమయ ప్రదీపాన్ని ప్రజ్వలింపజేశావు! అటువంటి నీకు వందనం'' అని ద్యాన శ్లోకం!

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML